–రైతులకు ఇబ్బందులు లేకుండా సేకరణ
–నల్గొండలో 480 ఇందిరమ్మ ఇళ్లు
–కొత్తగా 27,255 మందికి చే యూత పెన్షన్లు మంజూరు
Minister Komatireddy Venkat Reddy ప్రజా దీవెన, నల్లగొండ: ఖరీఫ్ ధా న్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగ వంతం చేసి, రానున్న పది రోజుల్లో పూర్తి చేయాలని రాష్ట్ర రో డ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెం కట రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతులు కొనుగోలు కేం ద్రాల వద్ద రోజుల తరబడి ఎదురుచూడా ల్సిన పరిస్థితి రా కుండా అన్ని శా ఖల అధికారులు సమన్వయంతో పనిచే యా లని స్పష్టం చేశారు. న ల్గొండ, నకిరేకల్ నియోజక వర్గాల్లో ధా న్యం ముం దుగానే కొ నుగోలు కేంద్రాలకు చేరుతున్నం దున అక్కడ సేకరణను ప్రాధా న్యతతో పూర్తి చేయాలని సూ చిం చారు.శుక్రవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్ లో మిర్యాలగూడ ఎ మ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎ మ్మెల్సీ శంకర్ నాయక్, నల్గొండ మేయర్ బుర్రి చైత న్య శ్రీనివాస్ రెడ్డి తో కలిసి మంత్రి 2026-27 ఖరీ ఫ్ ధాన్యం సేకరణపై జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, సంబంధిత అధి కారులతో సమీక్ష నిర్వహించారు.
జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో సు మారు 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అం చనా వేసినట్లు కలెక్టర్ వివరిం చారు. ఇందులో 7 లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం, 2.35 ల క్ష ల మెట్రిక్ టన్నుల దొడ్డు ధాన్యం ఉంటుందని తెలిపా రు. మొత్తం 307 కొనుగోలు కేంద్రాలను ప్రతి పాదిం చగా, ఇప్పటికే 100 కేంద్రా లను ప్రారంభించి, 65 కేంద్రాల్లో కొనుగోళ్లు చేపట్టినట్లు వెల్లడించారు. ఇ ప్పటివరకు 55,174 మె ట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరినట్లు వివరించారు.
కొనుగోలు చేసిన ధాన్యాన్ని ని ల్వ చేసేందుకు ప్ర భుత్వ గోదా ములను వినియోగిస్తున్నామని కలెక్ట ర్ తెలిపారు. దీనిపై స్పందిం చిన మంత్రి, భవిష్యత్ అవస రా లను దృష్టిలో ఉంచుకొని గోదా ముల ని ర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాల ని సూచించారు. మ హిళా సంఘాల ఆధ్వర్యంలో గో దాముల నిర్వ హణకు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నందున, వచ్చే రెండే ళ్లలో జిల్లాలో అవసరమైన గోదాములను సిద్ధం చేయాల న్నారు.
2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ సొరంగం పూర్త యితే జిల్లా లో నా లుగు లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యే అవకాశం ఉందని, దీం తో ధాన్యం ఉత్ప త్తి మరింత పె రుగుతుందని మంత్రి పేర్కొన్నా రు. అందుకు అనుగుణంగా ఇ ప్పటి నుంచే నిల్వ సదు పాయా లను అభివృద్ధి చేయాలన్నారు. ప్రతిరోజూ కనీసం గంటపాటు ధాన్యం కొనుగోళ్ల పురోగతిని సమీక్షించా లని కలెక్టర్‌ను ఆదే శించారు.
ఎల్‌నినో ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలి
రానున్న రోజుల్లో ఎల్‌నినో పరి స్థి తులను దృష్టిలో ఉంచుకొని తా గునీరు, సాగునీరు, విద్యుత్ విని యోగం, ఆరుతడి పంట ల సాగు పై ప్రజల్లో విస్తృ త అవగాహన క ల్పించాలని మంత్రి సూచించారు. ప్రస్తుతం ప్రాజెక్టులు, రిజర్వా యర్లలో ఉన్న నీటి ని ల్వలు వచ్చే వర్షాకాలం వరకు తాగునీటి అవసరాలకు మా త్రమే సరిపోతా యని కలెక్టర్ వివరించారు. అందువల్ల నీటిని పొదుపుగా విని యోగించు కోవాల్సిన అవసరాన్ని ప్రజలకు తెలియజేస్తున్నా మని, రైతులు ఆరుతడి పంటల వైపు మొగ్గు చూ పేలా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.విద్యుత్ సరఫరాపై ఎస్పీడీసీఎల్ ఎస్ఈ శ్రీనివాస రావును మంత్రి వివ రాలు అడిగి తెలుసుకున్నా రు. ప్రస్తుతం జిల్లాలో రోజుకు 14 గంటలపాటు వి ద్యుత్ సరఫరా చేస్తున్నామని, ఎలాంటి ఇ బ్బం దులు లేవని ఎస్ఈ వెల్లడించారు.
నల్గొండలో 480 ఇందిరమ్మ టవర్స్ ఇళ్లు
నల్గొండ పట్టణంలోని నిరుపేద ల కు సొంతింటి కల సాకారం చేసేం దుకు దేవరకొండ రోడ్డులోని మామిళ్లగూడెం సమీపంలో ఇందిర మ్మ టవర్స్ నిర్మిం చనున్నట్లు మంత్రి వెల్లడించారు. మొత్తం 12 టవర్లలో ఒక్కో టవర్‌కు 40 చొ ప్పున 480 ఇళ్లు నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. ఇందుకో సం ఆరు ఎకరాల భూమిని జిల్లా యంత్రాంగం ప్రతి పాదించ గా మంత్రి అంగీకరించి, వెంటనే ప్రభుత్వానికి ప్రతిపాదన లు పంపించాల ని ఆదేశించారు.నల్గొండ పట్టణంలో ప్రతి సంవ త్స రం 500 చొప్పున మొత్తం 2, 000 ఇళ్లను ఇల్లు లేని నిరు పేద లకు అందిస్తామని ప్రకటించారు. ఇంది రమ్మ టవర్స్ ని ర్మాణాన్ని ఏ డాదిలోపు పూర్తి చే యాలని అధి కారులకు స్ప ష్టం చేశారు.
డంపింగ్ యార్డు తరలింపునకు ఆదేశం
చందనపల్లి డంపింగ్ యార్డును జనావాసాలకు దూరంగా మరో ప్రాంతానికి తరలించేందుకు చ ర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశిం చారు. గ్రామాలు లేని ప్రాంతంలో 100 ఎకరాల స్థలా న్ని గుర్తించి అ క్కడ నూతన డంపింగ్ యార్డు ఏర్పాటు చే యాలన్నారు. అవ సరమైతే కార్పొరేషన్ ద్వారా రుణం తీసు కొని నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయాన్ని ప ర్యాటక కేంద్రంగా అభివృద్ధి చే య నున్న నేపథ్యంలో అక్క డ పా ర్కు ఏర్పాటు, చెరువుకట్ట సుం దరీకరణ, ఆ లయ అభివృద్ధి, పానగల్ ఉదయ సముద్రం నుం చి తాగునీటి సరఫరా వంటి అంశా లను దృష్టిలో ఉంచుకొని డంపిం గ్ యార్డును త్వరితగతిన తరలించాలని కలెక్టర్‌కు సూచించారు.ఈ సమీక్షలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ హఫీజ్ ఖాన్, అద నపు కలెక్టర్ జె. శ్రీనివాస్, శిక్షణ సహాయ కలెక్టర్ శ్రీ కాంత్ రె డ్డి, పౌరసరఫరాలు, వ్యవసాయ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
కొత్తగా మంజూరైన చేయూత పెన్షన్ల పంపిణీ
నల్లగొండ: పేద ప్రజల సంక్షేమం, సామాజిక భద్రతే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర మంత్రి కో మటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అ ర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్ర భుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. భవిష్యత్తులో చేయూత పె న్షన్ మొత్తాన్ని రూ.4,000కు పెంచే అంశం ముఖ్యమంత్రి స్థాయి లో పరిశీలనలో ఉం దని వెల్లడిం చారు.శుక్రవారం నల్గొండ జిల్లా కేం ద్రంలోని ఏచూరి గార్డెన్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం కొత్త గా మంజూ రు చేసిన చేయూత పెన్షన్ల ను మంత్రి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ, ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పటి నుంచే కాంగ్రెస్ ప్రభు త్వం పేదల సంక్షేమానికి ప్రా ధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వ చ్చిన తర్వాత మహిళలకు ఉచి త బస్సు ప్రయాణం, సన్నబి య్యం పంపిణీ, 200 యూ నిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి పథ కాలను అమలు చే స్తోందని తెలి పారు. నల్గొండ పట్టణంలో మా మిళ్లగూడెం సమీపంలో 480 ఇం దిరమ్మ ఇళ్లను నిర్మించి పేద లకు అం దించనున్నట్లు మరోసారి వెల్ల డించారు. పార్టీలకు అతీతంగా అర్హులైన నిరుపేదలకు ఇళ్లు కేటా యిస్తామని, ఇల్లు లేని వా రందరికీ దశలవా రీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇ చ్చారు.పెన్షన్లు రాని వారు నిరాశ చెంద కుండా కొత్త గా దరఖాస్తు చే సుకోవాలని సూచించారు. ప్రజల కు ఎలాంటి సమస్యలు ఉన్నా త న దృష్టికి తీసుకురావాలని, పద వి లో ఉన్నా లేకున్నా ప్రజల కో సం పనిచేస్తానని మంత్రి అన్నా రు.
నల్గొండ జిల్లాలో 27,255 కొత్త పెన్షన్లు
నల్గొండ జిల్లాలో ప్రస్తుతం ప్రతి నె లా 1,97,262 మందికి పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని కలెక్టర్ బి. చంద్రశేఖర్ తెలిపా రు. ప్రభుత్వం తాజాగా మరో 27,255 మందికి కొత్త పెన్షన్లు మంజూరు చేసిందని వెల్లడించారు. నల్గొండ నియోజ కవర్‌గా నికి 4,259 కొత్త పెన్షన్లు మంజూరైనట్లు వివరించారు.ఐదు కే టగిరీల్లో వచ్చిన దరఖా స్తులను క్షేత్రస్థాయిలో క్షు ణ్ణంగా పరిశీలించి అర్హులను ఎంపిక చే సినట్లు తె లిపారు. ప్రస్తుతం అర్హు లైన పెన్షనర్లకు నెలకు రూ .2, 01 6 చొప్పున వారి బ్యాంకు ఖాతా ల్లో జమ చేస్తున్నామని చెప్పారు. పెన్షన్ రాని అర్హులు కొత్త గా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
2,430 దరఖాస్తుల్లో 2,036 మం దికి అర్హత
నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మా ట్లాడుతూ పెన్షన్లు పేదలకు కేవలం ఆర్థిక సహా యం మాత్రమే కాకుండా ఆత్మ గౌరవానికి ప్రతీక అని అన్నారు. నల్గొండ కార్పొరేషన్ పరి ధిలో కొత్త పెన్షన్ల కోసం 2,430 దరఖా స్తులు రాగా, వాటిలో 2,036 మంది అర్హత సాధించారని వెల్ల డించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు.ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ, ఇ చ్చిన హామీ మేరకు ప్రభుత్వం చే యూత పెన్షన్లను అందిస్తోందని, బడుగు బలహీన వర్గాల సంక్షే మానికి ప్రభుత్వం కట్టుబడి ఉం దని అన్నారు.
మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రా ష్ట్ర వ్యాప్తంగా సుమారు 40 లక్షల మం దికి పెన్షన్లు అందిస్తూ ప్రభు త్వం సామాజిక భద్రత కల్పిస్తోం దన్నారు. ఈ నెల 19వ తేదీ నుంచి కొత్త గా మంజూరైన పెన్షన్లు లబ్ధిదారుల బ్యాంకు ఖా తాల్లో జమ కానున్నాయని తెలిపారు.అనంతరం మంత్రి లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు ఉత్తర్వు లను అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మే యర్ అమీర్ అలీ, జిల్లా గ్రంథా లయ సంస్థ చైర్మన్ హఫీజ్ ఖాన్, శిక్షణ సహాయ క లె క్టర్ శ్రీ కాంత్ రెడ్డి, డీఆర్డీఓ శేఖర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్లు, కా ర్పొరేటర్లు, సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, అధికా రులు పాల్గొన్నారు.
Minister Komatireddy Venkat Reddy







