Sunday, September 27, 2026
More
    HomeOpinionNalgonda Collector Chandrashekhar : సవ్యంగా శాంతియుత వాతావర ణంలో మున్సిపల్ ఎన్నికలు

    Nalgonda Collector Chandrashekhar : సవ్యంగా శాంతియుత వాతావర ణంలో మున్సిపల్ ఎన్నికలు

    📰 Generate e-Paper Clip

     

    Nalgonda Collector Chandrashekhar : ప్రజా దీవెన, నల్లగొండ: మున్సిపల్ ఎన్నికలను సవ్యంగా శాంతియుత వాతావరణంలోని ర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకు న్నట్టు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి. చంద్రశేఖర్ తెలిపారు. బుధవారం అయన మున్సిపల్ ఎన్నికల సం ద ర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాల యంలో ఏర్పాటు చేసిన ఎన్ని కల మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ మరియు మీ డియా కేంద్రాన్ని ప్రారంభించారు.

    అనంతరం సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీ ట్ లో మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో నల్గొం డ మున్సిపల్ కార్పొరేషన్, మిర్యా లగూడ, దేవరకొండ, నందికొండ, హాలి యా, చిట్యాల, చండూరు మున్సిపాలిటీలకు ఎన్నికలు ని ర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదే శం మేరకు బుధవారం ఎన్నికల నోటిఫికేషన్ ను ఆయా ము న్సిపల్ కేంద్రాల్లో జారీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ నెల 28 నుండి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైందని, 30 వర కు నామినేషన్ల స్వీకరణ ఉంటుం దని,ఈనెల 31న నా మినేషన్ల పరిశీలన , ఫిబ్రవరి 11న పోలింగ్, 13 న ఓట్ల లెక్కింపు ఉంటుందని కలెక్టర్ తెలిపారు.

    జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు సవ్యంగా నిర్వహించేందుకు గాను వివిధ నోడల్ టీములను ఏర్పాటు చేయడం జరిగింద ని, మున్సిపాలిటీల పరిధిలో ఉన్న మూడు లక్షల 9వేల97 మంది ఓటర్లు ఓటు వేసేందుకు గాను 162 వార్డులలో 4 75 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, తగినంత మంది ఆ ట ఓ, ఏ ఆర్ ఓ లు, సిబ్బందిని నియమించామని, ఎన్నికల సంఘం షె డ్యూల్ విడుదల చేసిన వెంటనే ఎన్నికల ప్రవర్త న నియమాలని క ఠినంగా అమలు చేస్తున్నామని, ఎఫ్ఎస్ టి ,ఎస్ఎస్ టి బృందా ల న్ని నిన్నటి నుండి చురుకుగా పని చేస్తున్నాయని తెలిపారు.

    ఎన్నికల సమయంలో 50 వేలకు మించి ఎక్కువ డబ్బును, అలాగే ఆధారాలు లేని గిఫ్ట్ ఆర్టికల్స్ ను తీసుకు వెళ్లేందుకు అనుమతి ఉం డదని, సరైన ఆధారాలు చూపిస్తే సరిపోతుం దని వెల్లడించారు. ఓట ర్లు స్వేచ్ఛగా ఓటు హక్కును విని యోగించుకునేందుకు అవసర మైన అన్ని చర్యలు తీసుకు న్నామని, ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులను కలెక్టర్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్ 18004251422 కు తెలి య చేయాలని, అలాగే సోషల్ మీ డియాలో వచ్చే అసత్య వార్తలు, ఫిర్యాదులను వాట్సాప్ నంబర్ 6 305951279 కు తెలియజే యా లన్నారు.

    జిల్లా ఎస్ పి శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ ఎన్నికలను సవ్యం గా నిర్వహించేందుకుగాను తగినంత బందోబస్తు ఏ ర్పాటు చేస్తున్నా మని, నగదు, మద్యం వంటివి పంపిణీ కా కుండా నిఘా ఉంచుతామని, ఫ్లైయింగ్ స్క్వాడ్స్, ఇతర బృం దాలను అప్రమత్తం చేశామని తెలి పారు.అంతకుముందు మీడియా కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ మాట్లాడు తూ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన సమా చారాన్ని మీడియా కేంద్రం ద్వారా మీడియా ప్రతినిధులకు ఎప్పటిక ప్పుడు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమా వేశంలో రెవెన్యూ అదన పు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సం స్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్, న ల్గొండ ఆర్డిఓ వై. అశోక్ రె డ్డి, డి పి ఆర్ ఓ యు. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నా రు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.