— పట్టణంలో భారీ ర్యాలీ మంత్రి కార్యాలయం ముట్టడి
ASHA Workers Salary Demand : ప్రజా దీవెన, నల్ల గొండ టౌన్: తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న బడ్జెట్ స మావేశాల్లో కాంగ్రెస్ ఎన్ని కల మేనిఫెస్టోలో ప్రకటించిన వి ధంగా ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ రూ. 18వేల వేతనం ఇవ్వాలని సిఐటి యు జిల్లా కార్యదర్శి ఎండి సలీం డిమాండ్ చేశారు. శుక్రవారం తెలం గాణ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర క మిటీ పిలుపుమేరకు మం త్రుల కార్యాలయం ముట్టడిలో భా గంగా దొడ్డి కొమరయ్య భవన్ నుం డి పెదగడియారం వరకు భారీ ర్యా లీ నిర్వహించారు. ఇందిరాభవన్ ముట్టడి చేయగా పోలీసులు జో క్యం చేసుకొని ఆర్డిఓ అశోక్ రెడ్డిని పిలువగా వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా సలీం మాట్లాడుతూ కాంగ్రెస్ మేనిఫె స్టోలో ఆశా వ ర్కర్లకు 18 ఫిక్స్డ్ వే తనం ఇస్తా మని హామీ ఇచ్చా రని అందుకు అ నుగుణంగా బడ్జెట్లో నిధులు కేటా యించా లని డిమాండ్ చేశారు. మూడు నెలల నుండి పారితోషకా లు రావడం లేదని వెంటనే చెల్లిం చాలని కోరారు ఆశా వర్క ర్లపై టార్గె ట్లు పెట్టి మానసిక వేదనకు గురి చేస్తున్నారని అనే కమంది ఆశా వ ర్కర్లు ఒత్తిడికి గురై మరణిస్తున్నా రని ఆవే దన వ్యక్తం చేశారు ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని పారితోష కాల విధానం రద్దు చేయాలని ఆరో గ్య శాఖ సంబంధంలేని ఇతర ప నులు చేయించవద్దన్నారు.బడ్జెట్ సమావేశాల్లో ఆశాల సమ స్యలు పరిష్కరించే విధంగా ఎన్ హెచ్ ఎం స్కీంకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ఆశా వర్కర్స్ యూని యన్ జిల్లా అధ్యక్షులు మహేశ్వరి కార్యదర్శి తవిటి వెంకటమ్మ సిఐటి యు జిల్లా ఉపాధ్యక్షులు దండెంప ల్లి సత్తయ్య, లేకపాక రాజు, సహా య కార్యదర్శులు పెంజర్ల సైదులు, జిల్లా కమిటీ సభ్యులు ఏదుళ్ళ సు నీత ఆదిమల్ల సుధీర్ సిహెచ్ అ నురాధ ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు సైదమ్మ రేణుక నవ నీ త కవిత శైలు తదితరులు పాల్గొ న్నారు.
అక్రమ అరెస్టులను ఖండించండి
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంత్రుల కార్యాలయాల ముట్టడి భగ్నం చేయడానికి పోలీసులు ఉదయం తెల్లవారు జామున మహిళ లని చూడకుండా అక్రమంగా అరెస్టు చే యడాన్ని ఖండిస్తున్నామని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దం డెంపల్లి సత్తయ్య అన్నారు. జిల్లా లో సుమారు 22 పో లీస్ స్టేషన్ లో 400 మంది వరకు ముందస్తు అరెస్టులు చే శారని ఇది దుర్మార్గమైన చర్య అని అన్నారు. ప్రజా పాలన అని చెబుతున్న ఇది రాక్షస పాలనగా మారిందన్నారు.

