Monday, September 28, 2026
More
    HomeIndiaRangareddy pocso court sensational judgment : బిగ్ బ్రేకింగ్, రంగారెడ్డి కోర్టు సంచ లన...

    Rangareddy pocso court sensational judgment : బిగ్ బ్రేకింగ్, రంగారెడ్డి కోర్టు సంచ లన తీర్పు, 84ఏళ్ల వయస్సున్న వృద్ధుడికి 21 ఏళ్ల జైలుశిక్ష 

    📰 Generate e-Paper Clip

    Rangareddy pocso court sensational judgment : ప్రజా దీవెన, హైదరాబా ద్:వయసు పెరిగినా బుద్ధి మారలే దు, సమాజంలో గౌరవప్ర దమైన పదవిలో పనిచేసి రిటైరైనా కపటం వీడలేదు. ఒకవై పు జీవిత చరమాంకంలో దైవచిం తనతో గడపాల్సిన 84 ఏ ళ్ల వృద్ధుడు, మరోవైపు ఏమీ తెలి యని 12 ఏళ్ల అమాయక బాలిక. ఆపై ఆమెకు మానసిక స్థితి కూడా సరిగ్గా లేదు. ఇలాంటి బాలికను ఆసరాగా చేసు కుని చాక్లెట్ల పేరుతో లో బర్చుకుని వరుస అఘాయిత్యా ల కు పాల్పడిన ఒక విశ్రాం త ప్రభుత్వ ఉద్యోగికి న్యాయ స్థా నం ఊ హించని షాక్ ఇ చ్చింది. మిగిలిన జీవితాన్ని కటక టాల వెనకాలే గడిపేలా ఏ కంగా 21 ఏళ్ల కఠిన జైలు శిక్ష వి ధిస్తూ రంగారెడ్డి జిల్లా ప్రత్యే క పోక్సో కోర్టు సంచలన తీర్పు నిచ్చింది.

    ఈ దారుణ ఘటన 2023 మా ర్చి నెలలో రంగారెడ్డి జిల్లా లోని చై తన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి అయిన వెంకటనారాయ ణ(84) అ నే వృద్ధుడు, అదే ప్రాం తంలో ఉంటున్న 12 ఏళ్ల మానసిక వికలాంగురాలైన బాలికపై కన్నేశాడు. ఆమె అమాయకత్వా న్ని ఆసరాగా చేసుకుని, చాక్లెట్లు ఇస్తానని ఆశచూపిస్తూ త న ఇంట్లోకి పిలిపించుకునేవాడు. ఎవరూ లేని సమయం చూసి ఆమెపై పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.

    వెలుగులోకి తెచ్చిన తండ్రి బాలిక ప్రవర్తనలో మార్పును గ మనించిన ఆమె తండ్రికి అనుమానం వచ్చింది. నిలదీసి అ డగ్గా అసలు విషయం బయటపడింది. గుండె పగిలినంత పనైన ఆ తండ్రి వెంట నే చైతన్యపురి పోలీసులను ఆశ్ర యించి ఫిర్యాదు చేశాడు. రంగం లోకి దిగిన పోలీసులు వెంకటనా రాయణను అదుపులోకి తీసుకుని, పక్కా ఆధా రాలతో చార్జ్‌షీట్ దాఖలు చేశారు.

    గత కొన్ని నెలలుగా సాగిన ఈ కే సు విచారణ చివరకు ఒక కొలిక్కి వచ్చింది. నిందితుడి వయసును కాకుండా, అతను చేసిన నేర తీ వ్ర తను పరిగణనలోకి తీసుకున్న రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు న్యాయమూర్తి ఇవాళ తీర్పును వె లువరించారు.నిందితుడు వెంకటనారాయణకు 21 సంవ త్సరాల కఠిన జైలు శిక్షతో పాటు బాధితురాలి భవిష్యత్తు మరియు మానసిక స్థితిని దృష్టిలో ఉంచుకుని రూ. 4 లక్షల నష్టపరి హారం మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిం చింది.

    వయసు పైబడిన వారైనా, సమా జంలో పెద్ద మను షులని చలామణి అయ్యే వారైనా సరే. చిన్న పిల్లలపై, ము ఖ్యంగా ప్రత్యేక అవస రాలున్న పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడితే చట్టం ఎంత కఠినంగా ఉంటుందో చెప్పడానికి ఈ తీర్పే ఒక నిదర్శనం నిలుస్తోంది.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.