Nalgonda collector Chandra Shekhar : ప్రజా దీవెన, నల్లగొండ: ఎల్ నినో ప్రభావం వల్ల రా బోయే రోజుల్లో ప్రజలు నీటికీ ఇబ్బందులు పడ కుండా ఉన్న నీటిని జాగ్రత్తగా, పొదు పుగా విని యోగించు కోవ డంతోపాటు, నీటి సంరక్షణ చర్య లపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. ఇందులో భాగంగా అధికారులు ముందుగా జిల్లాలో ప్రస్తు తం అందు బాటులో ఉన్న నీటి వ నరులు, నీటి ని లువలపై ఆడిట్ నివేదికలు సమర్పించాలని ఆదే శించారు. గురువారం అయన తన చాంబర్లో ఆర్డ బ్ల్యూ ఎస్, మిషన్ భగీరథ, ఇరిగేషన్, విద్యుత్, పం చాయతీరాజ్ , పబ్లిక్ హెల్త్ తది తర శాఖల అధికా రులతో పాటు, శాస్త్రవేత్తల తో ఎల్ నినో కారణంగా భవిష్యత్తులో తాగు నీటి పరి స్థితిపై సమావేశం నిర్వహించారు.
ఐఐటి, హైదరాబాద్ ప్రొఫెసర్ స తీష్ మాట్లాడు తూ ప్రపంచ వ్యా ప్తంగా ఎల్ నినో ప్రభావం వల్ల తా గునీరు సాగునీరు ,వి ద్యుత్తు, వ్య వసాయం తదితర రంగాలపై ప్ర భావం ఉందని, అయితే ప్ర స్తుతం ఉన్న నీటి వనరులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకో వ డం ద్వారా నీటిని ఎలా స ద్వి నియోగం చేసుకోవాలో నీటి సం రక్షణ చేప ట్టాలో సమర్థవంతంగా నీటి ని వినియోగించు కో వడం, అ వసరమైన సమయాల్లో తక్కు వగా విని యోగిం చుకోవడం, నీటిని పొదుపు చేయడం వంటి చర్య లు చేపడితే సమస్య నుంచి బ యటపడవచ్చని అన్నా రు.
అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లా డుతూ జిల్లాలో 7 మండలాల లో సాధారణ వర్షపాతం ఉన్నప్పటికీ రాబోయే రోజుల్లో నీటి స్థాయిలు తగ్గే అవకాశం ఉందని, దీనిని దృష్టిలో ఉంచుకుని నీటిని పొ దు పుగా, జాగ్రత్తగా వాడుకోవ డం, అదే సమయం లో నీటి సం రక్షణ కార్యక్రమాలను చేపట్టడం వంటివి చెయ్యా లని, ఇందుకు గాను ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవ సరం ఉందని , ఇం దులో భా గంగా జిల్లాలోని ప్రతి గ్రామం, మండలం, మున్సి పల్ ప్రాంతాలలో ప్రస్తుతం ఉన్న నీటి వన రులు, వాటిలో అందుబాటు లో ఉండే నీటి వివరాలను తక్షణ మే సేకరించి సమర్పించాలని చె ప్పారు.
రాబోయే వానకాలం వర కు నీటిని జాగ్రత్తగా విని యోగిం చుకోవాల్సిన అవసరం ఉందని, ఒకవేళ ఎక్కడైనా నీటిని వృధా చేస్తే భవిష్యత్తులో తాగు నీటికి కూడా ఇబ్బందులకు పడే అవకాశాలు ఉ న్నాయన్న విషయం స్పష్టంగా ప్రజలకు తెలియ జేయాలని చెప్పారు. ఈ విషయం ప్రతి గ్రామానికి, ప్రతి మనిషికి చేరాల్సిన అవసరం ఉందన్నారు. జి ల్లా పంచాయతీ అధికారి ద్వారా ఆ ర్ డబ్ల్యూఎస్ అధికారులు ప్రతి గ్రామంలో నీటి వనరులన్నింటిని ఆడిట్ చేసి నివేదిక సమర్పించా ల్సిందిగా ఆదేశిం చారు. తాగునీ టిని సరఫరా చేసే పైప్‌లైన్ లీకేజీ లు ఉండకూడదని, తాగు నీరు వృధా లేని గ్రామాలు, ప్రాంతాల ను గుర్తించి వాటిని ” నీటి వృధా లేని గ్రామాలు, జోన్లుగా ప్రకటిం చాలని” చెప్పారు.
స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, ఆర్డబ్ల్యూ ఎస్ ఎస్ ఈ నాగేశ్వరరావు, పబ్లి క్ హెల్త్ ఎస్ ఈ వెంకటేశ్వరరా వు, ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధి కారులు, ట్రాన్స్‌కో అధికారులు డిపిఓ తరుణ్ చక్రవర్తి, ఇతర సం బంధిత అధికారులు ఈ సమా వేశానికి హాజరయ్యారు.
ఎలాంటి ఇబ్బందులు లేకుండా పత్తిని కొనుగోలుచేయాలి
నల్లగొండ: పత్తి రైతులకు ఎలాం టి ఇబ్బందులు లేకుండా పత్తిని కొనుగోలు చేయాలని జిల్లా కలెక్ట ర్ బి .చంద్ర శేఖర్ చెప్పారు. గు రువారం అయన నల్గొండ జిల్లా మునుగోడు సమీపంలోని సల్సా ర్ బాలాజీ జిన్నింగ్ మిల్లులో ఏ ర్పాటు చేసిన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పత్తి కొనుగోలు కేం ద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి కొనుగోలు కేంద్రానికి వ చ్చిన ప త్తి, ఇతర వివరాలను అడిగి తె లుసుకు న్నారు.సిసిఐ అధి కా రులు, రైతులు, జిల్లా వ్యవసా య అనుబంధ శాఖల అధి కా రులతో కలెక్టర్ మా ట్లాడారు. ప్రతి అమ్ము కునేందుకు స్లాట్ బుకింగ్‌లో ఏ మైనా సమస్యలు ఉన్నట్లయితే వెంటనే తన దృ ష్టికి తీసుకురావా లని చెప్పారు.
పత్తి తేమ శాతాన్ని పరిశీలించి ఎంత ఉందని అడిగి తెలు సు కున్నారు. కాగా ప్రస్తుతము ప్రైవేట్ జి న్నింగ్ మిల్లులు ప్రభు త్వం ప్రక టించిన మద్దతు ధరకు మించి కొనుగోలు చేస్తు న్నా రని, క్వింటాలు పత్తి 9160/-రూపాయలకు కొనుగోలు చేయ డం జరుగుతు న్నదని ప్రైవేట్ వ్యాపారస్తులు జిల్లా క లెక్టర్ దృష్టికి తీసుకువచ్చా రు. రైతుల నుండి అ లాగే కొను గోలు కేంద్రం నిర్వాహకుల నుండి సమ స్యలను కలెక్టర్ అడిగి తెలు సుకున్నారు. తూకం ఎలా చేస్తు న్నారని అడుగుతూ రిజిస్ట ర్లను సక్ర మంగా నిర్వహించాలని, సిసి ఐ కొనుగోలు కేంద్రం రిజిస్టర్ కు జిన్నింగ్ మిల్లు రిజిస్టర్ కు తేడా ఉండ కుండా చూడాలన్నారు. తూకం, ధరల్లో తేడా లే కుండా కొ నుగోలు చేయాలని చెప్పారు.పక్కనే ఉ న్న పత్తి రైతులతో కలెక్టర్ మాట్లాడారు. ఎక్కడినుం డి వచ్చారని?ఎకరాకు ఎన్ని క్విం టాళ్లు వస్తుందని ? ప్రస్తుతం గ్రా మాలలో భూగర్భ జలాల పరిస్థి తి ఎలా ఉందని? గత యాసంగి లో ఎలాంటి పంట లు వేశారని అ డిగి తెలుసుకున్నారు.
ఎల్ నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొ ని రానున్న యా సంగిలో రైతులు నీరు అందుబాటులో ఉన్నచోట వరి వేయ కుండా జొన్నలు, సజ్జ లు, పుచ్చకాయ, కూరగాయలు వంటి పంటలను వేసుకోవాలని, సమిష్టి వ్యవసాయం చేసేందుకు ముందుకు వస్తే రైతులు వారి పం టకి తగ్గట్టుగా అమ్ముకునేం దుకు జిల్లా యంత్రాంగం తరఫున ఏ ర్పాటు చేస్తామని, ఈ విషయం పై ప్రణాళిక రూపొందించాలని జి ల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్ ను, అలాగే డిసీఓ మమ త, మార్కె టింగ్ శాఖ ఏ డి ఛా యాదే విలను ఆదేశించారు. వేస విలో రైతులు కూరగా యలు లాం టివి పండిస్తే నిలువ ఉంచుకునేం దు కు ఆలోచించాలని, ప్రాథమిక వ్యవసాయ సహకార సం ఘాల గోదాములను మిల్లెట్స్ నిల్వ ఉంచుకునేందుకు సిద్ధం చేయా లని చెప్పారు. అలాగే పంట పం డించగానే రైతులు అమ్ముకునే వి ధంగా వారికి మార్కెటింగ్ అ నుసంధానం చేసేలా చూడా లని మార్కెటింగ్ శాఖ ఏడిని ఆదే శించారు.
మిను ములు, కుసు మ, ఆముదం వంటి పంటలు కూడా పండించేందుకు మునుగో డు ప్రాంతంలో భూము లు అను కూలంగా ఉన్నందున సమిష్టి వ్య వసా యం చేయడం ద్వారా ప్రతి రైతు మార్కెట్ కు వెళ్ల కుండా ఉ న్నచోటనే అమ్ముకునేం దుకు అవ కాశం ఉంటుందని, మార్కెట్ ను కల్పించే ఏ ర్పాటు చేసేలా చర్య లు తీసుకోవాలని అధికా రులు ఆదేశించారు. నీరు ఉన్నచోట మిల్లెట్స్ తో పాటు, కూరగాయ లు పండించే రైతులకు సబ్సిడీ పై బిందు, తుంపర పరికరాలతో పాటు ,విత్తనాలు కూడా సబ్సిడీ పై ఇచ్చే ఏర్పాటు చేస్తామని, రై తులు ముందుకు వచ్చి స్వల్ప కాలంలో కాలంలో పండే పంట లు వేసుకోవాలని చెప్పారు. రై తులకు సబ్సిడీపై విత్తనాలు, సౌ కర్యాలతో పాటు, మార్కె టింగ్ అ నుసంధానం, ప్రాసెసింగ్ యూని ట్లకు ప్రణాళిక రూపొందించాలని జిల్లా వ్యవ సాయ అధికారిని ఆ దేశించారు. జిల్లా వ్యవసాయ అ ధికారి వినో ద్ కుమార్, మా ర్కె టింగ్ ఏ డి ఛాయాదేవి, డిసిఓ మమత, సిసిఐ అధికారులు, త దితరులు ఉన్నారు.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
నకిరేకల్: నకిరేకల్ ప్రభుత్వ ఆ సుపత్రి ద్వారా ప్రజలకు మెరు గై న వైద్య సేవలు అందించాలని జి ల్లా కలెక్టర్ బి .చంద్రశేఖర్ ఆస్ప త్రి వైద్యులను ఆదేశించారు. గు రువారం ఆయన నకిరే కల్ లోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా త నిఖీ చేసి ఓపి రిజిస్టర్, ఆసుపత్రి ద్వారా అందిస్తున్న సేవలను పరిశీలించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్ట ర్ శోభ, ఇ త ర డాక్టర్లు, నర్సింగ్ సిబ్బందితో మాట్లాడారు . డాక్ట ర్లు సిబ్బంది హాజరు, ఫార్మసీ, ఎ మర్జెన్సీ వార్డు, లేబర్ రూమ్, స్టో ర్ రూమ్, గైనిక్ వార్డులను తని ఖీ చేశారు.
డాక్టర్లు ,సిబ్బంది సమయపాలన పాటించాలని, అలాగే ఆసు పత్రికి వచ్చిన వారందరికీ మంచి వైద్య సేవలందించాలని చె ప్పారు. ఆ సుపత్రిలో శానిటేషన్ సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు రాగా వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వానికి ఇదివరకే నివేదించ డం జరిగిందని తెలిపారు. పా ర్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాటు చే యాలని, ఆస్పత్రి ఆవరణలో లై టింగ్, నీ టి సరఫరా, పరిశుభ్రత ఉండేలా చూసుకోవాలని, ఎక్క డప డితే అక్కడ చేత వేయకుం డా చూడాలని, వినియోగించిన సిరంజీలు, ఇతర చెత్త ను జాగ్ర త్తగా డిస్పోజ్ చేయాలని చెప్పా రు. డాక్టర్లు,నర్సింగ్ స్టాఫ్,ఇతర సిబ్బంది సమయానికి రావాలని, విధులు సక్రమంగా నిర్వహించా లని అన్నారు.
జిల్లా కలెక్టర్ ఆయా వార్డులోని రోగులతో మాట్లాడుతూ డాక్ట ర్లు ఎలా సేవలందిస్తున్నారని? ఆసు పత్రి ఎలా ఉందని? అ డిగి తెలు సుకున్నారు .ఆసుపత్రి ద్వారా ని ర్వహించిన సాధా రణ ప్రసవాలు సిజేరియన్ ప్రసవాల గురించి అ డిగి తెలుసుకున్నారు.







