
MLA Komatireddy rajgopalreddy : ప్రజా దీవెన, ము నుగోడు: మునుగోడులో మొదలైన బెల్ట్ షాపుల నిర్మూలన ఉద్యమం ఇ ప్పుడు సరిహద్దులు దాటి విస్తరి స్తోంది. ము నుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీసు కున్న కఠిన నిర్ణయం, అమలు చే స్తున్న తీరు గ్రా మాల్లో విప్లవా త్మక మార్పులకు కారణమవుతోంది. మును గోడు వ్యాప్తం గా బెల్ట్ షా పులు కనుమరుగు కావడంతో ప ల్లెల్లో నేరాల శాతం గణనీయంగా తగ్గడమే కాకుండా, కు టుంబాల్లో ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. స్పూ ర్తితో కదులుతున్న పంచాయతీ లు మును గోడు సాధించిన ఫలితాలను చూసి పొరుగు నియోజ కవ ర్గాల్లోని పల్లెలు సైతం స్వచ్ఛం దంగా ముందుకు వస్తున్నా యి.
నకిరేకల్ నియోజకవర్గంలో
చిట్యాల మండలంలోని తాళ్ల వెల్లెంల, ఏపూర్, పెద్దకాపర్తి, పేరే పల్లి గ్రామ పంచాయతీలు బెల్ట్ షాపులను మూసివేయి స్తూ ఏకగ్రీవ తీర్మానాలు చేసి అమలులోకి తెచ్చాయి. కనగ ల్ మండల కేం ద్ర పంచాయతీ మరింత కఠిన నిర్ణయం తీ సుకుంది. బెల్ట్ షాపులు నిర్వహిస్తే ఏకంగా రూ. 50,000 జ రిమానా విధిస్తామని హెచ్చరి స్తూ చారిత్రక తీర్మానం ఆమో దించింది.
ఆనాటి సంకల్పం, నేటి వాస్తవం
ఈ మార్పు ఒక్క రోజులో వచ్చిం ది కాదు. 2018లోనే ప్రతి పక్ష ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే రాజగోపాల్ రెడ్డి ఈ సంస్కరణకు శ్రీకారం చుట్టారు. బెల్ట్ షాపులు నిర్మూలించిన గ్రామాలకు అభివృ ద్ధి నిధులు ఇస్తామని హామీ ఇచ్చి, నారా యణపూర్ మండలం అల్లందేవిచెరువు గ్రామంలో బెల్ట్ షా పులు రద్దు చేసినందుకు కో మటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా సొంతంగా రూ. 6 లక్షల అభివృద్ధి నిధులు అందిం చారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో సాధ్యం కాని ఈ లక్ష్యం, తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజా ప్రభుత్వం అధి కా రంలోకి రావడం తో పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చింది. ప ల్లెల రూపురేఖలు మా ర్చాలనే దృఢసంకల్పం ఇప్పుడు జి ల్లా వ్యాప్తంగా సరికొత్త సామాజిక చైతన్యానికి నాంది పలు కుతోంది.






