Monday, September 28, 2026
More
    HomeAndhrapradeshCM Chandrababu in West Godavari: నేడు పశ్చిమ గోదావరిలో సీఎం చంద్రబాబు పర్యటన

    CM Chandrababu in West Godavari: నేడు పశ్చిమ గోదావరిలో సీఎం చంద్రబాబు పర్యటన

    📰 Generate e-Paper Clip

    CM Chandrababu in West Godavari: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari District) పర్యటనకు వెళ్లనున్నారు. ఆచంట నియోజకవర్గంలోని సిద్ధాంతం గ్రామంలో నిర్వహించే ‘మీ భూమి మీ హక్కు’ (Mee Boomi Mee Haaku) కార్యక్రమంలో పాల్గొని రైతులతో నేరుగా మమేకం కానున్నారు.

    రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ రీ సర్వే కార్యక్రమంలో భాగంగా రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల(Pass Books)ను  అందజేస్తోంది. ఈ నేపథ్యంలో సిద్ధాంతంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్వయంగా పాస్ పుస్తకాలను పంపిణీ చేసి రైతుల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు.

    ప్రభుత్వం జనవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రీ సర్వే కార్యక్రమాన్ని వేగవంతంగా అమలు చేస్తోంది. ఇప్పటివరకు 6,688 గ్రామాల్లో సర్వే పూర్తికాగా, వాటిలో 6,459 గ్రామాలకు చెందిన 26.46 లక్షల మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేసినట్లు అధికారులు వెల్లడించారు.

    Andhra Pradesh Chief Minister Chandrababu Naidu interacting with farmers during the Mee Bhoomi Mee Hakku programme in West Godavari district

    భూ రికార్డుల(Land Records) ను మరింత పారదర్శకంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోంది. రానున్న తొమ్మిది నెలల్లో మరో 10,357 గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేసి, మొత్తం 67.32 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

    Also Read: Three Die in Bihar Bus Accident: కాశీ యాత్రలో ఘోర విషాదం.. బీహార్ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భక్తుల మృతి

    ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్ ప్రకారం ఉదయం 10.25 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి, 11 గంటలకు పెనుగొండ మండలం (Penu  Gonda Mandal) సిద్ధాంతం గ్రామానికి చేరుకుంటారు. అనంతరం 11.15 గంటలకు జరిగే ప్రజా వేదిక సమావేశంలో పాల్గొంటారు.

    మధ్యాహ్నం 2.30 గంటలకు రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి వారి సమస్యలు, సూచనలను తెలుసుకుంటారు. ఆ తర్వాత 3.15 గంటలకు టీడీపీ నాయకులు (TDP Leaders) , కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తైన అనంతరం సాయంత్రం 5.35 గంటలకు అమరావతికి తిరిగి చేరుకుంటారని అధికారులు తెలిపారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.