–రూ.20 కోట్లతో భక్తులకు మె రుగైన సౌకర్యాలు,
–పనులపై మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి పరిశీలన
Sri Chaya Someshwara Temple development : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్ : నల్లగొండ జిల్లాకు చారిత్రక, ఆధ్యాత్మిక గుర్తింపుగా నిలుస్తున్న పానగల్ ఛాయా సోమేశ్వరాల యాన్ని మరింత అభివృద్ధి చేసి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిం చేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని న ల్ల గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చై తన్య శ్రీనివాస్ రెడ్డి సూచించారు. రాష్ట్ర రోడ్లు, భవ నాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశాల మేరకు ఆమె ఆలయాన్ని సందర్శించి, చేపట్టాల్సిన అభివృద్ధి పనులను సంబం ధిత అధికారులతో కలిసి పరిశీలించారు.
ప్రభుత్వం ఆలయ అభివృద్ధికి మంజూరు చేసిన రూ.20 కోట్ల నిధులతో చేపట్టాల్సిన పనులపై మేయర్ అధికారులతో చ ర్చించారు. ఆలయ ప్రాం గణంలోని కోనేరుకు అన్ని వైపులా మెట్ల నిర్మాణం, ఆలయం వెనుకభాగం నుంచి భక్తులు సుల భంగా చేరుకునేందుకు రహదారి ఏర్పాటు వంటి అంశా లను పరిశీలించారు.
అభివృద్ధి పనులను ప్రణాళికా బ ద్ధంగా చేపట్టి, భ క్తులకు సౌ కర్య వంతమైన వాతావరణం కల్పిం చా లని అధికారులకు సూచించా రు. మంజూరైన ని ధులను సమ ర్థవంతంగా విని యోగించి, ఆలయ ప్రాంగణాన్ని మరింత ఆకర్షణీయంగా తీ ర్చిదిద్దేందు కు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.ఛాయా సోమేశ్వరాలయం నల్లగొండ జిల్లాకు ప్రత్యేకమైన చా రి త్రక, ఆధ్యాత్మిక వారసత్వమని, ఆలయ అ భివృద్ధితో ఈ ప్రాం త ప్రాధాన్యత మరింత పెరుగు తుందని మేయర్ పేర్కొన్నారు.
రహదారి పనులపైనా సమీక్ష
ఆలయ అభివృద్ధితో పాటు పట్టణంలోని రహదా రుల నిర్మా ణం, ప్రమాదాల నివారణపై కూడా మే యర్ దృష్టి సారించా రు. పీజీ క ళాశాల నుంచి అ ద్దంకి రోడ్డు మీ దుగా 565 జాతీ య రహదారికి అ నుసంధానమయ్యే రహదారి పనులపై చ ర్చించారు.సాగర్ రో డ్డులో తరచూ ప్రమాదాలు జరుగు తున్న నేపథ్యంలో, వైఎస్సార్ విగ్రహం నుంచి మెడి కల్ కళా శాల మీదుగా చర్లగౌరారం రోడ్డు వరకు డి వైడర్ల ఏర్పాటుకు చర్య లు తీసుకోవాలని సూచిం చారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశాల మే రకు ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు చేపట్టి, వాహనదారులు, ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇ వ్వాలని అధికారులకు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సి పల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బ గోని రమేష్ గౌడ్, 1వ డి వి జన్ కార్పొరేటర్ ఆల కుంట్ల నాగ రాజు, నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎడ్ల శ్రీనివాస్ యాదవ్, ఆలయ చైర్మన్ కోడద ల ఎల్లయ్య, పల్ రెడ్డి వెంకట్ రెడ్డి, గుండ గోని యాదయ్య గౌడ్, గురజాల నరేందర్, గుండ గోని శ్రీ నివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Sri Chaya Someshwara Temple development


