Monday, September 28, 2026
More
    HomeOpinionTelangana Police Emerging Crimes : బిగ్ బ్రేకింగ్, కొత్త నేరాలపై తెలం గాణ పోలీస్...

    Telangana Police Emerging Crimes : బిగ్ బ్రేకింగ్, కొత్త నేరాలపై తెలం గాణ పోలీస్ మార్క్ ఫోకస్, భవి ష్యత్ సవాళ్లు

    📰 Generate e-Paper Clip

    Telangana Police Emerging Crimes : ప్రజా దీవెన వరంగల్: గత మూ డు దశాబ్దాలుగా సవాలుగా మా రిన సాంప్రదాయ భద్రతా ము ప్పుల నుంచి తెలంగాణ పోలీ సింగ్ వ్యవస్థ ఇప్పుడు డిజిటల్, సాంకేతిక నేరాల వైపు తన దృ ష్టిని మళ్లిస్తోంది. వరంగల్ ఎన్ఐ టీ వేదికగా డీజీపీ సీవీ ఆనంద్ కీలక సంస్కరణలతో పాటు భవి ష్యత్ ప్రణాళికలు వెల్లడించారు.

    గతంలో ప్రధాన సవాలుగా ఉన్న మావోయిజం ముప్పు రా ష్ట్రంలో దాదాపు ముగిసిందని, భద్రతకు ఎలాంటి ఢోకా లేద ని స్పష్టం చేశారు.ఇకపై పోలీసుల ప్రధాన ఫోక స్ సైబర్ నే రాలు, డ్రగ్స్ నెట్‌వ ర్క్, మరియు ప్రజల ఆరోగ్యంతో చెలగా టమాడే ఆహార కల్తీ ముఠాలపైనే ఉండనుందన్నారు.

    గతంలో మావోయిస్టుల ఏరివేత లో కీలకపాత్ర పోషించిన గ్రేహౌం డ్స్, ఎస్ఐబీ (SIB) వంటి అత్యుత్తమ బలగాల సేవ లను ఇకపై సైబర్ క్రైమ్స్, డ్రగ్స్ కంట్రోల్, ఆహార కల్తీ ము ఠాల నిరోధానికి విని యోగించనున్నారు. భవిష్యత్ అ వస రాలు, సాంకేతిక నేరాల విచారణకు అనుగుణంగా త్వర లోనే నవీకరించిన పోలీస్ మాన్యువల్ తీసుకురానున్నారు.

       అమరవీరుల కుటుంబాలకు ఆసరా

    పోలీస్ అమరవీరుల కుటుంబా ల సమస్యల తక్షణ పరి ష్కా రం కోసం ఎస్ఐబీ రూపొందించిన ‘T G-VEER’ (టీజీ-వీర్) యాప్‌ ను ప్రారంభించారు.అమరవీరుల కు టుంబాలు మరియు అధికారులు QR కోడ్ స్కాన్ చేయడం ద్వారా సులభంగా తమ సమస్యలను నమొదు చేసి పరిష్కారం పొంద వచ్చని ఆకాక్షించారు.

    రాష్ట్రంలో ముప్పు తీవ్రత తగ్గడంతో ప్రజా ప్రతినిధుల భద్ర తను సెక్యూరిటీ కమిటీ మరియు నిఘా వర్గాల (I ntellige nce) నివేదికల ఆధా రంగా సమీక్షించారు. భద్రతా అ వస రాల మేరకే గన్మెన్ల సంఖ్యను తగ్గించామని, దీనికి ఎలాంటి రాజకీయ కోణం లేదని వివరించారు. సాంప్రదాయ వ్యూ హాల నుంచి డి జిటల్ క్రైమ్ ఫైటింగ్ వైపు అడుగులేస్తూ, తెలంగాణ పోలీస్ శాఖ రాబోయే కాలానికి తగ్గట్టుగా సరి కొ త్త రక్షణ వ్యవస్థగా రూపాంతరం చెందుతోందని వ్యాఖ్యా నించారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.