Telangana ministers surprise visit paddy centers ప్రజా దీవెన, యాదాద్రి భువనగిరి: యాదాద్రి భువనగిరి వం గపల్లి ధాన్యo కేంద్రoలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మంత్రు లు ఆకస్మిక తని ఖీ నిర్వహించారు. రాష్ట్ర వ్యవసాయ ము ఖచిత్రాన్ని మార్చే దిశగా భువనగిరి జిల్లా వేదికగా అడుగు లు వేస్తోంది. జిల్లాలోని వంగపల్లి గ్రామంలోని అత్యాధునిక ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, రామాజిపేట వద్ద ఉన్న ‘నెక్స్ట్-జెన్’ ప్రభుత్వ గో దాములను రాష్ట్ర కేబినెట్ బృందం గురు వారం ఆకస్మికంగా తనిఖీ చేసింది. ఈ హై-ప్రొఫైల్ పర్యట నలో పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమా ర్ రెడ్డి, ఐటీ అండ్ ఇన్నోవేషన్ శాఖ మంత్రి దు ద్దిళ్ల శ్రీధర్ బాబు, రెవెన్యూ అండ్ ఇన్ఫర్మేషన్ మంత్రి పొంగులేటి శ్రీని వాసరెడ్డి లతో పాటు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య యాదవ్ లు పాల్గొ న్నారు.
ఈ సందర్భంగా పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమా ర్ రెడ్డి మీడియా డిజిటల్ స్క్రీన్ల ద్వారా రై తాంగానికి పార దర్శకమైన భరోసా నిచ్చారు. ఇది మాటల ప్రభుత్వం కాద ని, టెక్నాలజీతో నడిచే రైతు పక్షపాత ప్రభుత్వమని పున రుద్ఘాటిoచారు. రబీ సీజన్లో రికార్డ్ స్థా యిలో 57 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించబడిందని తెలిపారు. అం దుకు గాను ఏకంగా రూ. 10,097 కోట్లు నేరుగా రైతుల ఖా తాల్లోకి (Direct Benefit Transfer) డిజిటల్‌గా జమ య్యాయని పేర్కొన్నారు.తెలంగాణ చరిత్రలోనే రబీ సీజన్ లో ఇంతటి భారీ దిగుబడి రావడం ఇదే తొలిసారి అని,ప్రతి పక్షాలు కే వలం రాజకీయ లబ్ధి కోసమే విమర్శలు చేస్తున్నా యని, రైతులెవరూ భయపడాల్సిన అవసరం లేదని మం త్రుల బృందం స్పష్టం చేసింది.
చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం
కొనుగోళ్లలో ఎలాంటి అవకతవక లు లేకుండా ఎండ్-టు-ఎండ్ డిజి టల్ ట్రాకింగ్ వ్యవస్థను వాడుతు న్నామని, ప్రతి చివరి గింజను కొనే బాధ్యత ప్రభుత్వానిదేనని హామీ ఇచ్చా రు.అకాల వర్షాల వల్ల తడి సిన ధాన్యాన్ని సైతం వదిలిపెట్ట కుండా, త్వరితగతిన సేకరించి ‘బా యిల్డ్ రైస్ మిల్లులకు’ తరలించేలా లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌ను యాక్టివేట్ చేశారు. టె క్నాలజీని అడ్డం పెట్టుకు ని బ్రోకర్లు రైతులను మోసం చే యాలని చూస్తే కఠిన చర్యలు త ప్పవని ప్రభుత్వం ఈ పర్య టన ద్వారా మంత్రులు గట్టి వార్నింగ్ ఇచ్చారు.

ఇదిలా ఉండగా క్షేత్రస్థాయి నుండి యాక్షన్ ప్లాన్ వంగపల్లి తనిఖీ అ నంతరం, మంత్రుల బృందం నేరు గా జిల్లా కలెక్ట రేట్‌కు చేరుకుంది. అ క్కడ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఆ ధ్వ ర్యంలో డిజిటల్ డ్యాష్‌బోర్డ్ ద్వారా ధాన్యం కొనుగోళ్ల వే గా న్ని సమీక్షించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి అసౌకర్యం కల గకుండా షేడ్స్, త్రాగునీరు, వేగవం తమైన తూకం యంత్రాలను అం దుబాటులో ఉంచాలని, పేమెంట్ ప్రాసెసింగ్‌లో ఎలాంటి సాంకేతిక లోపాలు రాకుండా ఐటీ టీమ్స్ అ లర్ట్గా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమoలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మె ల్యేలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, వేముల వీరేశం, మందుల సా మ్యే లు, సివిల్ సప్లైస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, జిల్లా కలె క్టర్ మరియు డీసీపీ తదితరులు పాల్గొన్నారు.

