Tuesday, September 29, 2026
More
    HomeOpinionEx Minister Harish Rao : బిగ్ బ్రేకింగ్, మాజీ మంత్రి హరీష్ రావు ఘాటు...

    Ex Minister Harish Rao : బిగ్ బ్రేకింగ్, మాజీ మంత్రి హరీష్ రావు ఘాటు వ్యాఖ్య, రేవంత్ రెడ్డి కళ్లు దేవుడిమాన్యాలమీదపడ్డాయి 

    📰 Generate e-Paper Clip

     

    Ex Minister Harish Rao : ప్రజా దీవెన, హైదరాబాద్: ప్ర జా సంక్షేమ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్లతో పాటు ఇప్పు డు దేవాలయాలు, మఠాలను సైతం కూల్చేందుకు కుట్రలు చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డెప్యూటీ ఫ్లోర్ లీడర్ల హరీష్ రావు మండిపడ్డారు. కోకాపేట్ నియోపోలిస్‌లోని వి శాఖ శారద పీఠం, రాజశ్యామల అమ్మ వారి ఆలయాన్ని రె వెన్యూ, పోలీ సు అధికారులు అకస్మాత్తుగా చుట్టుముట్టి ఖాళీ చేయాలంటూ భయాందోళనలకు గురిచేస్తున్న నేప థ్యంలో హరీష్ రావు హుటాహు టిన అక్కడికి చేరుకున్నా రు. ఆలయాన్ని సందర్శించిన అనంతరం ఆయన మీడియా తో మాట్లాడారు. ఈ సందర్భంగా హరీశ్ చేసిన వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే….

    వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు రేవంత్ రెడ్డి పాలన త యారైంది. అడ్డగోలు వ్యవహారాలకు, అక్రమాలకు పాల్పడు తున్న ఈ కాంగ్రెస్ ప్ర భుత్వం ఇప్పుడు ఏకంగా దేవాల యా లు, మఠాలను కూడా కూల్చే స్థాయికి దిగజారింది.2019లో కే సీఆర్ ప్రభుత్వంలో కోకాపేట సర్వే నెంబర్ 240లో విశాఖ శారద పీఠా నికి చట్టబద్ధంగా క్యాబినెట్ ఆమోదంతో రెండు ఎకరాల స్థలాన్ని కే టాయించాం.పీఠం నిర్వాహకులు ప్రభు త్వానికి 1 కోటీ 5 లక్షలు చెల్లించి రిజిస్ట్రేషన్ కూడా చేసుకు న్నారు. అలాగే హెచ్ఎండీఏ కు రూ. 23 లక్షలు చెల్లించి అ నుమతులు, విద్యుత్ కనెక్షన్ అన్నీ తీసుకున్నారు.

    ఇక్కడ అద్భుతమైన శారదా స్వరూప రాజశ్యామల అమ్మ వారి దేవాలయం, గోశాల, నిత్య అన్నదాన సత్రం, వేద పాఠ శాల నిర్మించారు. హైకోర్టు న్యాయమూర్తులు, అధికారుల స మక్షంలో పెద్ద స్వామీజీ చేతుల మీదుగా ప్రతిష్టా కార్యక్ర మం జరిగింది. అప్పటి నుంచి ఇక్కడ నిత్య పూజలు జరు గుతున్నాయి. హైదరాబాద్‌లో శారద పీ ఠం కింద 16 దేవా లయాలు, లక్షలాది మంది భక్తులు ఉన్నారు.కేసీఆర్ ఆనవా ళ్లు చెరిపేస్తా అంటూ కేసీఆర్ కట్టిన గుళ్లు, గోపురాలు, మఠా లను కూల్చడమేనా రేవంత్ రెడ్డి ఉద్దేశం.

    హైదరాబాద్‌లో హైడ్రా పేరుతో పేదల ఇళ్లుకూల్చావు, ఖ మ్మంలో ఇళ్లు కూల్చి 800 మందిని రోడ్డున పడేశావు. నీ పా లనలో అంతా కూ ల్చడమే తప్ప, నిర్మాణం లేదా వాటర్ వ ర్క్స్ HMWSSB కోసం ఈ స్థలం తీసుకుంటున్నామని ప్ర భుత్వం చెబుతోంది. వాటర్ వర్క్స్ కట్టాలంటే ఈ దేవాల యం స్థలమే దొరికిందా. సరిగ్గా ఈ ఆలయానికి రోడ్డు అవ తలే సర్వే నెంబర్ 239, 240 లలో 17 ఎకరాల ప్రభుత్వ స్థ లం ఉంది కదా, వాటర్ వర్క్స్ అక్కడ కట్టుకోవచ్చు కదా..

    ఆ 17 ఎకరాల భూమిని రేవంత్ రె డ్డి తన అల్లుడికి, మేన ల్లుళ్లకు, వాళ్ల అనుచరులకు భాగ్యలక్ష్మి మైన్స్ అండ్ మిన రల్స్ అక్రమంగా కట్టబెట్టారు. సమాచార హక్కు చట్టం కిం ద నేనే స్వయంగా అడిగితే ప్రభుత్వం ఇచ్చిన జవాబు ఇది. 10 ఎకరాలు ఇస్తే వాళ్లు 17 ఎకరాలు కబ్జాపెట్టారు. ఓపెన్ ఆక్షన్ వేస్తే ప్రభుత్వానికి వందల కోట్లు వచ్చేవి. కానీ లోపల లోపల నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టి ప్రజాధనాన్ని కొల్లగొ డుతున్నారు.

    హెచ్ఎండీఏ నిబంధనల ప్రకారం ఓఆర్ఆర్ కు కిలోమీటరు లోపల ఎలాంటి క్రషర్లు ఉండకూడదు. కా నీ రేవంత్ రెడ్డి త న అల్లుడి కోసం ఇక్కడ ఏకంగా 5 రెడీమిక్స్ ప్లాంట్లు, క్రషర్లు పెట్టించారు. పక్కన ఉ న్న బిల్డర్లంతా తన అల్లుడి దగ్గరే కం కర కొనాలని, లేకపోతే అనుమ తులు ఇవ్వమని బెదిరిస్తూ దందా చేస్తున్నారు.అల్లుడికి వ్యాపారం చే సుకోవడానికి 17 ఎకరాలు ఇస్తావు కానీ.. హిందూ ధర్మాన్ని ప్రచారం చేసే శా రద పీఠానికి ఉన్న రెండు ఎ కరాలను మాత్రం లాక్కుని కూ లుస్తావా..

    భక్తుల మనోభావాలను దెబ్బ తీయడమే నీధర్మమా.. తక్ష ణమే ఆ అక్రమ క్రషర్లను క్యాన్సిల్ చేయాలి.కనీసం నోటీసు లు ఇవ్వకుండా నిన్న రాత్రి 11:30 గంటలకు వందలాది మంది పోలీసులు, ఎంఆర్వోలు వచ్చి ఆలయం వద్ద పీఠాధి పతిని, నిర్వాహకులను భయభ్రాంతులకు గురిచేస్తారా. క్యా బినెట్ లో నిర్ణయం తీసుకునే ముందు పీఠా ధిపతులతో మాట్లాడే కనీస సంస్కారం ఈ ప్రభుత్వానికి లేదా.

    ఉదయం నేను ఇక్కడికి వస్తున్నా నని తెలియగానే పోలీ సులు, ఆర్ఐ, తహసీల్దార్ అందరూ పారిపోయారు. దొం గల్లా దాక్కోవాల్సిన అవసరం పోలీసులకు ఏమొచ్చింది.. ఉదయం స్వాములు పూజలు చేస్తుంటే పోలీసులు అడ్డు కున్నారు.దేవాలయంలో ఏళ్ల తరబడి జరుగుతున్న పూ జ లను ఆపే హక్కు, ధైర్యం రేవంత్ రెడ్డికి ఎవరిచ్చారు.. స్వా మీజీ వాగ్వాదానికి దిగాక అరగంట తర్వాత పూజకు అను మతించారు.

    కేసీఆర్ ఆనవాళ్లని చెప్పి రైతుబంధు, కేసీఆర్ కిట్, ఫీజు రీ యింబ ర్స్మెంట్ బంద్ చేసినావు.. ఇప్పుడు గుళ్లను కూడా వదులుతలేవు. దేవుని మీద పడ్డవాడు ఎవడూ బాగుపడ లేదు.. నీకేదో పోయేగా లం దాపురించింది, ఆ దేవుడి శాపం నీకు తప్పక తగులుతుంది.క్యాబినెట్‌లో ఉన్న మంత్రి శ్రీధర్ బాబు దయచేసి ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెచ్చి ఈ దేవా ల యాన్ని, మఠాన్ని కూల్చకుండా కాపాడాలి.లేనిపక్షంలో ఈ దేవాలయ పరిరక్ష ణ కోసం బీఆర్ఎస్ పార్టీ భక్తులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చే స్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చి న భూమిని కాపాడుకునే బాధ్యత మాదే. ఎంత దూర మైనా పోరాడుతాం తప్ప రాజశ్యామల ఆలయా న్ని కూల్చ నివ్వమని హరీష్ రావు స్పష్టం చేశారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.