Nalgonda national lok adalat 2026 : ప్రజా దీవెన, నల్ల గొండ: జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా కేసులను వేగవంతంగా పరిష్కరించడంలో పోలీస్ శాఖ, న్యాయ వి భా గంతో పాటు ఇతర సంబంధిత శా ఖలు సమన్వయంతో విశేష ఫలితాలు సాధించబడినవని, ప్రజలకు త్వరితగతిన న్యా యం అందించడమే ప్రధాన లక్ష్యంగా ఈ లోక్ అదాల త్ నిర్వహించబడిందని జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్ తెలి పారు.
ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ ఈ నెల 28 న ని ర్వహించిన జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా మొ త్తం 7,624 కే సులు విజయవంతంగా పరిష్కరించబడ్డా యని అందులో భాగంగా DD కేసులు 4,182, E-Petty కేసు లు 2,512, IPC కేసులు 886,SLL కేసులు 44 చొప్పున పరి ష్కరించబడ్డాయని చెప్పారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడు తూ జాతీయ లోక్ అదాలత్ వంటి కార్యక్రమాలు ప్రజలకు త్వరిత న్యాయం అందించడంలో ఎంతో కీలక పాత్ర పోషి స్తున్నాయని తెలిపారు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న చిన్నచి న్న కేసులను పరస్పర అవగాహనతో చట్టబద్ధంగా పరిష్క రించడం ద్వారా కోర్టులపై భారం తగ్గించడంతో పాటు ప్రజల సమయం మరియు ఖర్చు కూడా ఆదా అవుతుందని అ న్నారు.
అదేవిధంగా ప్రజలు తమ కేసులను లోక్ అదాలత్ ద్వారా ప రిష్క రించుకోవడం వల్ల దీర్ఘకాలిక న్యా య ప్రక్రియల నుంచి విముక్తి పొం దగలరని, భవిష్యత్తులో నిర్వ హిం చే లోక్ అదాలత్ కార్యక్రమాల్లో కూడా ప్రజలు చురుకుగా పా ల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ సూచించా రు. జిల్లాలోని పోలీస్ అధికారులు, సిబ్బం ది న్యాయవాదులు మరియు సంబంధిత శాఖల ప్రతినిధు లు సమన్వయంతో పనిచేయడం వల్లే ఈస్థాయిలో కేసుల పరిష్కారం సాధ్యమైందని అభినందించారు.
