Opinionక్రైంతెలంగాణనల్గొండసూర్యాపేట జిల్లాహైదరాబాద్

Kondamallepally Principal brutal Murder Case : బిగ్ బ్రేకింగ్, కొండమల్లేపల్లిలో క లకలం, ప్రిన్సిపాల్ హత్య కేసు లో ఇద్దరు విద్యార్థులు అరెస్ట్ ?

Kondamallepally Principal brutal Murder Case : ప్రజా దీవెన, దేవరకొండ: నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి ప్రాం తంలో సంచలనం రేపిన నాగార్జున స్కూల్ ప్రిన్సిపాల్ రూ పారెడ్డి హత్య కేసును పోలీ సు లు ఛేదించినట్లు సమాచా రం.ఈ ఘటనకు సంబంధించి పదో తర గతి చదువుతున్న ఇద్దరు విద్యా ర్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని వి చారిస్తున్నట్లు తెలుస్తోంది.

 

పోలీసుల సమాచారం ప్రకారం.. వంశీ, అనిల్ అనే ఇద్దరు విద్యా ర్థులు ఈ హత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నా రు. వీరిద్దరూ పిల్యా తండా, పుల్‌సింగ్ తండా ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించినట్లు సమాచారం.హత్యకు దారితీ సిన అసలు కార ణం ఏమిటన్న దానిపై పోలీసులు లోతు గా దర్యాప్తు చేస్తున్నా రు. విద్యార్థుల నుంచి కీలక వివ రాల ను రాబట్టేందుకు విచారణ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటన వెనుక మరేదైనా కార ణం ఉందా? హత్యకు ముందు ఏం జరిగింది? అనే కోణాల్లోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసుకు సంబంధించి మరిన్ని కీలక వివరాలను పోలీసులు త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.

బడిగంటల వెనుక దాగిన నెత్తుటిరహస్యం

తరగతి గదిలో ప్రశాంతంగా పాఠాలు వినే విద్యార్థుల ము ఖాల వెనుక ఇంతటి క్రూరత్వం దాగుంటుందని ఎవరూ ఊ హించలేదు. పాతికేళ్లుగా వందలాది మంది భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న ఒక విద్యాసంస్థలో, స్వయంగా గురు వునే కడతేర్చిన దారుణ ఘటన నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి లో వెలుగుచూసింది. కొండమల్లేపల్లి జేబీ నగర్‌లోని నాగా ర్జున కాన్సె ప్ట్ స్కూల్ ప్రిన్సిపాల్ కల్లు రూపా రెడ్డి నివాసం లోకి చొరబడిన దుం డగులు ఆమెపై కత్తి, బ్లేడుతో ఏకంగా 27 సార్లు విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చారు. అనంతరం ఇంట్లోని రూ.2 లక్షల నగదుతో పరారయ్యారు. నేరం జరిగిన స్థలంలో సీసీ కెమెరాలకు చిక్కకుండా, ఎలాం టి వేలిముద్రలు లేదా ఆనవాళ్లు దొరకకుండా అత్యంత ప క్కా ప్లాన్‌తో ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.

    వారం రోజుల్లో పోలీసుల ఛేదన

హత్య చేసిన తర్వాత కూడా నిం దితులు ఏమీ తెలియన ట్లు వా రం రోజుల పాటు రోజూ క్రమం తప్పకుండా స్కూలు కు హాజరవుతూ అందరినీ బురిడీ కొట్టించే ప్రయత్నం చేశా రు. అయితే ఈ కే సును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లా ఎ స్పీ ఆదేశాలతో ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగా యి.


  మొత్తంగా 150 మంది విచారణ

పదో తరగతి చదువుతున్న ఇద్ద రు మైనర్ విద్యార్థులే ఈ దారు ణానికి ఒడిగట్టినట్లు నిర్ధారణ అయ్యింది. ఎనిమిదో తరగతిలో చే రిన డే-స్కాలర్ విద్యార్థి ప్రత్యక్ష దాడికి పా ల్ప డగా, నర్సరీ నుంచే హాస్టల్‌లో ఉంటూ చదువుతున్న మరో విద్యార్థి ఈ నేరానికి స హకరించినట్లు ప్రాథమిక విచా రణ లో తేలింది. కాగా ఒకరిని అ దుపులోకి తీసుకోగా, మరొకరి కోసం గాలింపు కొనసాగుతోంది.విద్యా లోకంలో దిగ్భ్రాంతి డ బ్బుల కోసమే ఈ హత్య జరి గిందని పోలీసులు ప్రాథమి కంగా భావిస్తున్నారు. 25 ఏళ్ల క్రితం స్థాపించబడి, సుమారు 600 మంది విద్యార్థులతో ఆదర్శంగా నడుస్తున్న పాఠశాల లో, తమ చేతు లతో పెంచిన విద్యార్థులే ఇంతటి ఘాతు కా నికి పాల్పడటం ఉపా ధ్యాయ లోకాన్ని, స్థానిక సమా జాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచే సింది. ఈ కేసు పూర్తి వివరాల ను పోలీసులు త్వరలోనే అధికారికంగా మీడియా ఎదుట వెల్ల డించనున్నారు.

 

Related Articles

Back to top button