Nalgonda SP Sharath Chandra Pawar : ప్రజా దీవెన, నల్లగొండ: మీ దగ్గర ఉన్న రూ. 1 లక్ష ఇస్తే దానికి బదు లు గా మీకు రూ. 5 లక్షల విలువైన రూ.500 నోట్లు ఇస్తాం” అం టూ అ మాయకులకు గాలం వేస్తున్న ఒక అంతర్జాతీయ మోసగాడి ఆట క ట్టించారు నల్గొండ పోలీసులు. సినిమాల్లో చూపించే మ్యాజిక్ ట్రి క్కులతో జనాన్ని నమ్మించి బురిడీ కొ ట్టిస్తున్న మాలి (వెస్ట్ ఆఫ్రికా) దేశ స్థుడిని తిప్పర్తి పోలీసులు అరెస్ట్ చేశారు.
నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపిన వివరాల ప్రకారం ఈ మోసగాళ్ల స్టైలే వేరు. ముందుగా వాట్సాప్ ద్వా రా పరిచయం చే సుకుంటారు. తమ దగ్గర ఒక ప్ర త్యేకమైన కెమికల్ ఉందని, దాని తో నల్లటి కాగితాలను కడిగితే అవి ఒరిజినల్ రూ. 500 నోట్లుగా మారిపోతాయని నమ్మిస్తారు. న మ్మకం కుదరడం కోసం బాధితుల ముందే ఒక నల్లటి కా గితాన్ని కె మికల్తో కడిగి, అసలైన నోటుగా మార్చి చూపి స్తారు (నిజానికి అది ముందే రంగు పూసిన అసలు నో టు).
వంగూరి జానయ్యకు వేసిన ‘కెమికల్’ గాలం ఈ నెల 6వ తేదీ న తిప్పర్తి మండలం మల్లేపల్లి వద్ద వంగూరి జానయ్య అనే వ్యక్తికి ఈ నిందితుడు పరిచయమయ్యాడు.రూ. 1లక్ష అసలు నగదు ఇస్తే రూ. 5 లక్షల విలువైన నోట్లు ఇస్తానని నమ్మించాడు. జానయ్యకు ఒక క ట్ట ఇచ్చాడు. దాని పైన, కింద నాలుగు అసలు నోట్లు పెట్టి, మధ్యలో కేవలం నల్లటి కాగితాలను ఉంచాడు.
బాధితుడు ఇంటికి వెళ్లి నిందితు డు ఇచ్చిన కెమికల్తో ఆ కాగితాల ను కడిగి చూస్తే రంగు పోలేదు సరే కదా, అవి మా మూలు కాగితాలని తేలింది. తిప్పర్తి పోలీసుల ‘రివర్స్ స్కె చ్ వేసి తాను మోసపోయానని గ్రహించిన జానయ్య, తన స్నేహి తుడు అంబేద్కర్ సహాయంతో నిం దితుడికి రివర్స్ గాలం వేశాడు. మరో రూ. 2 లక్షలు ఇస్తాంమాకు రూ. 10 లక్షల నోట్లు కావాలని న మ్మించి తిప్పర్తి రైల్వే స్టేషన్కు పి లిపించారు.
గురువారం మధ్యాహ్నం 12:30 గంటలకు నిందితుడు గో యిటా సౌంగాలో (Goita Soungalo) రా గానే, పక్కా ప్లాన్ తో పట్టుకుని పో లీసులకు అప్పగించారు. ఇదిలా ఉండగా నిoధితుడు గోయిటా సౌం గాలో (53) మాలి దేశస్థుడు కా గా ప్రస్తుతం హైదరాబాద్ టోలిచౌకి.తనిపై గతంలో మల్కా జిగిరి పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదయ్యాయి. 20 24లోనే వీసా గడు వు ముగిసినా దొంగచాటుగా భారత్లో ఉంటూ నేరాలు చేస్తున్నాడు.
నిoధితుని స్వాధీనం చేసుకు న్న వస్తువుల వివరాలు ఇలా ఉన్నాయి. 4 కట్టల నల్లటి కా గితాలు (నోట్ల సై జులో ఉన్న వి) నోట్లు కడిగే కెమిక ల్ ద్రా వణం, పౌడర్, ఒక రెడ్మీ మొ బైల్, రూ. 2,000 నగదు. త క్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపా దించాలనే ఆశతో ఇలాంటి మాయగాళ్ల చేతి లో మోసపోకండి. కె మికల్స్ వేస్తే కాగితాలు నోట్లుగా మార వు, ఇలాంటి అనుమానాస్ప ద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100 కి డయల్ చేయండని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రజలను కోరారు.ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన డి ఎస్పీ శివరాం రెడ్డి, సిఐ కొం డల్ రెడ్డి, ఎస్.ఐ వి.శంకర్ బృం దాన్ని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

