El Niño Preparedness Measures : ప్రజా దీవెన, నల్ల గొండ: ఎనినో ప్రభావం వల్ల రాబోయే రోజుల్లో ప్రజలు తాగు నీరు, విద్యుత్తు, వ్య వసాయం, తదితర విషయాల్లో ఇ బ్బం దులు పడకుండా ఆదుకో వాల్సిన బాధ్యత ప్రభుత్వం, అ ధికారులపై ఉందని రాష్ట్ర షె డ్యూల్డ్ కులాల అభివృద్ధి, ఎస్టీ సంక్షేమ శాఖల మంత్రి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్చార్జి మం త్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. సోమవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణంలోని ఉదయాదిత్య భవ న్లో ఎల్ నినో ప్రభా వాన్ని ఎదుర్కొనే సంసిద్ధత, ప్ర త్యామ్నా య పంటల ప్రోత్సా హం, తదితర అంశాలపై ఏర్పాటు చేసి న ఉమ్మడి నల్గొండ జిల్లా సమీక్ష సమావేశానికి ఆయన అ ధ్యక్షత వహిస్తూ ఎల్ నినో వల్ల ఎదురయ్యే పరిస్థితులను ఎదు ర్కోవడంలో అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
ఎల్ నినో వల్ల రా బోయే రోజుల్లో అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బం దులు కలిగే అవకా శం ఉందని నిపుణులు హెచ్చరి స్తున్నం దున ప్రత్యేకించి వ్యవ సా యం, సాగునీరు, తాగునీరు అ న్నింటికి సమస్యలు వచ్చే అవ కాశం ఉందని అన్నారు. రా బోయే పరిస్థితులను సమర్ధ వంతం గా ఎదుర్కొనేందుకు అధికారు లు అన్ని రకాలుగా ప్రజలకు అండగా నిలబడా లని, ముఖ్యంగా రైతులు పంటల మార్పిడి, ఆరు తడి పంట ల వైపు వెళ్లేలా అవ గాహన కల్పించాలని, ప్రస్తుతం వేసుకు న్న పంటలు కాపాడేందు కు ప్రయత్నించాలని, వర్షపాతం పై ఎప్పటికప్పుడు ప్రజలను, రై తులను అప్రమత్తం చేసి నష్ట పోకుండా చూడాలని, భూగర్భ జ ల , వ్యవసాయ, ఉద్యాన తది తర శాఖల అధికారులు సమన్వ యంతో పని చేస్తూ క్షేత్రస్థాయికి వెళ్లి రైతులకు, ప్రజలకు అవగా హన కల్పిం చాలని చెప్పారు.ఇది వరకే వరి వేసుకున్న రైతుల ను ఆదు కునే విధంగా చూడాలని, సాగునీటి కోసం ప్రత్యేకంగా బో ర్లు వేయకుండా నియంత్రించా ల ని, తాగునీటికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.
రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫ రాల శాఖ మంత్రి నలమాద ఉ త్తంకుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎల్ నినో వల్ల అంతర్జాతీ య స్థా యిలో విపత్కర పరిణామాలు ఏర్పడతాయని, మన దేశంలో సూపర్ ఎల్ నినో గా నిపుణులు చెబుతున్నా రని, ఎల్ నినో ప్రభా వం తీవ్రంగా ఉన్న దృష్ట్యా ఎట్టి పరిస్థి తులలో రైతులు వరి సాగు చేయకుండా అవగాహన కల్పిం చాలని కోరారు. ముఖ్యంగా ప్రా జెక్టులలో నీరు లేకపోవడం వర్షా లు తక్కువగా ఉన్న విషయాన్ని రైతులకు విస్తృత ప్ర చారం కల్పిం చాలని బోర్లు వేసుకున్నప్పటికీ చివరి వరకు నీరు వ చ్చే అవకాశం లేనందున పంటలు వేసుకుని ఇబ్బం దులు పడే పరిస్థితి తీసు కురావద్దని, వాస్తవ పరిస్థితిని గ మనించి రైతులు ముందుకు వె ళ్లాలని కోరారు. అంతేకాక ప్రస్తు తం ప్రాజెక్టులలో ఉన్న నీరు తా గునీటికి మాత్రమే సరి పోతుంద నే విషయాన్ని గమనించాలని, వ ర్షాలు రాకుంటే వచ్చే జూలై వర కు తాగునీటి సమస్య ఏర్పడే అ వకాశం ఉందని, ప్రాజెక్టులో ప్రస్తు తం ఉన్న నీటిని దృష్టిలో ఉంచు కొని రైతులు ఆరుతడి పంటలకు వెళ్లాలని, పంట మార్పిడి పై వ్య వసాయ, అనుబంధ శాఖల అధి కారులు విస్తృత ప్రచారం కల్పిం చాలని చెప్పారు.
తాగునీటికి సంబంధించి దేవరకొండ నియోజ కవర్గంలో తాగునీరు అందించేం దుకు లింకేజీ ఏర్పాటు చేయాల ని, ఉమ్మడి జిల్లాలోని ఎస్ఎల్బీ సీ, డిండి తో పాటు, ఆయా ని యోజకవర్గాలలో నిర్మా ణంలో ఉ న్న ప్రాజెక్టులన్నింటిని ఈ హయాంలోనే పూర్తి చేస్తామని, దే వాదుల ఫేస్ -6 ద్వారా తుంగతుర్తి నియోజ కవర్గానికి గోదావరి జ లాలు అందిస్తా మని, డిండి ప్రాజె క్టు పనులు, దున్నపోతుల గండి, బస్వా పూర్ లను వేగవంతం చే స్తామని మంత్రి తెలిపారు.ఈ సం దర్భంగా మంత్రి ప్రత్యే కంగా కాలేశ్వరం ప్రాజెక్టుపై రూపొం దించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వాస్తవ పరిస్థి తులను స మావేశానికి హాజరైన ప్రజా ప్రతి నిధులు, మీడి యా తదితరుల కు వివరించారు.
రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమా టోగ్రఫీ శాఖల మంత్రి కోమ టిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఎల్ ని నో ప్రభావం వల్ల ఏర్పడే పరిస్థితు లను ఎదుర్కోవడంలో అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ జి ల్లా ప్రజలకు అండగా నిలబడా ల ని కోరారు. ఎల్ నినో వల్ల ఏర్పడ్డ కరువు పరిస్థితులతో ప్ర జలు అ ధైర్య పడవద్దని, రైతులు ఆరుతడి పంటలు వేసు కోవాలని, కరు వు పరిస్థితిలో ప్రభుత్వం ప్రజల కు అండగా ఉంటుందని, ఎస్ఎ ల్ బిసీ 600 మీటర్లు పూర్తయిం దని, ఆగస్టు 2028 నాటికి ఎస్ఎ ల్బీసీ పూర్తి అయితే ఉమ్మడి న ల్గొండ జిల్లా మొత్తం సస్యశ్యామ లమవుతుందని తెలిపా రు. సా గునీటి ప్రాజెక్టుల సమీక్ష సంద ర్భంగా మంత్రి మా ట్లాడుతూ తాగునీటిని దృష్టిలో ఉంచుకొని ఉదయ స ముద్రంలో నీళ్లు నింపా లని, మూసి నుండి తిప్పర్తి మం డలానికి సాగునీటిని వదలాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదే శించారు. దేవరకొండ నియోజ క వర్గం లోని మూడు మండలాల లో తాగునీటి సమస్య గడిచిన మూడు నెలలు గా ఉన్నందున అక్కడ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి సమస్యను పరిష్కరించాలని, వెంటనే గ్రామాల ప్రజలకు తాగు నీరు అందించాలని మిషన్ భగీ రథ అధికారులను ఆదే శించా రు. నల్గొండ నియోజకవర్గంలో ఇదివరకే వరి నాట్లు వేసు కున్న రైతులకు ఓవర్ లోడ్ కాకుండా అవసరమైతే అదన పు పవర్ కు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపిం చాలని ,బడ్జె ట్ మెటీరియల్ ఇ చ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ,లోవోల్టేజ్ ఉన్నచోట ట్రా న్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని, ఇప్పటి వరకు వేసిన పంటలు కా పాడాల్సిన అవసరం ఉందని, ఇందుకు ప్రతిరోజు సమీక్షించాలని మంత్రి ఆదేశిం చారు.
ప్రభుత్వ విప్ ఆలేరు శాసనస భ్యులు బీర్లు ఐలయ్య మా ట్లాడుతూ బస్వాపూర్, మల్లన్నసాగర్ ల్యాండ్ ఆక్విజేషన్ కు సంబం ధించిన 87 కోట్ల రూపాయలు విడుదల చేస్తే గంధమళ్ళ పూర్త వుతుందని, శామీర్పేట వద్ద 5 కిలోమీటర్ల పని పనులు పూర్తికా నందున భువనగిరి ,ఆలేరుకు నీ ళ్లు వచ్చే అవకాశాలు లేకుండా పోయాయని, ప్రభుత్వం ఇదివ ర కు నిధులు మంజూరు చేసినం దున సంబంధిత ఏజెన్సీbపై ఒత్తి డి తీసుకొచ్చి వెంటనే పనులు పూర్తయ్యే లా చూడాలని కోరా రు. నియోజకవర్గంలో 7 సబ్ స్టే షన్లు మంజూరయ్యాయని, పను లు మొదలు పెట్టారని, ఇప్పటి వరకు ఇంకా పూర్తి కాలేదని, సం బంధిత అధికారులు ఈ విష యంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని కోరారు.
తుంగతుర్తి శాసనసభ్యులు మం దుల సామేలు మాట్లాడు తూ బునియదిగాని కాలువ భూసేక రణకు బడ్జెట్ మంజూ రు చేయా లని ,దేవాదుల ఫేస్ -6 ద్వారా తుంగతుర్తి ని యోజకవర్గానికి నీళ్లు అందించాలని, తన నియో జకవర్గం లో తాగునీటికి సంబం ధించి బోర్ల తవ్వకానికి ప్రాధాన్య త ఇవ్వాలని , ఇందుకు ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరా రు.నాగార్జునసాగర్ శాసనస భ్యులు కుందూరు జైవీర్ రెడ్డి మాట్లాడుతూ ఎల్ నినో విపత్క ర పరిస్థితుల దృష్ట్యా నా గార్జు న సాగర్ నియోజకవర్గంలో ఆరుత డి పంటలైన కందులు, పెసర్లు వంటివి వేసేందుకు రైతులు సు ముఖంగా ఉన్నప్పటికీ కోతుల బెడద వల్ల పండించలేకపోతు న్నారని, ఈ కోతుల బెడదను త ప్పించేందుకు అధికారులు చూ డా లని, అలాగే నియోజకవర్గం ఎన్లోని లిఫ్టుల మరమ్మతు ల ను పూర్తిచేయాలని, చెరువు కట్టల ను బలోపేతం చేయ డం, జంగిల్ క్లియరెన్స్ చేయాలని కోరారు.
కోదాడ శాసనసభ్యురాలు పద్మా వతి రెడ్డి మాట్లాడుతూ ఎల్ నినో వల్ల ఏర్పడిన కరువు పరిస్థితుల ను అధిగమిం చడంలో భాగంగా భూగర్భ జలాలను పెంపొందిం చుకు నేం దుకు సోక్ పిట్ల నిర్మా ణం, ఊట కుంటల నిర్మాణం చే పట్టా లని, అలాగే రైతులు ప్ర త్యామ్నాయ పంటలు వేసుకునే లా అవగాహన కల్పిస్తామని, అ యితే కోతుల సమస్యలను పరి ష్కరించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందని సమావేశం దృ ష్టికి తీసుకువచ్చారు.
దేవరకొండ శాసనసభ్యులు బా లు నాయక్ మాట్లాడుతూ డిండి ప్రాజెక్టు నుండి తాగునీటికి ఎలాంటి అవకాశం లేనం దున దీనికి లింకేజీ ఏర్పాటు చేయాలని, ని యోజకవర్గంలో పవర్ ట్రా న్స్ఫార్మర్రు లేనందున 132 కెవి సబ్ స్టేషన్ ఏర్పా టు చేయాలని కోరారు.సూర్యాపేట శాసనస భ్యులు జగదీ శ్వర్ రెడ్డి మాట్లాడుతూ సూర్యాపేట పట్టణానికి తాగునీటి సమస్య లేకుండా ప్రతి రోజు నిర్దేశించిన పరిమాణంలో తాగునీటిని అందించాలని, సమస్య తీవ్రం కాకుండా ముం దు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మిష న్ భగీరథ అధికా రులను కోరారు.
ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మా ట్లాడుతూ ప్రస్తుత పరిస్థితు ల్లో రైతులు వరి వేసే అవకాశం లేనం దున పత్తి వేసేందుకు అవకాశం ఉందని, అయితే పత్తి రైతులను పెద్ద ఎత్తున ఆ దుకోవాలని, మిష న్ భగీరథ నీరు మునుగోడు ని యోజక వర్గంలో సరిగా రావడం లేదని, ఎప్పటికప్పుడు సమీక్షి స్తూ మిషన్ భగీరథ నీటిని అం దించాలని ,విద్యుత్ కు సంబం ధించి రైతులు చాలా చోట్ల డీడీ లు కట్టారని, వారికి కనెక్షన్లు ఇ ప్పించాలని కోరారు.సమావేశం ప్రారంభమైన వెంటనే నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఎల్ నినో ప్రభావ పరి స్థితులను ఎదు ర్కునేందుకు సంసిద్ధత, ప్రత్యా మ్నాయ ఏర్పాట్లు ఉమ్మడి జిల్లా తరఫున పవర్ పాయింట్ ప్రజెం టేషన్ ద్వారా సమావేశానికి స మర్పించారు.ప్రభుత్వ విప్ , నకి రేకల్ శాసనసభ్యులు వేముల వీ రేశం, నల్గొండ మేయ ర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ కో టిరెడ్డి, స్పెషలాఫీ సర్, రాష్ట్ర కా ర్మిక మరియు ఉపాధి కల్పన సెక్ర టరీ దాసరి హరిచందన, సూర్యా పేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్, యాదాద్రి భువనగిరి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు, మున్సిపల్ చైర్మన్లు, నల్గొండ రెవెన్యూ, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్లు జె. శ్రీనివాస్, ప్రేమ్ కరణ్ రెడ్డి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర ప వ ర్ యా జిల్లాల అ ధికారులు పా ల్గొన్నారు.ఈ సమావేశంలో వ్య వసాయం, నీటిపారుదల, ఉ ద్యాన, విద్యుత్తు, మిషన్ భగీర థ ,భూగ ర్భ జల ,గ్రామీణ అభి వృద్ధి, పశుసంవర్ధక శాఖలపైస మీక్షిం చారు. ఈ సందర్భంగా తె లంగాణ జలసిరిపై రూపొందిం చిన గోడపత్రికను మంత్రులు, ప్ర జాప్రతినిధులు, జిల్లా కలెక్ట ర్లు ఆవిష్కరించారు.








