Sunday, September 27, 2026
More
    HomeAndhrapradeshCM Revanth Reddy Varunayagam : కృష్ణమ్మతీరాన ఆధ్యాత్మిక తరంగాలు,సాగర్‌లో వైభవంగా 'వరుణయాగం' ప్రారంభం

    CM Revanth Reddy Varunayagam : కృష్ణమ్మతీరాన ఆధ్యాత్మిక తరంగాలు,సాగర్‌లో వైభవంగా ‘వరుణయాగం’ ప్రారంభం

    📰 Generate e-Paper Clip

    CM Revanth Reddy Varunayagam : ప్రజా దీవెన, నా గార్జునసాగర్ (విజయ విహార్):కృష్ణానది తీరం వేదమంత్రో చ్ఛారణలతో పుల కించిపోయింది. నాగార్జునసాగర్ విజయ విహార్ ప్రాంగణంలో ప విత్ర కృష్ణమ్మ ఒడ్డున రాష్ట్ర స మృ ద్ధిని, పచ్చదనాన్ని కాంక్షిస్తూ ‘వరుణ యాగం’ అత్యంత భ క్తిశ్ర ద్ధలతో వైభవంగా ప్రారంభమైంది.వేద పండితులు మరి యు ఋత్వికుల మంత్రోచ్ఛారణల నడుమ కార్యక్రమం ఆ ధ్యాత్మిక శోభతో ప్రారంభమైంది. యాగం నిర్విఘ్నం గా జర గాలని ప్రార్థిస్తూ ఋత్వికులు ముందుగా శాస్త్రో క్తంగా గో పూజ, విశ్వక్సేన పూజ నిర్వహించారు. పూజా కార్యక్ర మా ల అనంతరం వేద మంత్రాల జయజయధ్వనాల మధ్య యాగశాల ప్రవేశం ఘనంగా జరిగింది.

    యాగాన్ని ప్రారంభించిన మంత్రి దంపతులు

    రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫ రాల శాఖ మంత్రి ఎన్. ఉ త్తంకుమార్ రెడ్డి ఆయన సతీమణి పద్మావతి రెడ్డి దంపతు లు ఈ వరుణ యాగాన్ని అధికారికంగా ప్రారంభించి, ప్రత్యేక ప్రార్థనలు సమ ర్పించారు.ఈ ఆధ్యాత్మిక మహోత్సవంలో పలువురు ఉన్నతా ధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర దేవాదా య శాఖ కమిషనర్ హ నుమంతరావు, నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్, యాదగిరిగుట్ట ఈవో భవాని శంకర్, దేవాదాయ ధర్మా దాయ శాఖ డిప్యూటీ ఈవో, ఇతర ముఖ్య అధికారు లు పాల్గొన్నారు.

     

        సుభిక్షమైన భవిష్యత్తు వైపు

    కృష్ణవేణి ఒడ్డున వేద పండితుల ఆశీస్సులతో సాగుతున్న ఈ యాగం, వరుణ దేవుని కరుణతో రాష్ట్రంలోని జలా శ యాలను నిం పి, రైతాంగానికి నిరంతర నీటి పారుదలను, సమృద్ధిగల భవిష్యత్తును అందిస్తుందని అంతా ఆశాభా వం వ్యక్తం చేస్తున్నారు.

       రైతన్న క్షేమం మహావరుణయాగం

     

    నాగార్జునసాగర్: తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు కురిసి, కృష్ణా–గోదావరి నదులు జలకళతో పరవళ్లు తొక్కాలని, నాగార్జునసాగర్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని జలాశయాలు, చెరువులు నిండాలని, వానాకాలం పంటలు సమృద్ధిగా పండి రైతాంగం సుఖసంతోషాలతో ఉండాలన్న ఆకాంక్షతో నాగార్జునసాగర్ పవిత్ర కృష్ణానది తీరంలో మహా వరుణ యాగం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర నీటిపారుదల, పౌర సర ఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలి పారు.ఈ వానాకాలంలో రాష్ట్రంలో వర్షాల తీరు, వాటి పం పిణీ ఆశించినంత స్థిరంగా లేదని మంత్రి పేర్కొన్నారు. వ్య వసాయానికి ఒకటి రెండు సందర్భాల్లో కురిసే భారీ వర్షాల కంటే పంట కాలమంతా అవసరమైన సమయంలో, అవస రమైన ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురవడం అత్యంత ముఖ్యమన్నారు. వర్షాల మధ్య సుదీర్ఘ విరామాలు ఏర్పడి తే పంటల ఎదుగుదలతో పాటు సాగునీటి అవసరాలపైనా ప్రభావం పడుతుందని చెప్పారు.

    ప్రపంచ వాతావరణాన్ని ప్రభావితం చేస్తున్న ఎల్‌నినో (El Niño) పరిస్థితులను ప్రభుత్వం అత్యంత జాగ్రత్తగా గమ నిస్తోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. భారత వాతా వరణ శాఖ అంచనాల ప్రకారం గత రెండు నెలలుగా తెలం గాణలో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదైం దని, రాబోయే నెలల్లోనూ సాధారణ స్థాయి కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అంచనాలు ఉ న్నాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితి వానాకాలం పంటలకు, సాగునీటి లభ్యతకు సవాలుగా మారే అవకాశం ఉన్నందున ప్రభుత్వం పూర్తి అప్రమత్తతతో వ్యవహరిస్తోందన్నారు.

    తెలంగాణ సాగునీటి భద్రత రాష్ట్రంలో కురిసే వర్షాలపైనే ఆధారపడి ఉండదని, రాష్ట్ర జీవనాడులైన కృష్ణా, గోదావరి నదుల ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురిసే వర్షాలు కూడా అత్యంత కీలకమని మంత్రి వివరించారు. కృష్ణా బేసిన్‌లో కర్ణాటక, మహారాష్ట్రల్లో, గోదావరి ఎగువ పరివాహక ప్రాం తాల్లో మహారాష్ట్రతో పాటు ఇతర ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షించారు. ఎగువ ప్రాంతాల్లో మం చి వర్షాలు కురిసి సరైన ప్రవాహాలు వస్తే నాగార్జునసాగర్‌తో పాటు రాష్ట్రంలోని ఇతర జలాశయాలకు మరింత నీటి భ రోసా లభిస్తుందని తెలిపారు.

    వాతావరణ పరిస్థితులు మన నియంత్రణలో లేకపోయినా, వాటిని శాస్త్రీయంగా అంచనా వేసి రైతాంగంపై ప్రభావాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించడం ప్రభుత్వ బాధ్యత అని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. నీటిపారుదల శాఖ రాష్ట్రంలోని జలాశయాల నీటి నిల్వలు, నదుల్లో ప్రవాహా లు, ఆయకట్టు అవసరాలను నిరంతరం పర్యవేక్షిస్తోందని, వ్యవసాయ శాఖతో పాటు సంబంధిత అన్ని శాఖలతో సమ న్వయం చేసుకుంటూ అవసరమైన ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

    “ప్రభుత్వం కేవలం వర్షాల కోసం ఎదురుచూస్తూ కూర్చోదు. అందుబాటులో ఉన్న ప్రతి టీఎంసీ నీటిని, ప్రతి నీటి చుక్క ను రైతాంగ ప్రయోజనాల కోసం అత్యంత బాధ్యతతో విని యోగిస్తాం. వానాకాలం పంటలను కాపాడటం, రైతులకు సాధ్యమైనంత మేర సాగునీటి భరోసా కల్పించడమే ప్రజా ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యం” అని మంత్రి స్పష్టం చేశారు.ప్రభుత్వపరంగా చేయాల్సిన అన్ని చర్యలు తీసు కుంటూనే, మన సంస్కృతి, సంప్రదాయాలు, విశ్వాసాలకు అనుగుణంగా ప్రకృతి అనుగ్రహాన్ని కూడా కోరుకుంటు న్నా మని మంత్రి తెలిపారు. దేశ, రాష్ట్ర ప్రజల సర్వతోముఖ శ్రేయస్సు, రైతాంగ సంక్షేమం, సమృద్ధిగా వర్షాలు, పాడిపం టల అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సూచనల మేరకు ఆగస్టు 10న నాగార్జునసాగర్‌లో మహా వరుణయాగం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

    యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆధ్వ ర్యంలో 108 మంది ఋత్వికులు, 11 హోమకుండాలతో, వేదపండితుల సమక్షంలో నాగార్జునసాగర్ విజయవిహార్ ప్రాంగణంలో తెల్లవారుజామున 4 గంటల నుంచి సాయం త్రం 4 గంటల వరకు మహా వరుణయాగం వేదోక్తంగా నిర్వ హిస్తున్నట్లు మంత్రి తెలిపారు. మధ్యాహ్నం 3.20 గంటలకు జరిగే మహా పూర్ణాహుతిలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాల్గొంటారని వెల్లడించారు.ఈ మహా వరుణయాగం ద్వా రా తెలంగాణ అంతటా సమృద్ధిగా వర్షాలు కురవాలని, క ర్ణాటక, మహారాష్ట్ర సహా కృష్ణా–గోదావరి ఎగువ పరివా హక ప్రాంతాల్లో మంచి వర్షాలు పడాలని, కృష్ణా–గోదావరి నదులు పరవళ్లు తొక్కాలని, నాగార్జునసాగర్‌తో పాటు రా ష్ట్రంలోని అన్ని జలాశయాలు, చెరువులు నిండాలని, భూ గర్భ జలాలు పెరగాలని, వానాకాలం పంటలు సమృద్ధిగా పండాలని, ప్రతి రైతు ముఖంలో ఆనందం వెల్లివిరియాలని ప్రార్థిస్తున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

    “రైతు సంక్షేమమే మా ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యం. ప్రకృతి అనుగ్రహం, సమర్థవంతమైన జల నిర్వహణతో తెలంగాణ మరింత సస్యశ్యామలంగా, సుభిక్షంగా వర్ధిల్లా లని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను” అని మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆకాంక్షించారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.