Ex Minister Harish Rao : ప్రజా దీవెన, హైదరాబాద్: రా ష్ట్రంలో జరగబోతోన్న మున్సిపల్ ఎ న్నికల్లో మీరు కారు గు ర్తుకు ఓటు గుద్దితే రేవంత్ రెడ్డికి గూబగుయ్యిమన్నప్పుడే ప్రజలకు భయపడి హామీలైనా అమలు చేస్తాడని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు. ఓటుకు రూ. 5 వేలిస్తామంటారు, అవి తీసుకొని మోసపో వద్దని, మహిళల కు రావాల్సిన రూ. 60వేలు, అవ్వ తాత లకు రూ. 4వేలు పెన్షన్ రావా లంటే బీఆర్ఎస్ గెలవాల న్నారు. అవ్వతాతలు పెన్షన్ అడిగితే లా గుల తొండలు తీసిపెడతా అంటా డని, మహిళలు హామీలు అడిగితే మె డలో పేగులు వేసుకుంటా అం టాడు, తులంబంగారం ఏది అని అడిగితే గుడ్లు పీకి గోటీలు ఆడు తా అంటాడు, ప్రశ్నిస్తే కళ్లు నెత్తికె క్కి మాట్లాడుతున్నాడని, ఈ ఎన్ని కల్లో ఓటుతో బుద్ధి చెప్పి ఆయన అహంకారాన్ని దించాలని పిలుపు నిచ్చారు.
పటాన్ చెరువు నియోజకవర్గంలో ని జిన్నారం మున్సిపాలి టీలో మా జీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ప ర్యటించారు. జిన్నారం గ్రామ వాకిటి వద్ద స్థానికులతో ము చ్చటించిన ఆయన కాంగ్రెస్ ప్రభు త్వం ప్రజలను మోసం చే స్తున్న తీరును ఎండగట్టారు. ఈ సందర్భం గా హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే…మేము అధి కారం లో ఉన్నప్పుడు జిన్నారం గ్రామ పంచాయతీ గానే ఉండాల ని కోరుకున్నాం. మున్సిపాలిటీ అయితే ప్రజల మీద పన్ను ల భారం పడుతుందని ఆపాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రా గానే జిన్నారంను మున్సిపాలిటీ చేసి మీమీద పన్నుల భా రం మోపింది. ఇప్పుడు ఎవరికి ఓటేద్దాం మనల్ని మంచిగా చూసు కున్న వాళ్ళకి, మన భారాన్ని తగ్గించే వాళ్ళకే ఓటే ద్దాం.
కేసీఆర్ రూ. 200 ఉన్న పెన్షన్‌ను రూ. 2000 చేస్తాననిచెప్పి, అధికా రంలోకి వచ్చిన మొదటి నెలలోనే చేసి చూపించా రు. రేవంత్ రెడ్డి రూ. 4వేలు ఇస్తానని చెప్పి రెండేళ్లు గడిచి నా ఇవ్వడం లేదు. పక్క నే ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నా యుడు రూ. 4వేలు ఇస్తానని చెప్పి ఇస్తున్నాడు కదా, మరి ఇక్కడ రే వంత్ రెడ్డికి ఎందుకు చేతులు రా వడం లేదు.
మహాలక్ష్మి పథకం కింద నెలకురూ. 2500 ఇస్తానని చెప్పి రేవంత్ రెడ్డి మోసం చేశాడు. ఈ 24 నెలల్లో ఒక్కో మహిళ కు ప్రభుత్వం రూ.60 వేలు బాకీ పడింది. కేసీఆర్ ఉన్న ప్పు డు బతుకమ్మకు ప్రతి మహిళ కు చీర ఇచ్చేది. రేవంత్ రెడ్డి వచ్చా క చీర లేదు, గాజులు లేవు. ఏదో గ్రూపులో ఉన్న కొద్ది మందికి ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. ఫ్రీ బస్సు అని చె ప్పి మగోళ్లకు డబల్ టి కెట్ కొట్టారు, ఆడోళ్ళకు సీటు దొర క్క తిప్పలు పడుతున్నారు.రేవంత్ రెడ్డి వచ్చాక 5 పంటలు వస్తే రెండింటికి ఇచ్చి మూడింటికి రైతు బంధు ఎగ్గొట్టాడు. నాటేసిన వాళ్ల కే రైతుబంధు ఇస్తా, శాటిలైట్ లో చూసి ఇస్తా మని కొత్త నిబంధనలు పెట్టి రైతులను గోస పెడుతున్నాడు.
దేవుడి మీద ఒట్టు వేసి రుణమాఫీ చేస్తానని చెప్పి మాట త ప్పిన పాపాత్ముడు రేవంత్ రెడ్డి. ఏ ఊర్లో చూసినా సగం మందికి కూడా రుణమాఫీ కాలేదు.ఇంకా రెండేళ్లు ఓ పిక పట్టండి. వచ్చేది మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వమే. జిన్నారం సమ స్యలు పరిష్కరించుకుందాం. మైనార్టీలకు అండగా నిలిచిం ది, షాదీ ముబా రక్ ఇచ్చింది బీఆర్ఎస్ మాత్రమే. రే వంత్ రెడ్డి ముస్లింలకు ఒక్క రూ పాయి పని చేయలేదు. కాబట్టి అం దరూ ఏకమై కారు గుర్తు అభ్య ర్థు లను గెలిపించండి అని హరీష్ రావు కోరారు.

