Tuesday, September 29, 2026
More
    HomeOpinionEx Minister Jagadish Reddy : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఘాటు వ్యాఖ్య, ఉత్తమ్‌కి...

    Ex Minister Jagadish Reddy : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఘాటు వ్యాఖ్య, ఉత్తమ్‌కి దమ్ముంటే చ ర్చకు రావాలి, పక్షంరోజుల్లో రిజ ర్వాయర్లు ఖాళీ ఖాయం 

    📰 Generate e-Paper Clip

    Ex Minister Jagadish Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: రాష్ట్రం లో కాంగ్రెస్ మార్క్ పాలనతో మళ్లీ 2014 నాటి ద యనీయమైన దుర్భిక్ష పరిస్థితులు వచ్చాయని, కరువును ఎదుర్కోవడంలో ప్రభు త్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం నల్గొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కా ర్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉ త్తమ్ కుమార్ రెడ్డిల నిర్లక్ష్యం వల్లే రాష్ట్రం నేడు నీ టి ఎద్దడి దిశగా వెళ్తోందని ఆయన ఆరోపించారు.

    15 రోజుల్లో కట్టలుతెంచుకోనున్న నీటిఎద్దడి

    రిజర్వాయర్లలో నీళ్లు కేవలం మరో 15 రోజులకు మాత్రమే సరిపో తాయని, నల్గొండతో పాటు రాజధాని హైదరాబా ద్‌ కు త్వరలోనే తీవ్రమైన మంచినీటి కటకట రాబోతోందని హె చ్చరించారు. ఒక వైపు గోదావరి నీళ్లు సముద్రంలోకి వృథా గా పోతుంటే.. వాటిని వాడుకునే తెలివి ఈ ప్రభుత్వానికి లే దన్నారు. ఇప్పటివరకు 150 TMCల నీటిని ఉచితంగా స ముద్రం పాలుచేశారని మండి పడ్డారు.

    మా హయాంలో ఎంతటి కరువు వచ్చినా నాగార్జున సాగర్ కింద పంటలకు నీళ్లు ఇచ్చి రైతులకు అండగా నిలిచాం. కా నీ ఈ రోజు రోజుకు 12 గంటలు కూడా విద్యుత్ సరిగా ఇ వ్వడం లేదు. మిషన్ భగీరథ ద్వారా కనీసం తాగునీరు కూ డా సరఫరా చేయలే కపోతున్నారన్నారు.

      50 టిఎంసిల దోపిడీకి మౌన మేల?

    ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాగార్జున సాగర్ నుండి య థేచ్ఛగా 50 TMCల నీటిని దోచుకుపో తుంటే, “చంద్రబాబు శిష్యుడైన రేవంత్ రెడ్డి” కనీసం నోరు విప్పడం లేదని ఎద్దేవా చేశారు. ఇరిగే షన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి శాఖపై కనీ స అవగాహన లేద ని, ఆయన రోజూ మాట్లాడేవన్నీ అబ ద్ధాలేనని జగదీష్ రెడ్డి నిప్పులు చెరిగారు.

    ఉత్తమ్‌కు నిజాయితీ ఉంటే, దమ్ముంటే ల్యాప్‌టాప్ సిస్టమ్‌ తో ముందుకు రా.. కాళేశ్వరం గొప్ప దనం ఏంటో, నీ అబ ద్ధాలేంటో లి టరల్గా నిరూపిస్తా. కన్నెపల్లి పంపులు ఆన్ చే యొచ్చని, సుంది ళ్ల-అన్నారం బ్యారేజీలు బ్రహ్మాండంగా ఉ న్నాయని ఆధారాలతో సహా చూపుతా. NDSA కూడా వీటి ని తప్పుపట్టలేదు. విద్యుత్ బిల్లులు కట్టాల్సి వస్తుందనే దు ర్బుద్ధితోనే కాళేశ్వరాన్ని పక్కన బెట్టి రైతుల నోట్లో మట్టి కొ ట్టారు.”

    రైతులను మభ్యపెడుతున్న ప్రభుత్వం

    కాలం మించిపోయాక ఇప్పుడు జిల్లా రివ్యూలు, ఇంకుడు గుంత లు, పంపాడ్‌లు అంటూ హడావుడి చేస్తూ ప్రభుత్వం షోయింగ్ చేస్తోందని విమర్శించారు. మార్కెట్‌లో రైతులకు సరిపడా విత్తనా లు, ఎరువులు కూడా అందుబాటులో లేవ న్నారు.”బస్వాపూర్ వరకు నీళ్లు ఇచ్చే బాధ్యత మాది.. కన్నె పల్లి రిజర్వాయర్‌ను మాకు అప్పగించండి, తోడి చూ పి స్తాం” అని సవాల్ విసిరిన ఆయన, పదేపదే అబద్ధాలు చె ప్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పే రును అబద్ధాల రెడ్డిగా మార్చుకోవాలని, తక్షణమే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.