Sunday, September 27, 2026
More
    HomeOpinionCM Revanth Varuna Yagam : నల్లగొండ కలెక్టర్ కీలక ప్రకటన, సీఎం వరుణయాగానికి సర్వం...

    CM Revanth Varuna Yagam : నల్లగొండ కలెక్టర్ కీలక ప్రకటన, సీఎం వరుణయాగానికి సర్వం సన్నద్ధం 

    📰 Generate e-Paper Clip

    CM Revanth Varuna Yagam : ప్రజా దీవెన, నాగార్జున సాగర్: రాష్ట్ర ప్రజల శ్రేయస్సును దృష్టి లో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వ ఆ ధ్వర్యంలో నాగార్జునసాగర్ విజయ్ విహార్ ఆవరణలో కృష్ణా న ది ఒడ్డున నిర్వహిస్తున్న వరుణ యాగా నికి అవస రమైన అన్ని ఏ ర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలె క్టర్ బి. చంద్రశేఖర్ తెలిపారు. ఆ దివారం ఆయన జిల్లా ఎ స్పీ శర త్ చంద్ర పవార్ తో కలిసి మరో సారి వరుణ యాగం ఏర్పా ట్లను పర్యవేక్షించారు.ముందుగా బీసీ సంక్షేమ హాస్ట ల్ ఆవ రణలో ఏ ర్పాటు చేసిన హెలీ ప్యాడ్ ను ప రిశీలిం చారు. అనంతరం విజయ విహార్ వెనుక వైపున కృష్ణ నది ఒడ్డున ఏర్పాటు చేసిన వరుణ యాగం యాగశాల, హోమ గుం డా లు, వరుణ యాగం నిర్వహిం చేందుకు హాజరవు తున్న 10 8 మంది రుత్వికులకు అవసరమై న ఆసనాలు, యాగాన్ని నిర్వ హించేందుకు అవసరమైన సా మాగ్రి ,పగో డాలు , బ్యా రికేడ్ బం దోబస్తు, ఎల్ఈడి స్క్రీన్లు ,పబ్లిక్ అడ్రస్ సిస్టం అ న్నింటిని పరిశీలిం చారు.యాగం సందర్భం గా ఎ లాంటి ఇబ్బందులు కలుగకుం డా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

    అనంతరం మీడియా ప్రతినిధుల తో జిల్లాకలెక్టర్ మాట్లా డు తూ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం వ రుణ యాగాన్ని నిర్వ హించడం జరుగుతున్నదని, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ యాగం సోమవారం తెల్లవారు జామున ఉదయం 4 గంటలకు ప్రా రంభమవుతుందని, సాయం త్రం 3 గంటల 20 నిమిషాలకు పూర్తి కానుందని చెప్పారు. వరు ణ యాగం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు, మoత్రు లు,ప్రజాప్రతిని ధు లు, అధికారు లు హాజరుకానున్న దృష్ట్యా అవ సరమైన అన్ని ఏర్పాట్లతో పాటు బందోబస్తు, అన్ని శాఖల ద్వారా ఏర్పాట్లను పూర్తిచేసినట్లు కలెక్ట ర్ తెలిపారు. వరుణ యా గానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగిందని, ప్రజలు వరుణ యా గాన్ని వీక్షిం చేందుకు ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా ఏర్పాటు చేశామ ని, అంతేకాక విజయ విహార్ ఆ వరణలోనే ప్రవచనాలు కూడా ఏ ర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడిం చారు. వరుణ యాగం ఏర్పా ట్ల ను నాగార్జునసాగర్ శాసనసభ్యు లు కుందూరు జయవీర్ రెడ్డి పరి శీలించారు. ఈ సందర్భంగా ఆ యన ఏర్పాట్లపై అధికారులతో ఆరా తీయడమే కాకుండా, ప్ర త్యక్షంగా ఏర్పాట్లను పరిశీలించి తగు సూచనలను చేశారు.

    జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ రాష్ట్ర ముఖ్యమంత్రి రాక సంద ర్భంగా అవసరమైన పోలీస్ బం దోబస్తు, భద్రతలను పరిశీలించి ఎలాంటి అవాంఛనీయ సంఘట న జరగకుండా ముందస్తు చర్య లన్ని తీసుకోవాలని, పోలీసులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. సోమ వారం వరుణ యాగం సందర్భం గా విజయ విహార్ కు వచ్చే ప్రతి ఒక్కరికి ప్రవేశ పాసు ఉండే విధం గా చర్యలు తీసుకో వాలని, పాస్ ఉన్నవారిని మాత్రమే లోపలికి అనుమతిం చాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.రాష్ట్ర దే వా దా య కమిషనర్ హనుమం తరావు వరుణ యాగం ఏర్పాట్ల ను పరిశీలించారు.

    స్థానిక సంస్థల ఇంచార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, మిర్యాల గూడ ఆర్ డి ఓ రమణారెడ్డి రెవె న్యూ ,పోలీస్ అధికారులు, ఇత ర అధికారులు ఉన్నారు.కాగా వ రుణ యాగం సందర్భంగా వరు ణ యాగం నిర్వహించే యాగశా ల ప్రాంగణంలో మంత్రులు పార్ల మెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతి ని ధు లు తిలకించేం దుకు ఏర్పాట్లను చేయడం జరి గింది. అం తేకాక ఇక్కడ ఎల్ఈడీ స్క్రీన్లు సైతం ఏర్పాటు చేశారు. అ లాగే విజయ్ విహార్ ప్రాంగణం లోని ముందువైపున ప్రవ చనాలు వినిపించేందుకు ప్రవచనశాల ఏ ర్పాటు చేయగా, సాధారణ ప్రజ ల కోసం గ్యాలరీ, మీడియా గ్యా లరీలు ఏర్పాటు చేయడం జరి గింది. వరుణ యాగం నిర్వహిం చే క్రతువు మొత్తం తిలకించే విధంగా విజయ విహార్ ప్రాంగ ణం మొత్తం ఎల్ఈడీలతో అంద రికీ అగుపించేలా జిల్లా యంత్రాం గం ఏర్పాటు చేసింది.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.