Tuesday, November 17, 2026
More
    HomeOpinionMla Vemula Veeresham key words on Welfare Schemes : ప్రభుత్వ విప్ వేముల...

    Mla Vemula Veeresham key words on Welfare Schemes : ప్రభుత్వ విప్ వేముల వీరేశం కీల క వ్యాఖ్య, పేదల సంక్షేమమే ప్ర జా ప్రభుత్వ లక్ష్యం, అర్హులైన ప్ర తి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ధ్యేయం

    📰 Generate e-Paper Clip

    Mla Vemula Veeresham key words on Welfare Sch emes  : ప్రజా దీవెన ,నార్కట్‌పల్లి: పేదల సంక్షేమం, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ఫలాలు అందించడమే లక్ష్యంగా ప్రజా ప్ర భుత్వం ముందుకు సాగుతోందని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎ మ్మెల్యే వేముల వీరేశం స్పష్టం చేశారు. గతం లో కొత్త పింఛన్ల కోసం ఎదు రుచూస్తూ ఇబ్బందులు పడిన అ ర్హులైన పేదలకు ముఖ్యమంత్రి రే వంత్‌రెడ్డి ప్రభుత్వం అండగా నిలుస్తోందని భరోసా ఇచ్చారు.మంగళవారం నార్కట్‌పల్లి మండల పరిషత్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖ ర్‌తో కలిసి నూ తనంగా మంజూరైన చే యూత పింఛన్ల మం జూరు పత్రాలను లబ్ధిదారులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పింఛన్ల సంఖ్యను పెంచుతూ మ రింత మంది పేద లకు ఆర్థిక భరోసా కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుం టోందన్నారు.

    కుటుంబ పెద్ద అనుకోని పరిస్థితు ల్లో మరణిస్తే ఆ కుటుంబం ఆర్థి కంగా కుదేలుకాకుండా ఉండేందుకు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా రూ.5 లక్షల బీమా రక్షణ కల్పిం చనున్నట్లు తెలిపారు. సన్నబియ్యం పంపిణీ, కొత్త రేషన్ కార్డు లు, మహిళ లకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు వంటి పలు సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని వివరించారు.

    గత ప్రభుత్వం రాష్ట్రంపై భారీ అ ప్పుల భారం మోపినప్పటికీ ఆర్థి క పరిస్థితులను చక్కదిద్దుకుం టూ సంక్షేమ కార్యక్రమా ల ను కొ నసాగిస్తున్నామని చెప్పారు. పే ద విద్యార్థులకు నాణ్య మైన వి ద్య అందించేందుకు నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్‌తో పా టు నార్కట్‌పల్లికి తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను మంజూరు చే యించినట్లు వెల్లడించారు. సాగునీటి రంగం లో నూ నియోజకవ ర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నామని, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుకు నీరు చేరిందని, నార్కట్‌పల్లి, లింగో టం చె రువుల్లోకి సైతం నీరు వ చ్చిందని తెలిపారు. తొండాయి, పర కాల–ఆసిఫ్‌నగర్ కాలువల అభివృద్ధికి చర్యలు తీసుకుంటా మని హామీ ఇచ్చారు.

    ప్రతి గ్రామానికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, ఇప్ప టికే ఒక్కో గ్రామానికి 30 ఇళ్ల చొప్పు న కేటాయించడంతో పా టు అదనంగా మరిన్ని ఇళ్లు మంజూరు చేయనున్నట్లు తెలిపా రు. గత ప్ర భుత్వం నిర్మించి అసంపూర్తిగా వదిలేసిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల వద్ద అంతర్గత రహదారులు, డ్రై నేజీ వంటి మౌలిక సదుపాయా లు కల్పించి వచ్చే నెలలో లబ్ధి దారులకు అందజేస్తామని ప్రక టించారు.

    జిల్లాలో మరో 27 వేల మందికి మంజూరు

    జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మా ట్లాడుతూ అర్హులైన ప్రతి ఒ క్కరికీ పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నా రు. న ల్గొండ జిల్లాలో ఇప్పటికే 1.97 ల క్షల మందికి పింఛన్లు అందిస్తుండగా, తాజాగా మరో 27 వేల మందికి కొత్తగా పింఛ న్లు మంజూరయ్యాయని వెల్లడించారు.ఐదు రకాల పింఛన్ల ద్వారా లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని, నకి రేకల్ నియోజక వ ర్గంలో కొత్తగా మంజూరైన పింఛ న్ల ద్వారా సుమారు రూ.1.30 కోట్ల మేర ప్రయోజనం చేకూర నుందని తెలిపారు. నియోజకవ ర్గంలో ప్రతినెలా సుమారు రూ.9 కోట్లు పింఛన్ల రూపంలో పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. అ ర్హ త ఉన్నప్పటికీ పింఛన్లు అందని వారు కొత్తగా దరఖాస్తు చేసు కోవాలని సూచించారు.

    ఈ నెల 19న ముఖ్యమంత్రి రే వంత్‌రెడ్డి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభిం చనున్నారని కలెక్టర్ తెలిపా రు. కుటుంబ యజమాని అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే ఆ కుటుం బానికి రూ.5 లక్షల బీమా పరిహా రం అందుతుందని వివరించారు. గ్రామపంచాయతీల్లో పథకం న మోదు ప్రక్రియ ప్రారంభమవు తుందని, ప్రతి కుటుంబం నామి నీ వివరాలతో దరఖాస్తు ఫారం పూర్తి చేయాలని సూచించారు. అర్హులైన ప్రతి కుటుంబం ఈ పథ కంలో నమోదు చేసుకుని ప్రయో జనం పొందాలని కోరారు.ఈ కా ర్యక్రమంలో స్థానిక సంస్థల ఇన్‌ ఛా ర్జి అదనపు కలెక్టర్ ప్రేమ్ కర ణ్ రెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి, ఎంపీడీవో ఉ మేష్, వివిధ శాఖల అధి కారు లు, సర్పంచులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

    Mla Vemula Veeresham key words on Welfare Schemes

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.