
Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: కాంగ్రెస్ పార్టీ సేవాదళ్‌లో కీలక నియామకం చో టుచేసుకుంది. నల్గొండ జిల్లా సేవాదళ్ అధ్యక్షుడిగా చింత యాదగిరి నియమితులయ్యారు. ఈ బాధ్యతలు తనపై ఉం చిన పార్టీ అధిష్ఠానానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.తన నియామకానికి సహకరించిన తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవ నాలు, సిని మాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరె డ్డి వెంకటరెడ్డి, మాజీ జెడ్పీటీసీ, పట్టణ అధ్యక్షుడు గుమ్మల్ల మోహన్ రెడ్డి, మేయర్ చైతన్య శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ వంగూరి ల క్ష్మయ్య, రాష్ట్ర సేవాదళ్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులకు చింత యాదగిరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ పెద్దలు, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రా జగోపాల్ రెడ్డి, బాలు నాయక్, కుందూరు జయవీర్ రెడ్డి, వే ముల వీరేశం, బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మె ల్సీ శంకర్ నాయక్, డీసీసీ నల్లగొండ అధ్యక్షుడు పున్నా కైలాస్ నేతతో పాటు ప్ర జాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్య కర్తల సహ కారంతో సేవాదళ్ కా ర్యక్రమాలను మరింత విస్తరిస్తా మని ఆయన అన్నారు.
ప్రతి గడపకు సేవాదళ్
“కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి శ క్తి వంచన లేకుండా కృషి చే స్తాను. సేవాదళ్ కార్యక్రమాలను ప్రతి గడపకు తీసుకెళ్లేలా కార్యాచరణ రూపొందిస్తానని నూతన జిల్లా సేవాదళ్ అ ధ్యక్షుడు చింత యాదగిరి స్పష్టం చేశారు.పార్టీ నా యకులు, కార్యకర్తల సమన్వ యంతో సేవాదళ్‌ను క్షేత్రస్థాయిలో మ రింత చురుకుగా పనిచేసేలా తీర్చిదిద్దుతామని ఆయన పే ర్కొన్నారు. ప్రజలకు చేరువగా ఉంటూ పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడమే తనప్రధాన లక్ష్యమని తెలిపా రు.




