— ప్రజల రక్షణలో ప్రాణాలర్పించి న వీరులకు ఘననివాళులు
Nalgonda collector Chandrashekhar : ప్రజా దీవెన, నల్లగొండ క్రైమ్:దేశ రక్షణలో, ప్రజల ప్రాణాలు, ఆస్తుల పరిర క్షణలో విధి నిర్వహణ చేస్తూ ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమ రవీరుల సేవలు, త్యాగాలు చిరస్మరణీయమని నల్లగొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ లు
పేర్కొన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సం దర్భంగా మంగళవారం నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాల యం లో నిర్వహించిన కార్యక్రమంలో అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. అమరవీరుల కుటుంబసభ్యులు, పోలీస్ అధికారు లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రజల భద్రతలో పోలీసుల పాత్ర కీలకం
ఈ సందర్భంగా కలెక్టర్ చంద్ర శే ఖర్ మాట్లాడుతూ ప్రజలు ప్ర శాంతమైన వాతావరణంలో జీ వించేలా శాంతిభద్రతలను కా పా డటంలో పోలీస్ శాఖ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఎన్నో సవా ళ్ల ను ఎదుర్కొంటూ పోలీసులు ని రంతరం ప్రజల రక్షణ కోసం పని చేస్తున్నారని తెలిపారు. విధి ని ర్వహణలో ప్రాణాల ను సైతం లె క్కచేయకుండా అమరులైన పో లీసుల ధైర్యం, క ర్తవ్యనిష్ఠ, అంకితభావం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని కొనియా డా రు.
నేరాల నియంత్రణ, మహిళలు, బాలల భద్రత, రోడ్డు ప్రమా దాల నివారణ, సైబర్ నేరాలపై అవ గాహన కల్పించడం, మా దకద్ర వ్యాల నిర్మూలన వంటి కీలక రం గాల్లో పోలీసులు చేస్తు న్న సేవలు అభినందనీయమన్నారు. అమర వీరుల త్యాగాల ను స్ఫూర్తిగా తీ సుకుని యువత దేశభక్తి, క్రమశిక్షణ, సేవా భావంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
విధి నిర్వహణే పవిత్ర కర్తవ్యం
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ.. పోలీస్ ఉద్యో గం కేవలం వృత్తి మాత్రమే కాదని, ప్ర జల పట్ల బాధ్యత, దేశం పట్ల అంకితభావంతో కూడిన పవిత్ర కర్తవ్యమని స్పష్టం చేశా రు. 195 9 అక్టోబర్ 21న లడఖ్‌లోని హా ట్ స్ప్రింగ్స్ ప్రాంతం లో చైనా సైని కుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన పది మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది వీరమరణానికి గుర్తుగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు.
నల్లగొండ జిల్లాలో విధి నిర్వహ ణలో ఇప్పటివరకు 15 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రా ణత్యాగం చేశారని తెలిపా రు. దే శవ్యాప్తంగా ఈ ఏడాది విధి నిర్వ హణలో 154 మంది పోలీస్ అ ధికారులు, సిబ్బంది అమరుల య్యారని పేర్కొ న్నా రు. ప్రజల ప్రా ణాలు, ఆస్తుల రక్షణతో పాటు శాంతి భద్రతల పరిరక్షణ కో సం ప్రాణాలర్పించిన వీరుల సే వలను ఎప్పటికీ మరువలేమ న్నారు. వారి త్యాగస్ఫూర్తితో ప్రతి పోలీస్ అధికా రి, సిబ్బంది ప్ర జలకు మరింత నిబద్ధతతో సేవ లందించాలని సూచించారు.
అమరవీరుల కుటుంబాలకు గౌరవాభివందనం
అనంతరం దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన పోలీస్ అమరవీ రులందరికీ అధికారులు ఘనం గా నివాళులర్పించారు. అమ ర వీరుల కుటుంబ సభ్యులకు గౌరవాభివందనాలు తెలియ జేస్తూ, వారి త్యాగాలను సమాజం ఎల్లప్పుడూ గుర్తుంచు కుం టుందని పేర్కొన్నారు. ప్రజల భద్రత, సమాజ శ్రేయస్సు కోసం ప్రతి ఒ క్క రూ బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపు నిచ్చారు.ఈ కా ర్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ర మేష్, డీఎస్పీ కె. శివరాంరెడ్డి, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాస్, సీఐలు, ఆ ర్ఐలు, ఎస్ ఐలు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది, పోలీస్ అమర వీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.



