Opinionతెలంగాణనల్గొండసూర్యాపేట జిల్లాహైదరాబాద్

Nalgonda Collector Chandrasekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ హె చ్చరిక, లంచం తీసుకుంటే ఎంత టివారైనా వేటు తప్పదు

--ఇందిరమ్మ ఇళ్లమంజూరులో ఔట్‌సోర్సింగ్ ఏఈ బుక్యా గోపి ఉద్యోగం నుంచి తొలగింపు --విజిలెన్స్ విచారణలో బట్టబ యలైన అక్రమాలు --ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్లు 1800 4251442, 1800 599 5991

 

Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవెన, నల్లగొండ: పేదల సొంతింటి కలను నిజం చేసే ‘ఇం దిరమ్మ ఇళ్ల’ పథకం అమలులో పారదర్శకతకు అత్యంత ప్రాధా న్య తనిస్తున్నామని, ఇందులో ఎలాంటి అవినీతికి పాల్ప డినా సహించేది లేదని నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ స్ప ష్టం చేశారు. తిరుమలగిరి సాగర్ మండల గృహ నిర్మాణ శా ఖ ఔట్‌సోర్సింగ్ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) బు క్యా గోపి ల బ్ధిదారుడి నుంచి లంచం డిమాండ్ చేసి తీసుకున్నట్లు విజి లెన్స్ విచారణలో నిరూపి తం కావడంతో, అతడిని ఉద్యో గం నుంచి తక్షణమే తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

విజిలెన్స్ విచారణలో తేలిన నిజాలు

ఇందిరమ్మ ఇల్లు మంజూరు చే యాలంటే లంచం ఇవ్వా ల్సిందేనని ఏఈ బుక్యా గోపి వేధిస్తున్నాడంటూ బాధితులు నేరు గా రాష్ట్ర గృహ నిర్మాణ కార్పొరే షన్‌కు ఫిర్యాదు చేశా రు. రంగంలోకి దిగిన విజిలెన్స్ బృందం లోతైన దర్యాప్తు చే పట్టి, ఆరోపణ లు వాస్తవమేనని నివేదిక సమర్పించింది. ఆ నివేదిక ఆధారంగా కలెక్టర్ వెంటనే వేటువేశారు.

అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు

ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అక్రమాలకు పాల్పడిన వారు ఎంతటివారైనా కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చ రిం చారు. సంబంధిత అధికారులు, సిబ్బంది అత్యంత అప్రమ త్తంగా ఉండి లబ్ధిదారులకు పూర్తి పారదర్శక సేవలు అందిం చాలని సూచించారు. ఎవరైనా లంచం అడిగితే ప్రజలు నే రుగా జిల్లా యంత్రాంగా నికి లేదా అధికారిక టోల్‌ఫ్రీ నం బ ర్లు 1800 425 1442, 1800 599 5991 లకు సంప్రదిం చి సమాచారం అందించవచ్చని పేర్కొన్నారు.

Related Articles

Back to top button