Ap girls accidental deaths : ప్రజా దీవెన, అమరావతి: కళాశాల చదువుల మధ్యలో చిన్న విరామం భావించే తరు ణంలో సెలవుల సం తోషం పల్లె గాలి, స్నేహం, నవ్వులు ఇ వన్నీ వెరసి ఒక అందమైన రోజు స్నేహితురాలు గ్రామానికి రావడం తో నాలుగు హృదయాలు మరింత దగ్గరయ్యాయి. ఆంధ్ర ప్రదేశ్ రా ష్ట్రంలో అల్లూరి సీతారామరాజు జిల్లా హు కుంపేట మండలం జంబు వలస గ్రామానికి చెందిన ముగ్గు రు బాలికలు మృత్యువాత పడడంతో విషాద ఛాయలు అ లుముకున్నా యి.
సంఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి…“జలపాతం దగ్గ ర ఫొ టోలు తీసుకుందాం, అది ఒక సరదా ఆలోచన మాత్రమే కానీ అది వారి జీవితాన్ని శాశ్వతంగా మార్చే సిం ది. అనంతగిరి అడవుల్లోని మలుంగుమ్మి జలపాతం, ప్రకృ తి అందం మధ్య నవ్వులు మార్మోగాయి. కెమెరా ముందు చిరునవ్వులు, సెల్ఫీల కోసం కేరింతలు క్షణంకూడా ప్రమా దం గురించి ఆలోచించలేదు.
అయితే ఒక్క జారి పడిన అడుగు అంతా మార్చేసింది. ఒక రు జలపాతంలోకి జారిపడగా, ఆమెను కాపాడాలనే ఆతుర తలో మిగతా ముగ్గురు కూడా ముందుకు దూకా రు. కానీ అది స్నేహానికి నిదర్శనం అయినా విధి మాత్రం క్రూరంగా వ్యవహరించింది. నీటి ఉప్పెనలో ముగ్గురు యువజీవితా లు మాయమయ్యాయి.
త్రిష (17), రత్నకుమారి (16), పవి త్ర(16) ఇంకా ఎన్నో కల లు కనే వయసులోనే, కాలం వారి కథను అక్కడే ముగించిం ది . ఇదిలా ఉండగా అంజలి మాత్రం ప్రాణాలతో బయట ప డింది కానీ ఆమె గుండెల్లో మిగిలింది స్నేహితుల జ్ఞాప కాల భారమే అని గ్రామస్థులు కన్నీరు మున్నీరయ్యరు. ఒకే కు టుంబానికి చెందిన ఆ ముగ్గురు బాలికల మరణం గ్రామాన్ని శోకసంద్రంగా మా ర్చింది. నవ్వులు మార్మోగిన ఇళ్లలో నిశ్శ బ్దం స్థిరపడింది. పల్లె గాలి కూ డా ఇప్పుడు విషాదాన్ని మో స్తోంది. ఒక సెల్ఫీ కోసం వెళ్లిన ఆ రోజు ఒక గ్రామానికి ఎప్ప టికీ మరిచిపోలేని దుఃఖంగా మిగిలిపోయిందన్న చర్చోప చ ర్చలు కొనసాగుతున్నాయి.
