Cm Revanth Reddy parents protection bill : ప్రజా దీవెన, హైదరాబా ద్: తెలంగాణలో కుటుంబ విలువలను కా పాడే దిశగా ఒక కీలక నిర్ణయం తీ సుకున్న ప్రభుత్వం భవిష్యత్ సమాజాన్ని మార్చేలా కొత్త చట్టాన్ని తెరపైకి తీసు కువచ్చింది. తెలంగాణ అసెంబ్లీలో “పర్యవేక్షణ బిల్లు– 202 6”ను ముఖ్యమంత్రి రే వంత్ రెడ్డి (Revanth Reddy) ప్రవే శపెట్టి ఆమోదింపజేశా రు. ఈ బిల్లు వెనుక ఉన్న ఆలో చన చాలా స్పష్టంగా ఉంద ని, మారుతున్న జీవనశైలిలో తల్లిదం డ్రులను నిర్లక్ష్యం చేసే పరిస్థితిని తగ్గించడం కోసమే నని ప్ర భుత్వం స్పష్టంచేస్తోంది.
ఈ చట్టం ప్రకారం తమ తల్లిదండ్రులను చూసుకోని ప్రభు త్వ ఉద్యో గుల జీతంలో 15 శాతం వరకు కో త విధించి, ఆ మొత్తాన్ని నేరుగా తల్లిదండ్రులకు అందించే విధానం అమ ల్లోకి రానుంది. ముఖ్యంగా, ఈ నిబంధనలు కేవలం ఉద్యో గులకు మాత్రమే కాకుండా ప్రజాప్రతిని ధులకు కూడా వర్తి స్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
“ప్రేమతో కాకపోయినా కనీసం బా ధ్యతతో అయినా పిల్లలు తమ త ల్లిదండ్రులను చూసుకోవాలనే భా వనతో ఈ బిల్లు ను తీసుకువచ్చిన ట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.ఇప్పటి కుటుంబ వ్యవస్థల్లో జరు గుతున్న మార్పులు, పెద్దలను ఒం టరిగా వదిలేయడం వంటి ఘట నలు పెరుగుతున్న నేప థ్యంలో ఈ చట్టం ఒక హెచ్చరికలా, ఒక మార్గదర్శకంగా మా రనుందని వ్యాఖ్యా నించారు. తల్లిదండ్రుల పట్ల బాధ్యత ను గుర్తు చేసే ఈ నిర్ణయం, భవిష్యత్తులో సమాజంలో కొత్త సంస్కృతికి నాంది పలికే అవకాశ ముందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఉద్యోగుల పర్యవేక్షణ బిల్లు ఆమో ద సమయంలో శా సనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన పలు వ్యా ఖ్యలు ఆయన మాటల్లోనే…
పురాణాలలో మాతృపితృ భక్తికి మారుపేరుగా నిలిచిన శ్రవ ణ కుమారుడి కథ అద్దం పడుతుంది.చూపులేని తన వృద్ధ తల్లిదండ్రుల కోరిక మేరకు, వారిని ఒక కావిడి బుట్టలలో కూర్చోబెట్టుకుని తన భుజాలపై మోస్తూ పుణ్యక్షేత్ర దర్శ నా నికి తీసుకువెళ్లాడు. ఒకరోజు స రయూ నదీ తీరంలో తల్లి దండ్రుల దప్పిక తీర్చడానికి శ్రవణుడు నీళ్లు ముంచుతుం డగా, ఆ శబ్దాన్ని విని ఏదో క్రూర మృగం అని పొరబడిన దశ రథ మహారాజు ‘శబ్దభేది’ బా ణాన్ని ప్రయోగిస్తాడు. ఆ బా ణం తగిలి శ్రవణుడు మరణించాడు
పుత్రశోకంతో అలమటించిన ఆ వృద్ధ దంపతులు “నీవు కూ డా పుత్రవియోగంతోనే మరణిస్తావు” అని దశరథుడిని శపి స్తారు. తల్లిదండ్రు లను ప్రేమించడంలో శ్రవణ కుమారుడిని ఆదర్శంగా తీసుకుంటే ఎ లాంటి చట్టాలు, ఎలాంటి నిబంధ నలు అవసరం లేదు. ప్రఖ్యాత దుస్తుల బ్రాండ్ రేమండ్స్ మాజీ ఆధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త, పద్మభూషణ్ అ వార్డు గ్రహీత విజయ్ పథ్ సింఘానియా (87) మార్చి28 న ముంబైలో కన్నుమూశారు.
వ్యాపారవేత్తగా విజయవంతమైన జీవితాన్ని గడిపిన సిం ఘానియా చివరికి కొడుకు చేసిన ద్రోహంతో అ నామికుడిగా తనువు చాలించాల్సి వచ్చింది. విజయ్ పథ్ సింఘా నియా తన జీవితకాలపు కష్టార్జితాన్ని, సుమారు రూ. 1,000 కోట్ల విలువైన రేమండ్ సామ్రాజ్యపు వా టాలను కుమారుడు గౌ తమ్ సింఘానియాకు ‘గిఫ్ట్ డీడ్’ ద్వారా అప్పగించిన తర్వా త ఆయన జీవితం అత్యంత విషాదకరంగా మారింది. ఆస్తి చేతికి రాగానే గౌతమ్ తన తండ్రిని నిర్లక్ష్యం చేయడమే కా కుండా, ముంబైలోని ప్రతిష్టాత్మక ‘జేకే హౌస్’లో ఆయనకు దక్కా ల్సి న నివాసాన్ని కూడా నిరాకరించి బయటకు పం పించేశారు.
తన కారు, డ్రైవర్ సిబ్బందిని కూడా గౌతమ్ తొలగించడం తో ఆయ న దక్షిణ ముంబైలో ఒక సాధారణ అద్దె ఇంట్లో ని వసించాల్సి వచ్చింది. ఒకప్పుడు విమానాలలో తి రుగుతూ అత్యంత విలాసవంత మైన జీవితం గడిపారు. ఆస్తి మొ త్తం కొడుకు పరం చేయడంతో చి వరకు కనీస సౌకర్యాలు లేక, సొం త ఖర్చుల కోసం కోర్టులను ఆశ్ర యించాల్సిన దుర్భర స్థితికి చేరు కున్నారు. తన ఆత్మకథ ‘An Inco mplete Life’లో ఈ చేదు అనుభ వాలను వివరించారు. “పిల్లలకు స ర్వస్వం ఇచ్చేసి నేను పెద్ద తప్పు చేశాను, ఏ తండ్రీ నాకంటే దారుణ మైన స్థితిని అనుభవించకూడదు” అని ఆయన ఆ పుస్తకంలో ఆవేద న వ్యక్తం చేశారు.
ఒకవైపు ఆస్తిపాస్తులు లేకపోయి నా తన భుజాలపై తల్లి దండ్రులను మోసి పుణ్యక్షేత్రాలు చూపించిన శ్రవణ కుమా రుడి గాథ అజరామ రమైతే…అనామకుడిగా కన్నుమూ సి న విజయ్ పథ్ సింఘానియా ఉదంతం ఆధునిక సమాజపు చీకటి కోణాన్ని ఆవిష్కరిస్తోంది. ఈ బిల్లును ఎంతో బాధ్య తతో, భావోద్వేగంతో ఆలోచన చేసి తీసుకువస్తున్నాం. తల్లి దండ్రుల పట్ల భక్తి లేని వారికి భయం కలిగించేందుకే ఈ చ ట్టం. వృద్ధ తల్లిదండ్రులకు రక్షణ కల్పించే దిశగా ఇది ఒక కీలక అడుగు.
మనిషి బంధాలు అనుబంధాలను మర్చిపోయి చివరికి పే గు బంధాలను కూడా విస్మరించి భౌతిక సుఖా లు, ఆర్థిక ప్రయోజనాలు, సంపద కోసం పాకులాటల్లో మునిగిపో యారు. “అడ్డాల నాడే బిడ్డలు త ప్ప గడ్డాల నాడు కాదు” అని అ నాథలుగా మారిన తల్లి దండ్రులు కన్నీళ్లు పెట్టుకోవ డం ఈ సమాజా నికి మంచిది కాదు. మన దేశంలో పిల్లల సామాజిక భద్రత, మహిళల భద్రత, హక్కులకు రాజ్యాంగ రక్ష ణతో పాటు, అనేక చట్టాలు ఉన్నా యి.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 (ఏ) ప్రకారం 6 నుంచి 14 ఏళ్ల పిల్లలకు ఉచిత విద్య హక్కు ఉంది.ఆర్టికల్ 24 ప్రకారం ప్రమాదకర పనుల్లో బా ల కార్మికుల నిషేధం ఉంది. అనా థలు, నిరాశ్రయ పిల్లలు, నేరాల్లో చిక్కుకున్న పిల్లల సంర క్షణ కోసం జువెనైల్ జస్టిస్ యాక్ట్ (2015) ఉంది. పిల్లల పై లైంగిక దాడులు, వేదింపుల నుంచి రక్షణ కోసం పో క్సో యా క్ట్ (2012) ఉంది. రైట్ టు ఎడ్యూకేషన్ యాక్ట్ (2009) ఉం ది. 14 ఏళ్ల లోపు పిల్లలను పనిలో పెట్టుకోకూడదని చైల్డ్ లేబర్ యాక్ట్ ఉంది.బాల్య వివాహాల నిషేధం చ ట్టం ఉంది. మన దేశానికి పిల్లల హ క్కులు, రక్షణ విషయంలో అనేక అంతర్జాతీయ ఒప్పందాలు కూడా ఉన్నాయి.
మహిళల విషయానికి వస్తే గృ హ హింస నుంచి వాళ్లకు భద్రత క ల్పించడం కోసం చట్టం ఉంది. లైంగిక నేరాలకు సం బంధించి నిర్భయ లాంటి చట్టాలు ఉన్నాయి. వరకట్న నిషే ధ చట్టం ఉంది. మహిళల గౌరవం హక్కుల పరిరక్షణకు చ ట్టం ఉంది.ఇక వృద్ధుల సామాజిక భద్ర తకు సంబంధించి మన దేశంలో చట్టాలు ఉన్నాయి. పిల్లలు తమ తల్లి దండ్రు లను చూసుకోవడం చ ట్టబద్ధ బాధ్యతగా చేస్తూ “maint enance and welfare of pare nts and senior citize ns act 2007” ఉంది. ఇంకా మరికొన్ని చట్టాలు ఉన్నా యి. ఐనా, సమాజంలో తల్లిదండ్రుల సంరక్షణ విషయంలో జరు గుతోన్న వివక్ష, నిర్ల క్ష్యం మనం చూస్తున్నాం. బతికు న్నప్పు డు గుప్పెడు మెతుకులు పె ట్టని బిడ్డలు, చనిపోయాక ఆస్తు ల కోసం కొట్లాడుకోవడం అత్యంత విషాదం.
ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది పిల్లలను కనగలం కానీ, వాళ్ల బుద్ధులను కనగలమా అని,ఈ రోజు కొందరు తల్లిదం డ్రుల పరిస్థితి ఇదే.ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండే వి. లేదా ఎక్కువ మంది పిల్ల లనుకనేవాళ్లు.దాని వల్ల ఒకరు కా కపోయినా ఇంకొకరైనా తల్లిదండ్రు ల సంరక్షణ చూసుకునే వాళ్లు. ఈ రోజుల్లో పరిస్థితులు మారాయి కు టుంబ నియంత్రణతో ఒక్కరో ఇద్దరికో పరిమితమయ్యారు. కుటుం బం అంటే కొడుకైనా, కూతురైనా ఇద్దరూ సమాన మే. ఆడబిడ్డలకు తల్లిదండ్రులకు ప్రేమ ఉన్నా… మెట్టినింటి బాధ్యతలతో ఏమీ చేయలేకపోతున్నారు.
నాకు తెలిసిన ఒక ప్రజా ప్రతినిధి తండ్రికి క్యాన్సర్ వస్తే ఆ యనను చూసుకోకుండా నిర్లక్ష్యం చేశారుఇటీవలే ఆ తండ్రి మరణించారుతల్లిదండ్రులను చూసుకోలేని వారి ని సామా జం బహిష్కరించాలి. ఒక సామాజిక బాధ్యతగా ఈ బి ల్లు ను తీసుకువస్తున్నాం. ఈ చ ట్టంతో సమస్యలన్నీ పరిష్కా రమవుతాయని కాదు.ఈ చట్టంతో వృద్ధ తల్లిదండ్రులకు న్యాయం జరుగుతుందనే నమ్మకం కలిగించేందు కే మా ప్ర యత్నం. ఏ తల్లి దండ్రులు అనాథలుగా ఉండకూడదు, చివ రి రోజుల్లో వాళ్ల బాగోగుల కోసం ఇ బ్బంది పడకూడదు అ న్న ఉద్దేశం తో ఈ బిల్లును తెస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
