Cm Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ రాష్ట్రానికి బ్లూ ప్రింట్ సిద్ధ మైందని, రాష్ట్ర రాజధాని హైదరా బాద్ రూపు రేఖలు మరబోతున్నా యని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ నుముల రే వంత్ రెడ్డి ( Revanth Redd y)వెల్లడించారు. అసెంబ్లీలో సోమవారం ఆయన కీలక ప్రక టనలు చేశారు. ఇది సాధారణ అభి వృద్ధి కాదు, “ఫ్యూచర్ సిటీ విజ న్”లా కనిపిస్తోందని, “క్యూర్, ప్యూర్, రేర్” మోడ ల్‌తో కాలుష్య రహిత హైదరాబాద్ నిర్మాణానికి ప్ర భుత్వం పెద్ద ప్లాన్ వేసిందని ప్రక టించారు. నగరంలో ఉన్న కాలు ష్యకారక పరిశ్రమలను ORR బ యటకు తరలించి ఆ భూ ములను మల్టీ-జోన్ హబ్‌లుగా మార్చే ఆలో చనలో ఉంద న్నారు. ఇప్పటికే ఉ న్న మెట్రో సరిపోదని భావించిన ప్ర భు త్వo రూ.24 వేల కోట్లతో 74 కిలోమీటర్ల మేర విస్తరణకు సిద్ధ మైందన్నారు. ముఖ్యంగా ఎయిర్ పోర్ట్‌కు మెట్రో కనె క్టివిటీ ఇవ్వడం ప్రాధాన్యతగా తీసుకుంది. గతంలో Larsen & Toubro సహకరించ లేదని సీఎం ప్రశ్నించగా ఇప్పుడు ప్రభుత్వం స్వయంగా ముందుకు వచ్చి రూ.15 వేల కోట్లతో మెట్రో ను స్వాధీనం చేసుకుందని గుర్తు చేశారు.
సిగ్నల్ లేని హైదరాబాద్
పంజాగుట్ట, హైటెక్ సిటీ, జూబ్లీ హి ల్స్‌లలో ఇప్పటికే ఎలి వేటెడ్ కారి డార్లు నిర్మాణంలో ఉండగా త్వరలో నగర మం తా “సిగ్నల్ ఫ్రీ ట్రా ఫి క్” లక్ష్యంగా ముందుకు వెళ్తోందని చె ప్పారు. జూన్-జూలైలోపే కీలక ఎలివేటెడ్ కారిడార్లు పూర్త వుతాయని ప్రభుత్వం తరపున ఆయన స్పష్టం చేశారు.ఢిల్లీ మాదిరిగా కా లుష్య నగరంగా మారకుండా ముందుగానే “హిల్ట్ పాలసీ” తీసుకువ చ్చిన ప్రభుత్వo ఆక్రమణలు తొల గించడం, ఫుట్‌పాత్‌లను స్వేచ్ఛగా మార్చడం వంటి నిర్ణ యాలు తీసు కోబోతోందన్నారు. చిన్న వ్యాపారులకు ఇ బ్బంది ఉన్నా నగర భద్రత, ట్రాఫిక్ కోసం కఠిన చర్యలు త ప్పవని సీఎం తెలిపారు.
మూసీ రివర్ – కొత్త జీవం
కాలుష్యంతో నలుగుతున్న మూసీ నదిని పూర్తిగా మార్చేం దుకు భారీ ప్రణాళిక సిద్ధమైంది. Musi River ప్రక్షాళనతో పాటు రివర్‌ఫ్రంట్ డెవ లప్‌మెంట్ చేయడం ద్వారా హైద రాబాద్‌కు కొత్త టూరిజం, జీవన ప్ర మాణాలు తీసుకురా వాలని లక్ష్యం గా పెట్టుకున్నట్లు ప్రకటించారు. గుజరాత్‌లో ని Sabarmati Riverf ront మాదిరిగా దీన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు.
ప్రపంచ స్థాయి నగరాలతో పోటీ ప డేలా హైదరాబాద్‌ను వి స్తరించాల్సి న అవసరం ఉందని సీఎం తెలిపారు. Delhi కా లుష్యం, Mumbai వరదలు, Bengaluru ట్రాఫిక్ స మస్య ల నుంచి పాఠాలు నేర్చుకుని ముందుగానే ప్రణాళికలు సి ద్ధం చేస్తున్నామని చెప్పారు.మొత్తం మీద ఇది సాధారణ పాలన కాదు, “స్మార్ట్ గవర్నెన్స్”తో హైదరాబాద్ ను భవిష్య త్తు గ్లోబల్ సిటీగా మార్చే దిశగా పెద్ద అడుగు పడబోతోం ద ని, రాబోయే కొన్నేళ్లలో హైద రా బాద్ నిజంగా “లేక్స్ అండ్ రాక్స్ సి టీ” నుంచి “స్మార్ట్ మెగా సిటీ”గా మారుతుందని స్ప ష్టం చేశారు.
