Monday, September 28, 2026
More
    HomeOpinionchild brutal murder IN mother's hand : బిగ్ బ్రేకింగ్, సిద్దిపేటలో కామం ముందు...

    child brutal murder IN mother’s hand : బిగ్ బ్రేకింగ్, సిద్దిపేటలో కామం ముందు కన్నప్రేమ దిగదుడుపు, ప్రి యుడి కోసం రెండేళ్ల పసికందును కడతేర్చిన కసాయి తల్లి

    📰 Generate e-Paper Clip

    child brutal murder IN mother’s hand : ప్రజా దీవెన, సిద్దిపేట: అది కన్న ప్రే మను మంటగలిపిన కామంధుల క్రూ రత్వం.. నమ్మిన భర్తకు నరకం చూపించిన ఒక మాయలాడి మోసం. తల్లి అనే పదానికే కలంకం తెస్తూ, కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నకొడుకునే కాటికి పంపింది ఒక కసాయి త ల్లి. ప్రియుడితో ఏకాం తానికి అడ్డువచ్చాడనే కక్షతో కేవలం రెండే ళ్ల పసికందును నేలకేసి కొట్టి చంపిన హృదయవిదార క సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫిట్స్ అం టూ ఆడిన డ్రామాలు, 20 రోజుల తర్వాత బయటపడిన అసలు నిజాలు స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి.

    పోలీసుల విచారణలో తేలిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జి ల్లా జగ దేవ్‌పూర్ మండలం తీగుల్ గ్రామానికి చెందిన స్వా మికి, జ్యోతికి కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరు ప్రస్తుతం మేడ్చల్ జిల్లా కీసరలో ని వాసముంటున్నారు. స్వామి క్యా బ్ డ్రైవర్‌గా కష్టపడుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరి కి నాలుగేళ్ల కూతురు, రెండేళ్ల కుమారుడు హరికృష్ణ ఉన్నా రు. అయితే, జ్యోతికి పెళ్లికి ముందు నుంచే యాదాద్రి భువ నగిరి జిల్లాకు చెందిన నవీ న్ అనే యువకుడితో అక్రమ సం బంధం ఉంది. భర్త క్యాబ్ తీసుకు ని డ్యూటీకి వెళ్లడమే ఆల స్యం.. నవీన్ నేరుగా జ్యోతి పడక గదిలోకి వచ్చేవాడు.

    ఏడుస్తున్నాడని ఏకంగా ప్రాణమే తీశారు

    గత నెల 29న స్వామి ఎప్పటిలాగే డ్యూటీకి వెళ్లాడు. లభిం చిన అవ కాశాన్ని వాడుకుంటూ నవీన్ జ్యో తి ఇంటికి వ చ్చాడు. ఇద్దరూ ఏ కాంతంగా గడుపుతున్న సమయం లో రెండేళ్ల చిన్నారి హరికృష్ణ గట్టిగా ఏడవడం ప్రారంభించాడు. ఆ ఏడుపు నవీన్ కు అడ్డుగా అనిపించింది. ఈ కొడుకు నా కు నచ్చలేదు.. వీడిని చంపేద్దాం అని నవీన్ అనగానే ఆ క న్నతల్లిలోని మానవ త్వం చచ్చిపోయింది. ఏమాత్రం వె ను కాడకుండా పచ్చజెండా ఊపే సింది.అంతే.. ఇద్దరూ కలిసి ఏడు స్తున్న పసికందును అత్యంత క్రూ రంగా గాల్లోకి లేపి నేలకేసి కొట్టా రు. తలకు తీవ్ర గాయమవ్వడంతో ఆ పసిప్రా ణం అక్కడికక్కడే విగత జీవిగా మారింది.

     ‘ఫిట్స్’ డ్రామా, గుట్టుగా అంత్య క్రియలు

    బాబు చనిపోయాడని కన్ఫర్మ్ చే సుకున్నాక జ్యోతి మైండ్ గేమ్ స్టా ర్ట్ చేసింది. భర్త స్వామి ఇంటికి రా గానే.. బాబుకు అకస్మాత్తుగా ‘ఫిట్స్’ (జబ్బు) వచ్చి చనిపోయాడంటూ గుం డెలు బాదుకుంటూ ఏ డ్చింది. భార్య కన్నీళ్లను చూసి ని జ మేనని నమ్మిన స్వామి, బంధు వులతో కలిసి మృతదేహాన్ని తమ స్వగ్రామమైన తీగుల్‌కు తరలించి, గుట్టుచప్పుడు కా కుండా అంత్యక్రి యలు పూర్తి చేసేశారు.

    పాపం పండింది, నిజం నిలకడగా తెలిసింది

    కథ ఇక్కడితో ముగిసిపోతుందని ఆ కిరాతకులు భావించా రు. కానీ, పాపం పండింది. బాబు చనిపోయి నప్పటి నుంచి జ్యోతి ప్రవర్తనలో విపరీతమైన మార్పులువచ్చాయి. ఆమె ఫోన్ కాల్స్, ప్రవర్తనపై భర్త స్వామికి అనుమానం బలపడిం ది. దీంతో కుటుంబ సభ్యుల సమక్షం లో ఆమెను గట్టిగా నిలదీశాడు. థ ర్డ్ డిగ్రీ రేంజ్ ఒత్తిడి తట్టుకోలేకపోయిన జ్యో తి.. తానే ప్రియుడితో క లిసి కొడుకును చంపేసినట్లు అస లు నిజాన్ని కక్కేసింది. దీంతో భార్య నోటవిన్న భయానక ని జానికి స్వామి నిర్ఘాంతపోయాడు.

    వెంటనే కీసర పోలీసు ల ను ఆశ్రయించాడు. రంగంలోకి ది గిన పోలీసులు ఘటనా స్థ లానికి చేరుకుని, తీగుల్ గ్రా మం లో పూడ్చిపెట్టిన బాలుడి శవాన్ని వెలికితీశారు. రెవెన్యూ అ ధికారుల సమక్షంలో శవపరీక్ష (రీ- పోస్టుమార్టం) నిర్వ హిం చారు.కన్నకొడుకును పొట్టన బెట్టుకున్న కసాయి తల్లి జ్యో తిని పోలీసులు ఐపీసీ సెక్షన్ల కింద అరె స్ట్ చేశారు. ప్రస్తు తం పరారీలో ఉ న్న ప్రియుడు నవీన్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఒక కామ పిచ్చి పసివాడి ప్రాణాన్ని బలి తీసుకోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.