Monday, September 28, 2026
More
    HomeIndiaFetal road accident four members laborers dead : బిగ్ బ్రేకింగ్, మృత్యుశకటమైన...

    Fetal road accident four members laborers dead : బిగ్ బ్రేకింగ్, మృత్యుశకటమైన టిప్పర్,  కొవ్వూరు బ్రిడ్జి వద్ద నలుగురు కూలీల సజీవసమాధి

    📰 Generate e-Paper Clip

    Fetal road accident four members laborers dead  ప్రజా దీవెన, కాకినాడ:రెక్కాడితే గాని డొక్కాడని ఆ పేదల జీవితా ల్లో ఉదయం సూర్యుడు కొత్త ఆశ లను మోసుకొ చ్చాడు. కానీ, అదే సూర్యాస్తమయం చూడకుండానే నలు గురు కూలీల ప్రాణాలను అ నంత వాయువుల్లో కలిపేస్తుం దని ఊహించలేదు. కాకినాడ జిల్లా కొ వ్వూరు బ్రిడ్జి సమీ పంలో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం స్థానికం గా గుండె ల్ని పిండేస్తోంది. ఉపాధి హామీ పనుల కోసం నిత్యంలాగే ఆ కూలీలు రోడ్డు దాటుతున్నారు. చే తిలో పనిముట్లు, కళ్లలో రేపటి గు రించిన ఆశలు. సరిగ్గా అదే సమ యంలోనియం త్రణ కోల్పోయిన ఒక మృత్యు శకటంలా దూసుకొ చ్చింది ఓ టిప్పర్ లారీ. మితిమీ రిన వేగంతో వచ్చిన ఆ లారీ, రోడ్డు దాటుతున్న కూలీలను ఒక్కసారి గా ఢీకొట్టింది.

           ఘటనా స్థలంలో భీభత్సం

    టిప్పర్ వేగానికి నలుగురు ఉపాధి కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు వి డిచారు. వారి మృతదేహాలు రోడ్డు పై చెల్లాచె దురుగా పడి ఉన్న దృ శ్యం చూసిన వారిని కన్నీరు పెట్టిం చింది. ఈ ఊహించని ప్రమాదంలో మరో ఇద్దరు కూలీలు తీవ్రంగా గా యపడ్డారు. ప్రమాదం జరిగిన వెం టనే స్థానికు లు స్పందించి, రక్తపు మడుగులో ఉన్న బాధితులను స మీ పంలోని ఆసుపత్రికి తరలించా రు. ప్రస్తుతం వారి పరిస్థితి విష మంగా ఉన్నట్లు సమాచారం. వై ద్యులు వారికి అత్య వసర చికిత్స అందిస్తున్నారు.

    ఇదిలా ఉండగా సమాచారం అం దుకున్న వెంటనే పోలీసు లు ఘట నా స్థలానికి చేరుకున్నారు. ప్రమా ద తీవ్రతకు దారి తీసిన పరిస్థితుల పై ఆరా తీస్తున్నారు.లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమా? లేదా బ్రేకులు ఫెయిల్ అయ్యా యా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. సంఘటనా స్థలంలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి, మృత దేహా లను పోస్ట్‌మార్టం నిమిత్తం త రలించారు. మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

    కడుపు నింపుకోవడానికి కూలి ప నులకు వెళ్లిన పేదలు, ఇలా శవాలై తిరిగి వస్తారని వారి కుటుంబ స భ్యులు ఊ హించలేదు. ఈ దారు ణ ఘటనతో కొవ్వూరు బ్రిడ్జి పరి సర ప్రాంతాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ రోడ్డు ప్ర మాదం మరోసారి మితిమీరిన వే గానికి, రహదారి భద్ర తా లోపాలకు సజీవ సాక్ష్యంగా నిలిచింది.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.