Sunday, September 27, 2026
More
    HomeOpinionNalgonda Collector Chandrasekhar : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ కలెక్టర్ చం ద్రశేఖర్ హర్షం, జిల్లాలో...

    Nalgonda Collector Chandrasekhar : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ కలెక్టర్ చం ద్రశేఖర్ హర్షం, జిల్లాలో మున్సిప ల్ పోలింగ్ ప్రశాంతం 

    📰 Generate e-Paper Clip

    Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవెన, నల్లగొండ: మున్సిపల్ ఎన్నికలలో భాగంగా నల్లగొండ ము న్సిపల్ కార్పొరేషన్ తో పాటు, జి ల్లాలోని 6 మున్సిపల్టీలలో ఎన్నిక ల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగు తున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్ని కల అధికారి బి. చంద్రశేఖర్ తెలి పారు. బుధవారం మున్సిపల్ ఎ న్నికల పోలింగ్ ప్రారంభమైన వెం టనే ఆయన నల్గొండ జిల్లా కేంద్రం లోని ఎస్ఆర్ గార్డెన్ సమీపంలో ఉన్న ఉర్దూ మీడియం పాఠశా లలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేం ద్రాలను సందర్శించి అక్కడ ఓటర్ల కు చేసిన ఏర్పాట్లు, పోలింగ్ సరళి ని పరిశీలించారు. అన్ని గదుల నుండి వెబ్ క్యాస్టింగ్ ఉండేలా చూ డాలని, అన్ని పోలింగ్ కేంద్రాలలో ప్రథమ అందించేందుకు మెడికల్ టీంలు గేట్ సమీపంలో ఏర్పాటు చేయాలని, దివ్యాంగ ఓటర్లు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రం సమీ పంలో వీల్ చైర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని, పోలింగ్ కేంద్రంలోకి సెల్ ఫోన్ అనుమతించకూడదని, ఓటర్లు ఎన్నికల సంఘం అనుమ తించిన 18 గుర్తింపు కార్డులలో ఏదో ఒకటి చూపించిన వెంటనే లోపలికి అనుమతించాలని కలెక్టర్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. అనంతరం బోయవాడ పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన మోడల్ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి ఓటర్లతో మాట్లాడారు. సౌకర్యాలు, ఇబ్బందులపై ఆరా తీశారు.

    అనంతరం మీడియా ప్రతినిధుల తో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉ దయం 7గంటల నుండి జిల్లా వ్యా ప్తంగా అన్ని మున్సిపాలిటీలలో ఓ టర్లు ఓటు హక్కు వినియోగించు కునేందుకు క్యూలైన్లలో నిలు చు న్నారని, పోలింగ్ ఉదయం 7 గం టల నుండి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగిoదని తెలిపారు.

    ఓటింగ్ శాతం పెరిగేందుకు అవగా హన కల్పించడం వల్ల ఈ విడత ఓ టింగ్ పర్సంటేజ్ పెరిగేందుకు అవ కాశం ఉందన్నారు .ఓటర్లకు ఎక్క డ ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నామని, మహి ళ, పురుష ఓటర్లకు వేరువేరుగా క్యూలైన్ల ఏర్పాటు,తాగునీరు, టెం ట్,కుర్చీలు, దివ్యాంగ ఓటర్లకు వీ ల్ చైర్లు, హెల్ప్ డెస్క్లుఏర్పాటు చే శామని, ప్రత్యేకించి వార్డ్ ఆఫీస ర్ల ను కూడా నియమించామని, ఎ లాంటి ఇబ్బంది లేకుండా చూసు కుంటున్నారని, ఏవైనా సమస్యలు వస్తే పరిష్కరించేందుకు జిల్లా స్థాయిలో ఏర్పాటు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు.

    సమస్యలపై కంట్రోల్ రూమ్ లోని ఫోన్ నెంబర్ 180042 51442 కు ఫోన్ చేసి తెలియజేయాలని ఆయన కోరారు. అన్ని పోలింగ్ కేం ద్రాలలో 100 శాతం వెబ్ క్యాస్టింగ్ చేస్తు న్నామని, పోలింగ్ సిబ్బంది సంక్షేమం కోసం అన్ని చర్యలు తీ సుకున్నట్లు వెల్లడించారు. అనం తరం జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ కా ర్యాలయంలోని కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసి న వెబ్ కాస్టింగ్ ద్వా రా జిల్లా వ్యాప్తంగా నల్గొండ ము న్సిప ల్ కార్పొరేషన్, మిర్యాలగూడ , దేవరకొండ, నందికొండ, హ లియా,చిట్యాల,చండూరు మున్సిపాలిటీలకు సంబంధించి వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలించారు.

    మున్సిపల్ ఎన్నికల జిల్లా సాధా రణ పరిశీలకులు జి. రమే ష్, రెవె న్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివా స్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అద నపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, మున్సిపల్ కమిష నర్ శరత్ చంద్ర, స్థానిక తహసిల్దార్ పరశురాం, తదితరు లు ఉన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.