Monday, September 28, 2026
More
    HomeOpinionBig Breaking RTC UBI Account: బిగ్ బ్రేకింగ్, ఆర్టీసీ ఉద్యోగులకు తీపికబురు,ఉచితప్రమాద బీమాతో ఒక్కో...

    Big Breaking RTC UBI Account: బిగ్ బ్రేకింగ్, ఆర్టీసీ ఉద్యోగులకు తీపికబురు,ఉచితప్రమాద బీమాతో ఒక్కో కుటుంబానికి రూ.కోటి ఆర్థికసహాయం

    📰 Generate e-Paper Clip

     

    Big Breaking RTC UBI Account ప్రజా దీవెన, హైదరా బాద్: రోడ్డు ప్ర మాదం లో విషాదం అలుముకున్న కుటుం బానికి టీజీఎస్ఆర్టీసీ అండగా నిలిచింది. వివిధ సమయా లలో విధి వంచించి అకాల మృత్యువు వెంటాడిన ఇద్దరు డ్రైవర్స్ కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని అందించి భరోసా కల్పించింది. కుషాయిగూడ, ఉ ప్పల్ డిపోలకు చెంది న డ్రైవర్స్ వెంకటేశ్, డి.ఆర్.గౌడ్ లు రోడ్డు ప్రమాదంలో మృతి చెం దారు. ఇంటికి పెద్ద దిక్కు మృ తి చెందడంతో బాధిత డ్రైవర్ల కుటుంబంలో విషాదఛాయ లు అలుముకున్నాయి.

    ఈ ఆపద సమయంలో యూబీఐ సూపర్ శాలరీ సేవింగ్ అకౌంట్ బాధిత కుటుంబాలకు అక్కరకొచ్చింది. ఆర్థిక ప్ర యోజనంతో కూడిన సూపర్ సాలరీ సేవింగ్ అకౌంట్ క లిగి ఉండటంతో ఉచిత ప్రమాద బీమా పథకం వర్తించింది. సం స్థలోని ఉద్యోగులందరూ వారు నివసిస్తున్న ప్రాంతాల్లోని యూబీఐ బ్రాంచీల్లో సంస్థ సూచించిన ఖాతా ను తెరిచి రూ పే కార్డులను తీసుకు న్నారు. ఈ ఖాతా ద్వారా ఉచిత ప్ర మాద బీమా సౌకర్యం ఉండటంతో ఉద్యోగులకు ఎంతో ఆర్థి క ప్రయోజనం చేకూరుతోంది.

    ప్రమాదాలు జరిగిన సమయంలో సూపర్ సాలరీ సేవింగ్ అ కౌంట్ కింద యూబీఐ రూ. కోటి అందజేస్తోంది.ఈ మేరకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు బాధితకు టుంబా లు ఒక్కొక్కరికి రూ. కోటి విలువైన చెక్కులను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇ.డి అమ్రే ష్ ప్రసాద్,వారి సిబ్బంది తో కలిసి సంస్థ వీసీ అండ్ ఎండీ వై.నాగిరెడ్డి, ఐ.పి.ఎస్ శని వారం బస్ భవన్ లో అందజేశారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేరు వేరు సమ యాలలో జరిగిన ఈ రోడ్డు ప్రమాద ఘటనలో కుషాయి గూ డ డిపో, ఉప్పల్ డి పోకు చెందిన ఇద్దరు డ్రైవర్లు మ రణిం చడం విచారకరమన్నారు. త మ తప్పు ఏమీ లేకపోయినా రోడ్డు ప్రమాదంలో డ్రైవర్స్ అకాల మరణం చెందటం దుర దృష్టకరమన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి సంస్థ అధిక ప్రా ధాన్యతనిస్తున్నట్లు గుర్తుచేశారు. పోషణలో పెద్ద దిక్కు కో ల్పోయిన కుటుంబ సభ్యులకు సంస్థ అండగా నిలుస్తుంద ని, ఆత్మ స్థై ర్యం, ధైర్యం కోల్పోకుండా ఉండేందుకు బాధిత కుటుంబానికి ఉచిత ప్రమాద బీమా సౌకర్యం ఎంతో ఉపక రిస్తుందన్నారు.

    కొన్ని పథకాలు ఆపద సమయం లో అక్కరకు వస్తాయని, ఇందుకు ఇదే ఉదాహరణ అని, వాటిని విని యోగించుకోవ డంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వం వహించకూడదని సూచించారు. ఈ అవకాశాన్ని కల్పించిన యూబీఐకి ప్రత్యే క ధన్యవాదాలు తెలిపారు.

    ఇదిలా ఉండగా డ్రైవర్ ఎ. వెంకటే ష్ తన ఇంటి నుండి వి ధుల కోసం కుషాయిగూడ డిపోకు ఉదయం ద్విచక్ర వాహ నంపై వస్తుండగా కీ సర సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. తీవ్రంగా గాయప డిన ఆయన ఆసుపత్రిలో చికి త్స పొందుతూ మరణించారు. ఉప్ప ల్ డిపోకు చెందిన మ రో డ్రైవర్ డి.ఆర్. గౌడ్ తన ముగ్గురు కుటుంబ స్నేహితుల తో కలిసి హైదరాబా ద్ నుండి గానుగాపూర్ (కర్ణాటక) కు దై వ దర్శనం కోసం మారుతి కారులో వెళ్తుండగా తెల్లవారు జామున బొలెరో వ్యాన్ ను ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో డి.ఆ ర్. గౌడ్ మరియు ఇతర ముగ్గురు కుటుంబ స్నేహితులు అక్కడికక్కడే మరణించారు.

    ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డై రెక్టర్లు మునిశేఖర్, వెంక న్న, ఫైనా న్స్ అడ్వైజర్ పుష్ఫకుమారి, సీపీ ఎం ఉషాదేవి, యూబీఐ అధికారు లు చీఫ్ జనరల్ మేనేజర్ ఎం. ర వీంద్ర బాబు, డిప్యూటీ జనరల్ మే నేజర్ బి. భాస్కర్, ఆర్.సత్య నారాయణ, ఇతర అధికారులు గోపాలకృ ష్ణ, రజనీష్ కు మార్ పాండే తదితరులు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.