Monday, September 28, 2026
More
    HomeOpinionHydarabad Alwal Trogedy death : బిగ్ బ్రేకింగ్, హైదరాబాద్ అల్వాల్ లో విషాదం, విద్యుత్...

    Hydarabad Alwal Trogedy death : బిగ్ బ్రేకింగ్, హైదరాబాద్ అల్వాల్ లో విషాదం, విద్యుత్ షాక్‌తో కూలీ దుర్మరణం

    📰 Generate e-Paper Clip

     

    Hydarabad Alwal Trogedy death : ప్రజా దీవెన, అ ల్వాల్: ఆ రోజూ ఎప్పటిలాగే తెల్లవారింది. రోజు వారీ కూలీ దొరికితేనే కానీ ఇంట్లో పొ య్యి వెలగని పరిస్థితి ఆ కుటుం బానిది. నలుగురికి నీడను ఇచ్చే చెట్టు కొమ్మలను కత్తిరించ డమే అతడు చేసిన పని… కానీ అదే అతని జీవితాన్ని శా శ్వతంగా చీకట్లోకి నెట్టేస్తుందని ఊహిoచలేదు. అల్వాల్ పో లీస్ స్టేషన్ పరిధిలోని ఎంఈఎస్ కాల నీలో బుధవారం ఒక ఘోర విషాదం చోటుచేసుకుంది. ఓ అపార్ట్‌మెంట్ ముందు దట్టం గా పెరిగిన చెట్టు కొమ్మలను న రికేందుకు దినసరి కూ లీ సూర్యనారాయణ (45) పనిలోకి దిగాడు. అయితే దుర దృష్టవశాత్తూ ఆ కొమ్మలు పక్కనే ఉ న్న హైవోల్టేజ్ విద్యుత్ తీగలకు తగిలాయి. క్షణాల వ్యవధి లో భారీ వి ద్యుత్ షాక్‌ కు గురైన సూర్యనారాయణ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పో యాడు.

    కన్నీరుమున్నీరవుతున్న కుటుంబం

    కష్టపడితేనే ఇల్లు గడిచేది.. ఇప్పు డు ఆయన లేకపోతే మా పరిస్థితి ఏంటి?” అంటూ మృతుని కుటుంబ సభ్యుల రోదన లు స్థానికులను కలచివేశాయి. సూర్యనారాయణ కేవలం ఒక దినసరి కూలీ మాత్రమే కాదు ఆరుగురు ఉన్న ఒక పెద్ద కుటుంబానికి ఏకైక ఆధారం. ఆయన మరణంతో భార్య, ముగ్గురు కుమారులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. కంటి ముందే తండ్రి శవమై పడి ఉండటాన్ని చూసి ఆ పిల్ల లు ఏడుస్తున్న తీరు అక్కడి వారిని కన్నీళ్లు పెట్టించింది.

        ప్రాణాలు తీస్తున్న అజాగ్రత్త

    ఈ ప్రమాదంపై స్థానికులు తీవ్ర ది గ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నా రు. నివాస ప్రాంతాల్లో విద్యుత్ తీగలకు ఆనుకుని ఉండే చె ట్ల కొమ్మలను తొలగించేటప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకోక పోవడం, లేదా విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇ వ్వకపోవడం వల్లే ఇలాంటి ప్రాణాం తక ప్రమాదాలు జరుగు తున్నా యని వారు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. ఘటనా స్థలానికి చేరుకు న్న అల్వాల్ పోలీసులు కేసు నమోదు చే సుకుని దర్యాప్తు చేస్తు న్నారు.

    రెక్కాడితే గానీ డొక్కాడని ఒక పే ద కార్మికుడి ప్రాణం అనం త వాయువుల్లో కలిసిపోవడంతో ఎంఈ కాలనీలో విషాద ఛాయలు అల ముకున్నాయి.ఇలాంటి ప్రమాదాలు పున రా వృతం కాకుండా ఉండా లంటే నివాసాల వద్ద చెట్ల కొమ్మలు నరికేటప్పుడు ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మీరు భావిస్తున్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.