Monday, September 28, 2026
More
    HomeIndiaForest Minister Konda Surekha : మంత్రి సురేఖ భావోద్వేగం,గాయపడిన 'దుశర్ల' శరీరం విధ్వంసానికి గురైన...

    Forest Minister Konda Surekha : మంత్రి సురేఖ భావోద్వేగం,గాయపడిన ‘దుశర్ల’ శరీరం విధ్వంసానికి గురైన అడవిని తలపిస్తోంది

    📰 Generate e-Paper Clip

     

    Forest Minister Konda Surekha : ప్రజా దీవెన, హైద రాబాద్: పర్యా వరణవేత్త, నీటి హక్కుల ఉద్యమ కారుడు దుశర్ల సత్యనారాయపై దాడి హేయమైనదని అటవీ, ప ర్యావరణ, దేవాదాయ శాఖ మం త్రివర్యులు కొండాసురేఖ అన్నారు. తీవ్రంగా గాయపడి నిమ్స్ హాస్పటిల్ లో చికిత్స పొందుతున్న ఆయ నను అటవీ, పర్యావరణ, దేవాదా య శాఖ మంత్రి కొండా సురఖ ప రామర్శించారు. వారు దాడికి గు రైన నేపథ్యాన్ని యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నా రు.సత్యనారాయణకి అందుతున్న చికిత్స వివరాలపై డాక్ట ర్లను ఆరాతీశారు.

    ఈ సందర్భంగా మంత్రి సురేఖ మా ట్లాడుతూ గాయపడి నెత్తురొడిన దుశర్ల సత్యనారాయణ శరీరం వి ధ్వంసానికి గురైన అడవిని తలపి స్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప చ్చదనం పెంపు కోసం, నీటి వనరు ల హక్కుల కోసం ఎన్నో పోరాటా లు, త్యాగాలు చేసిన మహామనిషి దాడి గురికావ డమంటే మనిషి ఉ నికి దాడికి గురవడమేనని మంత్రి పేర్కొ న్నారు. ఫ్లోరోసిస్ సమస్య ని ర్మూలనకు జలసాధన సమితి వ్య వస్థాపకుడిగా సత్యనారాయణ చే సిన పోరాటం ఎంతో గొప్పదన్నా రు. నల్గొండ నుండి ఢిల్లీ వరకు పా దయాత్రలు, నిరసన కార్యక్రమాలు చేపట్టి నల్గొండ జిల్లా ప్రజలు ఎదు ర్కొంటున్న ఫ్లోరోసిస్ సమస్యపై జ నాల్ని జాగృతం చేశారని అన్నారు.

    నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి ముందు వంకర్లు పోయిన ఫ్లోరైడ్ బాధితులను పడుకోబెట్టి తెలంగాణ రా ష్ట్రంలోని ఫ్లోరైడ్ స మస్య తీవ్రతను దేశానికి చాటిన జల సాధకుడు సత్యనారాయణ అ ని ప్రశంసించారు. వారిపై దా డికి పాల్పడిన వారిని చట్టపరిధిలో కఠి నంగా శిక్షించాలని సూర్యాపేట ఎ స్పీ నరసింహ ను మంత్రి సురేఖ ఆదేశించా రు. తెలంగాణలోనే అతిపెద్ద 70 ఎకరాల మానవనిర్మిత అ డవిని సృష్టించి ఎన్నో వైవిధ్య భరితమైన వృక్ష, పక్షి, జంతు జాలానికి కేంద్రంగా నిలపిన ప్రకృతి ప్రేమికుడు దుశర్ల సత్య నారాయణ. వారికి ప్రభుత్వం అన్ని వేళలా అండగా వుం టుందని, ప్రభుత్వపరం గా ఆయనకు కావాల్సిన సహాయ, సహకారాలను అందించేందుకు ప్ర భుత్వం సిద్ధంగా వుంద ని మంత్రి సురేఖ స్పష్టం చేశారు.

    ప్రకృతి శక్తులే సహకరించడం వల్లే సత్యనారాయణ ఈ దా డి నుండి ప్రాణాలతో బయటపడ్డారని మం త్రి సురేఖ తెలి పారు. సత్యనారా యణ త్వరగా కోలుకుని వారికి ఎంతో ఇష్టమైన ప్రకృతి పరిరక్షణ పనుల్లో నిమగ్నం కావాలని భగ వంతున్ని ప్రార్థిస్తున్నట్లు మంత్రి సురేఖ తెలిపారు. జీవవైవి ద్యానికి ఆల వాలంగా నిలిచిన సత్యనారాయ ణ అభివృద్ధి చేసిన 70 ఎకరాల అటవీ క్షేత్రానికి వన మహోత్సవం కార్య క్రమ నిధులతో సంరక్షణ చ ర్యలు చేపడతామని మంత్రి సు రే ఖ సత్యనారాయణకు హామీ ఇచ్చారు. తదనుగుణంగా సత్య నా రాయణ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.స త్యనా రాయణ స్ఫూర్తితో రాష్ట్ర ప్రజలందరూ ప్రత్యేక సందర్భాల్లో మొక్కలు నాటి పర్యావరణ సమ తుల్యతను కాపాడాలని మంత్రి సురేఖ పిలుపునిచ్చారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.