Monday, September 28, 2026
More
    HomeAndhrapradeshAmaravati Permanent Capital bill : బిగ్ బ్రేకింగ్, దేశ చరిత్రలో కొత్త అ ధ్యాయం,...

    Amaravati Permanent Capital bill : బిగ్ బ్రేకింగ్, దేశ చరిత్రలో కొత్త అ ధ్యాయం, చట్టబద్ధ శాశ్వత రాజ ధానిగా అవతరించిన అమరావతి 

    📰 Generate e-Paper Clip

    Amaravati Permanent Capital bill  : ప్రజా దీవెన, న్యూఢిల్లీ: భారత రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఆంధ్రపప్రదేశ్ రా ష్ట్రానికి అమరావతి ఇక అ ధికారి కంగా కేవలం కల కాకుండా చట్ట బద్ధ రాజధానిగా మనుగడ సా ధిం చనుంది. ‘ఏపీ పునర్విభజన చట్ట సవర ణ బిల్లు- 2026’కు రా జ్యస భ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్ప టికే లోక్‌సభలో ఈ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందిన వి షయం తెలిసిందే. అయితే ఇప్పుడు రాష్ట్రపతి సంతకం మాత్రమే మిగిలి ఉండగా అది పూర్తయిన వెంటనే అమరా వతి శాశ్వత రాజధానిగా ముద్రపడనుంది.

    ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు దిశను మలిచే కీలక నిర్ణయం దేశ రా జధాని ఢిల్లీలో రూపుదిద్దుకుంది. ఎన్నా ళ్లుగానో చర్చనీ యాంశంగా ఉన్న అమరావతి రాజధాని కథలో ఒక కొత్త అ ధ్యాయం ప్రారంభమైంది.రాజ్యసభలో ఘనంగా ఆమోదం పొందిన ఈ బిల్లు, అమరావతిని కేవలం ఒక నగరంగా కా కుండా ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తు కలల కేంద్రంగా నిలబెట్టింది. మూజువాణి ఓటుతో ఆమోదం పొందిన ఈ నిర్ణయం, రా ష్ట్రానికి ఒక స్థిరమైన దిశను సూచిస్తూ చరిత్రలో నిలిచిపో యే మలుపుగా మారింది.

    కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ని త్యానందరాయ్ సభలో బిల్లును ప్ర వేశపెట్టగా, చర్చలు ఉత్కంఠభరితంగా సాగా యి. కాంగ్రెస్ ఎంపీ రే ణుకా చౌదరి చర్చను ప్రారంభించ డం తో వివిధ అభిప్రాయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమం లో వైకాపాసభ్యులు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వాకౌ ట్ చేయడం సభలో ఉత్కంఠను మరింత పెంచింది. ఇప్పటి కే లోక్‌సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు, రాజ్యసభ గ్రీన్ సిగ్నల్‌తో మరింత బలపడింది. దీంతో అమరావతి రాజధా ని అంశానికి చట్టబద్ధత లభించి, రాష్ట్ర అభివృద్ధికి కొత్త బా టలు పడతాయనే ఆశలు మరింత బలపడ్డాయి.

      రాజధానిగా అమరావతి ప్రత్యేకం ఏమిటంటే

    ఒక రాష్ట్ర రాజధానికి కేంద్రం చట్ట బద్ధత ఇవ్వడం దేశ చరి త్రలో ఇదే మొట్టమొదటిసారి కావడం విశే షం. ఇది కేవలం పాలన నిర్ణయం కాదు ఇది భవిష్యత్తు నగరానికి అ ధికారిక గుర్తింపుగా నిలువనుoది. ఆంధ్రప్రదేశ్ మళ్లీ చరిత్ర సృష్టించి oదనడంలో సందేహం లేదు. 195 3లో ఆంధ్రరాష్ట్రం తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా నిలిచింది. ఇప్పుడు అదే వారస త్వాన్ని కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో అరుదైన ఘ నత సాధించింది.చట్టబద్ధ రాజధాని పొందిన తొలి రాష్ట్రం గా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.అమరావతి ఇక కేవలం రా జధాని కాకుండా భారతదేశంలో అత్యాధునిక, ప్రణాళికాబద్ధ నగ రం గా ఎదగబోతోందనడంలో ఎలాంటి సందేహం ఉండబోదు. ఏది ఏమై నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజ ల ఆకాంక్షలు నెరవేరడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.