Sunday, September 27, 2026
More
    HomeOpinionCM Revanth Reddy unified Card : బిగ్ బ్రేకింగ్, సీఎం రేవంత్ కీలక ప్రకటన,...

    CM Revanth Reddy unified Card : బిగ్ బ్రేకింగ్, సీఎం రేవంత్ కీలక ప్రకటన, ప్రతి పౌరుడికి సమగ్ర సంక్షేమకార్డు అందించేందుకు చర్యలు 

    📰 Generate e-Paper Clip

    CM Revanth Reddy unified Card : ప్రజా దీవెన, హైద రాబాద్: రాష్ట్రం లోని ప్రతి పౌరుడికి అందు తున్న సంక్షేమ పథకాల వివరా లన్నీ ఒకే కార్డులో అందుబాటులో ఉండేలా ‘సమగ్ర సంక్షేమ కార్డును (యూనిఫైడ్ కార్డ్) రూపొందించా లని ముఖ్యమం త్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశిం చారు. ఏ పౌ రుడి కి ఏ శాఖ ద్వారా, ఏ పథకం కింద, ఎంత మేర లబ్ధి చేకూరు తోందో ఈ కార్డు ద్వారా స్పష్టంగా తెలి సేలా ఉండాలని సూ చించారు. త క్షణమే అందుకు అవసర మైన చర్యలు చేప ట్టాలని, అన్ని శాఖల నుంచి లబ్ధిదారుల డేటాను సేకరిం చేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఆదేశిం చారు. మంత్రి దు ద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి కె. రామకృ ష్ణా రావు, సీఎం స్పెషల్ సెక్రటరీ బి.అజిత్ రెడ్డి, ఐటీ శాఖ జా యింట్ సెక్రటరీ అనుదీప్ దురిశె ట్టితో పాటు ఇతర ఉన్నతా ధికారుల సమీక్షలో ముఖ్యమంత్రి ఈ విషయంపై ప్రత్యేకం గా చర్చించారు.

    సమగ్ర సంక్షేమ కార్డు ద్వారా రా ష్ట్రంలోని ప్రతి పౌరుడి పూ ర్తి సంక్షేమ ప్రొఫైల్ ఒకే చోట అందుబాటు లోకి వస్తుందని ముఖ్యమంత్రి చె ప్పారు. ఈ డేటాను అన్ని కోణాల్లో ఏఐ స హాయంతో విశ్లేషిస్తే సంక్షేమ పథకాల అమలులో పారదర్శక త పెరుగుతుందన్నారు. ఈ విధానం అనుసరించడం వల్ల నిజమైన అ ర్హులకు పథకాలు మరింత కచ్చితంగా చేరుతా యని, అదే సమ యంలో అనర్హులను గుర్తించడం సులభ మవుతుందని అభిప్రాయ పడ్డారు. ప్రతి శాఖ వేర్వేరుగా కార్డు లు ఇచ్చే పద్ధతికి బదులు, ఐటీ శా ఖ ఆధ్వర్యంలో సమగ్ర సంక్షేమ కా ర్డ్ ఉండాలని సూచించారు. టెక్నా లజీపై పట్టున్న, చురుగ్గా పనిచేసే యువ అధికారులను ఈ ప్రక్రియ కు వినియోగించాలని చెప్పారు.

    ఈ కార్డ్‌లో ఆరోగ్యశ్రీ, ముఖ్యమం త్రి సహాయ నిధి, ఫీజు రీ యింబర్స్‌ మెంట్, కార్మిక శాఖ, విద్యా శాఖ, బీమా పథకా లు, ప్రభుత్వం తీసు కొస్తున్న బీమా పథకాల వివరాలు ఉం డాలని ముఖ్యమంత్రి చెప్పా రు. అవసరమైతే ఆధార్ నం బర్‌ తరహాలో రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక యూనిక్ ఐడెంటిటీ నంబర్‌ ఇచ్చే లా ఆలోచించాలన్నారు. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సా మాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రా జకీయ, కుల సర్వే వివరాలను కూ డా ఈ కార్డ్‌కు అనుసం ధానం చేయాలని చెప్పారు.

    లబ్ధిదారుల వివరాలతో పాటు వి విధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సం ఖ్య, ఇతర వివరా లను సేకరించా లని ఐటీ శాఖను ఆదేశించారు. ఏఐ ఆధా రిత ప్రొఫైలింగ్ జరగాలని సూచించారు. ఎక్కడైనా మరణ ధృవీకరణ పత్రం జారీ అయితే, ఆ సమాచారం చేయూత పెన్షన్ డేటా బేస్‌కు చేరాలని, వెంటనే దాని ఆ ధారంగా చ ర్యలు మొదలయ్యేలా ఉండాలన్నారు. ప్రజల ఆరోగ్య ప్రొ ఫైల్‌ను కూడా సమగ్ర సంక్షేమ కా ర్డుతో లింక్ చేయాలని చె ప్పారు.

    కేరళ నుంచి గల్ఫ్‌కు వలస వెళ్లే ఉ ద్యోగులకు అనుసరిస్తు న్న విధానా లను అధ్యయనం చేయాలని సూ చించారు. నైపుణ్యాభివృద్ధి, శిక్షణ కార్యక్రమాలతో పాటు, పాస్‌పోర్ట్‌ లు, వీసాల జారీకి సంబంధించిన సమాచారం ఒకేచోట అందుబాటు లో ఉంచితే, అనధికార ఏజెంట్ల ప్ర మేయం తగ్గుతుందని తెలిపారు.పేదలకు సంక్షేమ ఫలాలు ఖచ్చి తంగా చేరేలా, ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకం ప్రభా వాన్ని అంచ నా వేసేలా సమగ్ర సంక్షేమ కార్డు ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.