Sunday, September 27, 2026
More
    HomeOpinionBrs Kcr : బిగ్ బ్రేకింగ్, ఫోన్ ట్యాపింగ్ సిట్ సంచలన నిర్ణయం, బిఆర్ఎస్ అధినేత...

    Brs Kcr : బిగ్ బ్రేకింగ్, ఫోన్ ట్యాపింగ్ సిట్ సంచలన నిర్ణయం, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు నోటీసులు జారీ

    📰 Generate e-Paper Clip

     

    Brs Kcr : ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచ లనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీల క పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణలో విస్తృతస్థా యి లో చర్చనీయాంశమైన ఫోన్ ట్యాపింగ్ వ్య వహారంలో సిట్ దూకుడు పెంచు తోంది. గత కొంతకాలంగా తెలంగాణ రా ష్ట్ర రాజకీ యాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహా రంలో సిట్ అధికారులు మరింత వేగం పెంచారు.

    ఈ కేసు విచారణలో భాగంగా మాజీ సీఎం, బీఆర్ఎస్ అ ధి నేత కల్వ కుంట్ల చంద్రశేఖర్ రావుకు (KCR) స్పెషల్ ఇన్వె స్టిగేషన్ టీమ్(సిట్) నోటీసులు జారీ చేసింది. ఈ మేర కు హైదరాబాద్‌ నందినగర్‌లోని కే సీఆర్ నివాసానికి సిట్ అధి కారులు వెళ్లి ఆయన ఇంట్లో లేనందున అక్కడి సిబ్బం దికి నోటీసులు అంద జేశారు. సెక్షన్ సీఆర్పీసీ 160 కింద ఈ నో టీసులు కేసీఆర్‌కు జారీ చేశారు.

    ఈ క్రమంలోనే ఈ నెల 30వ తేదీ న శుక్రవారం మధ్యాహ్నం 3 గంట లకు కేసీఆర్‌ను ప్రశ్నించనున్నట్లు సిట్ అధికారులు నోటీసులో పేర్కొ న్నారు. మరోవైపు కేసీఆర్ విచారణకు సం బంధించి సిట్ కార్యాల యంలో అధికారులు అత్యవసర స మావేశం నిర్వహించారు. ఈ వి చారణలో అడగాల్సిన ప్ర శ్నల జా బితాను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ విచా రణ ప్రక్రియను ఎ క్కడ నిర్వహించాలి(ఆయన నివాసం లోbనా,లేదా సిట్ ఆఫీసులో నా అనే అంశాలపై అధికా రు లు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. భద్రతా పర మైన చర్య లు, చట్టపరమైన నిబం ధనలపై సిట్ అధికారులు కసరత్తు చేస్తున్నారు.

    తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభు త్వ హయాంలో ప్రతిపక్ష నేతలు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీల ఫోన్ల ను అక్రమంగా ట్యాప్ చేశారనే ఆరోపణలపై సిట్ అధికారులు ఈ విచా ర ణ చేపట్టారు. ఈ కేసులో ఇ ప్పటికే పలువురు పోలీస్ అధి కారులు అరెస్టై రిమాండ్‌లో ఉన్నారు. వారిచ్చిన వాం గ్మూ లం ఆధారంగా నే ఇప్పుడు కేసీఆర్‌కు నోటీసులిచ్చినట్లు వి నికిడి.

    ఈ నేపధ్యంలో శుక్రవారం మధ్యాహ్నం జరగబోయే విచార ణకు కేసీఆర్ స్వయంగా హాజరవుతారా లే క తన న్యా య వాదుల ద్వారా వివరణ ఇస్తారా అన్నది ఇప్పుడు ఉ త్కంఠ భరితంగా మారింది. ఈ పరిణామం తెలంగాణ రా జకీయా ల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం విధితమే.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.