Perni Nani Challenge to Government: ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ నియామకాలు (DSC Recruitments), స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీ వ్యవహారం రాజకీయంగా వేడెక్కుతున్న వేళ వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మచిలీ పట్నం(Machilipatnam) లో నిర్వహించిన ఓటర్ల జాబితా సవరణ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పలు అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీశారు.
తనపై బియ్యం దొంగతనం ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్న పేర్ని నాని, ఆరోపణల్లో నిజం ఉంటే విచారణ జరిపి అరెస్ట్ చేయాలని సవాల్ విసిరారు. “నిజంగా మీకు ధైర్యం ఉంటే కేసులు పెట్టి జైలుకు పంపండి. 2029 వరకు ఎదురుచూడకుండా ఇప్పుడే చర్యలు తీసుకోండి” అంటూ ప్రభుత్వాని (Andhra Pradesh government) కి సూటిగా సవాల్ చేశారు.
స్పోర్ట్స్ కోటా నియామకాల విషయంలో కూడా ఆయన పలు సందేహాలు వ్యక్తం చేశారు. మొదట క్రీడా కోటా (Sp orts Quota) ను 3 శాతానికి పెంచిన ప్రభుత్వం, అనంత రం వందలాది మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు ప్రక టించిందని గుర్తుచేశారు. అయితే క్రీడల సంఖ్యను అనూ హ్యంగా పెంచడం, కొన్ని వివాదాస్పద క్రీడలను జాబితాలో చేర్చడంపై ప్రశ్నలు లేవనెత్తారు.గత తొమ్మిది నెలలుగా ఎం పికైన అభ్యర్థుల పూర్తి జాబితాను ఎందుకు బహిరంగపర చడం లేదని పేర్ని నాని ప్రశ్నించారు. అధికారిక ధృవీకరణ ప్రక్రియ పూర్తికాకుండానే వివరాలు బయటకు ఎలా వచ్చా యో ప్రభుత్వం ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
డీఎస్సీ నియామకాలపై వస్తున్న విమర్శలను పక్కదారి పట్టించేందుకే ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన ఆరో పించారు. రాష్ట్రంలో ప్రజలకు సంబంధించిన కీలక సమ స్యలపై స్పందించని ప్రభుత్వం, డీఎస్సీ అంశంపై విమర్శలు వస్తే మాత్రం వెంటనే ప్రతిస్పందిస్తోందని విమర్శించా రు. డీఎస్సీ రిక్రూట్మెంట్, స్పోర్ట్స్ కోటా నియామకాలపై పూర్తి పారదర్శకతతో విచారణ జరగాలని కోరిన పేర్ని నాని, ని జాలు బయటపడితే బాధ్యులు సమాధానం చెప్పాల్సి ఉం టుందని హెచ్చరించారు.
