Sunday, September 27, 2026
More
    HomeOpinionCm Revanth Reddy sensational comments : బిగ్ బ్రేకింగ్, సీఎం రేవంత్ సంచలనవ్యాఖ్య,...

    Cm Revanth Reddy sensational comments : బిగ్ బ్రేకింగ్, సీఎం రేవంత్ సంచలనవ్యాఖ్య, కుళ్లురాజకీయం వాళ్లకు ‘ప్రతిపక్షహోదా’కూడా మిగలదు

    📰 Generate e-Paper Clip

     

    Cm Revanth Reddy sensational comments :  ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్రం లో రాజకీయ విమర్శలు చేసే వాళ్లకు ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ చూపించండి, మీ రంతా మాకు అండగా నిలబడండి,రాబోయే రోజుల్లో అద్భు తాలు సృష్టిద్దామని, తెలంగాణను దేశానికే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుదాం అంటూ సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇటీ వల ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీని తీసుకువ చ్చి మన పిల్లలతో ఫుట్‌బాల్ ఆడించడంపై విపక్షాలు చేసిన రాజకీయంపై సీఎం గట్టి కౌంటర్ ఇచ్చారు. పిల్లల్లో క్రీడలను ప్రోత్స హించడానికి మేము మెస్సీ ని తీసుకొస్తే, కడుపులో కుళ్లు పె ట్టుకుని రాజకీయం చేశారని, ఇలాంటి కుళ్లు రాజకీ యం చేసేవాళ్ల కు భవిష్యత్తులో ‘ప్రతిపక్ష హోదా’ కూడా మి గలదని సంచలన వ్యా ఖ్యలు చేశారు.బడి నుంచి సింహా స నం దాకా ఆరుట్ల సభలో సీఎం రేవంత్ మార్క్ ‘ఎడ్యుకేషన్ రివ ల్యూషన్’ తో పాటు తెలంగాణ భవిష్యత్తు అద్దాల మే డల్లోనో, రంగుల గోడల్లోనో లేదు అది మన ప్రభుత్వబడి తరగతి గదుల్లోనే దాగుందని ఆరుట్ల వేదికగా ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యా ప్తంగా సరికొత్త చర్చకు దారితీశాయి. విధ్వంసమైన విద్యా వ్యవస్థను వికాసం వైపు నడిపిస్తూ, సరికొత్త విద్యా విప్ల వా నికి శ్రీకారం చుడుతోన్న సీఎం ఆరుట్ల బహిరంగ సభలో ఉ ద్వేగ భరిత ప్రసంగం చేశారు.

    ‘నో అడ్మిషన్’ బోర్డు పెట్టిన ప్రభుత్వ బడి

    ఒకప్పుడు ప్రభుత్వ బడులంటే విద్యార్థులు లేక వెలవెల బో యేవి. కా నీ సీన్ రివర్స్ అయింది.ఆరుట్లలో ప్రారంభమైన తెలంగాణ పబ్లిక్ స్కూల్ లో ఇప్పటికే 1814 మంది విద్యా ర్థులు చేరారు. ఏకంగా ఒక ప్రభుత్వ బడికి”నో అడ్మిషన్” (సీ ట్లు లేవు) అని బోర్డు పెట్టే స్థాయికి తీసుకువచ్చిన ఉపా ధ్యాయులకు సీఎం ఈ సందర్భంగా ప్రత్యేక అభి నందనలు తెలిపారు.ఈ స్ఫూర్తి కే వలం ఆరుట్ల గ్రామానికే పరిమితం కాదని, తెలంగాణలోని 27 లక్షల మంది ప్రభుత్వ పాఠ శాల ల వి ద్యా ర్థులకు ఇది అంకితమని వ్యాఖ్యా నించారు.

    ప్రతీ నియోజకవర్గంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయ డమే ప్రభుత్వ లక్ష్యమని స్ప ష్టం చేశారు. మాజీ ప్రధా ని పీవీ న రసింహారావు చదివింది ప్రభుత్వ బడిలోనే నేనూ చదివిం ది ప్రభుత్వ బడిలోనే ఇవాళ ముఖ్యమంత్రి స్థా యి కి చేరా ను. రేపు మీరు కూడా ఐఏఎస్, ఐపీఎస్, గొప్ప రాజ కీయ నాయకులుగా ఎదిగి, మీ తల్లిదoడ్రులు ఆత్మ గౌర వం తో బ్రతికేలా చేయాలని విద్యార్థుల్లో సీఎం రేవంత్ కొత్త ఆశ లు నింపారు.

    కేవలం చదువే కాదు, వరల్డ్ క్లాస్ స్కిల్స్ & స్పోర్ట్స్

    తెలంగాణ విద్యార్థులను గ్లోబల్ లీడర్లుగా మార్చేందుకు ప్ర భుత్వం ఒక పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోందని, విద్యా ర్థులకు నాణ్య మైన యూనిఫామ్స్, ఎడ్యుకేషన్ కిట్స్ అం దించే ఏర్పాట్లు చేయడ మే కాకుండా యంగ్ ఇండియా ఇం టిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కా ర్పొరేట్ స్థాయిని తలద న్నే వసతులతో పాటు యంగ్ ఇండియా స్కిల్స్ యూని వ ర్సిటీ ద్వారా విద్యా ర్థుల్లో నై పుణ్యాలు పెంచేందుకు ఏర్పా టు చేసిన ఈ యూనివర్సిటీ భవనాన్ని డిసెంబరు 9 న గ్రాం డ్‌గా ప్రారంభించబోతున్నామన్నారు.

     

    ఆదర్శ పాఠశాలల్లో ఆహ్లాదంగా సీఎం

    రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలో అత్యంత ప్రతిష్టాత్మ కంగా నిర్మించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ము ఖ్యమంత్రి ఎ. రేవం త్ రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదు వుకుంటున్న దాదాపు 27 లక్షల మంది విద్యార్థి యువతకు ఈ ప్రా రంభోత్సవ శుభ సంద ర్భాన్ని అంకితం చేశారు.తెలంగాణలో మొట్టమొదటి ఈ ఆ దర్శ పాఠశాలను ప్రారంభించిన తర్వాత ఆవరణ ఆ సాం తం తిరిగి పరిశీలించారు. ఇదే సందర్భంగా పాఠశాలల్లో ఉ దయం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించారు. విద్యార్థినీ విద్యా ర్థులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు.

    ఆ తర్వాత అత్యాధునిక వసతు లతో నిర్మించిన పాఠశాల తరగతి గదులు, లైబ్రరీ, ఫిజిక్స్, బాటనీ, కెమిస్ట్రీ ల్యాబరేట రీల్లో ఏర్పాటు చే సిన సౌకర్యాలను క్షణ్ణంగా పరిశీ లించా రు. సైన్స్ ల్యాబరేటరీలో వి విధ పరికరాలను చూశారు. విద్యార్థులకు ఉచిత రవాణా సౌకర్యాల కోసం ఏర్పాటు చే సిన బస్సులను పరిశీలించారు. నృత్యం, సంగీతం బోధించే తరగతి గదులు, డిజిటల్ క్లాసులను సందర్శించారు. వంట గదిని పరిశీలించారు. వంటవారి తో మాట్లాడుతూ ము ఖ్యమంత్రి పూరీ తయారీలో సహకరించారు. ఆవరణలో వి ద్యార్థులతో ముచ్చటించారు. అధ్యాపకుల కార్యాలయం సందర్శించారు. పాఠశాల మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులతో మాట్లాడి పలు విషయాలను అడిగి తె లుసుకున్నారు.

    పాఠశాల ఆవరణలో అత్యున్నత వసతులతో తీర్చిదిద్దిన వాలీబాల్, క్రికెట్, ఫుట్‌బాల్, కబడ్డీ వంటి క్రీడా స్థలాలు, టెన్నిస్, క్యారమ్స్ హాళ్ల ను, ఆవరణలోని పార్కులను పరి శీలించారు. విద్యార్థులతో కలిసి కొ ద్దిసేపు సరదాగా ఫుట్‌ బాల్ ఆడారు. అత్యంత అహ్లాదకరమైన వా తావరణంలో సాగిన ఈ కార్యక్ర మంలో విద్యార్థినీ విద్యార్థులు ము ఖ్య మంత్రికి ఘన స్వాగతం పలికారు. పాఠశాల ఆవరణలో మొక్కను నాటారు. చాలామంది విద్యార్థులతో కరచాలనం చేస్తూ ముఖ్య మంత్రి వారిని ఆశీర్వదించారు. ప్రీ- ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వ రకు సౌకర్యాలు కల్పించారు. అం తర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన ఈ పాఠశాలలో ఇంగ్లీ షులో బోధిస్తారు.

    ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి తో పాటు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బా బు, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, సలహాదారులు కె. కేశవ రావు, శాసన మండలి చీఫ్‌ విప్ పట్నం మహేందర్ రెడ్డితో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి తో పాటు ఇతర సభ్యులు, అధికా రులు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.