–ప్రజాపాలనలో పేదలందరికి సంక్షేమ పథకాలు
–నల్లగొండ కార్పొరేషన్ పరిధిలోని ప్రతి డివిజన్ లో ప్రజాదర్బార్
—ఓటుహక్కు వినియోగించుకున్న సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
Minister Komatireddy : ప్రజా దీవెన, నల్లగొండ:కాంగ్రెస్ పా ర్టీ ప్రజా ప్రభుత్వ పాలనలో పేదలం దరికీ సంక్షేమ పథకా లు అందుతున్నాయని రాష్ట్ర రోడ్లు,భవనాలు, సినిమాటో గ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా బుధవారం న ల్లగొండ పట్టణంలోని 33వ డివిజన్ మీర్ బాగ్ కాలనీ న ల్ల గొండ పబ్లిక్ స్కూ ల్లో ఓటు హక్కు వినియోగించుకు న్నా రు. అనంతరం మంత్రి విలేక రులతో మాట్లాడుతూ గత బి ఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేద ని, పేదల సంక్షే మం గురించి పట్టించుకోలేదని విమర్శించారు.
గతంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న వ్యక్తి ఎంజి యూని వ ర్సిటీ పట్టించుకున్న దాఖలాలు లేవన్నా రు. కాంగ్రెస్ ప్రభు త్వం అధికారం లోకి వచ్చిన తర్వాత నూతన భవనాలకు 200 కోట్లు కేటాయించడంతో పాటు, ఇటీవల నూతనంగా ఫార్మసీ కోర్సులను మంజూరు చేయించడం జరిగిందని అ న్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధి కారంలోకి వచ్చిన తర్వాతనే సం క్షేమ పథకాలు అమలవుతున్నాయని స్పష్టం చేశారు.
నల్లగొండలో అన్ని విధాలుగా అ భివృద్ధి చేసి ఇక్కడి ప్రజల రుణం తీర్చుకుంటానని తెలిపారు. పేద లకు ఏ సమస్య వ చ్చినా వారికి ఎల్లవేళలా అండగా ఉంటారని, నేను బతికు న్నంత కాలం పేద ప్రజల ను గుండెల్లో పెట్టుకుంటానని పే ర్కొన్నారు. మేయర్ ఎన్నిక పూర్తి అయిన తర్వాత ప్రతి డి విజన్ లో ప్రజా దర్బారు నిర్వహించి కార్పొరేటర్ ద్వారా ప్ర జల సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని అన్నా రు.
నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ లో 100 ఎకరాల భూమి ని సేకరించి దేవరకొండ రోడ్ లో 4000, నార్కట్ పల్లి రోడ్ లో 4,000 ఇందిర మ్మ ఇండ్లను 75 గజాలలో కట్టించి పేద లకు అందజేస్తామని తెలిపారు. నల్లగొండ మున్సిపల్ కార్పొ రేషన్ ఎన్నికలు పేదోళ్లకు సంబంధించిన ఎన్నికలని తెలిపా రు.
ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తే అన్ని డివిజ న్ లో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయ ని, పేద ప్రజల కు న్యాయం జరుగుతుందని అన్నారు. ఇతర పార్టీలకు చెం దిన అభ్యర్థులు గెలిస్తే ప్రజల సమస్యలు పరిష్కారానికి నో చుకోవన్నారు. త్వరలోనే నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న ప్రభు త్వ పాఠశాలలన్నింటిలో మౌలిక స దుపా యాలు కల్పిస్తానని, అంగన్వాడీలకు సొంత భవనాలు నిర్మి స్తామని స్పష్టం చేశారు.ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదు పాయాలు కల్పించిన నాణ్యమైన విద్యను అందించే విధం గా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాలను మోడల్ కాలేజీ గా మారు స్తామని తెలిపారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లో ఇ ప్పటికే కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు జ రుగు తున్నాయని, మరో 600 కోట్ల పనులకు సంబంధించి టెం డర్ దశలో ఉన్నాయని తెలిపారు.తక్కువ సమయంలో ఎ క్కువ అభివృద్ధి జరుగుతుందని చెప్పారు.నల్గొండ మున్సి పల్ కార్పొరేషన్ లో అన్ని ప్రాంతాలలో అండర్ గ్రౌండ్ డ్రై నే జీని ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
కాలనీలో ఉన్న ప్రతి పార్కును అభివృద్ధి చేయడం జరుగు తుందన్నారు. జిల్లా గ్రంథాలయాన్ని మోడల్ గ్రంథాల యం గా అభివృద్ధి చేస్తామని తెలిపారు.రూ.10 కోట్లతో అధునా తన షాదీ ఖానా నిర్మిస్తా మని అన్నారు. పట్టణ ప్రజలకు 24 గంటలు తాగునీరు వచ్చే విధంగా 12 ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు లు నిర్మిస్తున్నామని, ఇప్పటికే కొన్ని పూర్తయ్యా యని తెలిపారు.దీంతో త్వరలో అన్ని కాలనీలకు 2 4 గంట ల తాగనీరు అందుతుందన్నారు.
కార్పోరేషన్ లలో కాంగ్రెస్ పార్టీదే ఘనవిజయం ….
రాష్ట్రంలో జరుగుతున్న కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్ని కలలో అత్యధిక స్థానాలలో విజయం సాధిస్తామని ఈ సం దర్భంగా మంత్రి ధీమా వ్యక్తం చేశారు.ఏడు మున్సిపల్ కా ర్పొరేషన్లలో అన్నింటిలో గెలు పొందుతామని, 116 మున్సి పాలిటీలలో 110 స్థానాలలో విజయం సాధిస్తామని తెలిపా రు.ఐదేళ్ల మ న భవిష్యత్తు నిర్ణయించేది ఓటేనని, ప్రతి ఒక్క రూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. అర్బన్ ప్రాంతాలలో ఓటింగ్ శాతం తగ్గుతుందని, 90 శాతం పోలింగ్ అయ్యే విధంగా ప్రతి ఒక్కరు ఓటు వేసి ప్రజా సమ స్యల పరిష్కారం కోసం పనిచేసే వారిని ఎన్నుకోవాలని సూ చించారు.ఈ విలేకరుల సమావేశంలో జిల్లా గ్రంథాలయ సం స్థ చైర్మన్ డాక్టర్ ఎంఏ హఫీజ్ ఖాన్, నల్గొండ మాజీ ము న్సి పల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


