Sunday, September 27, 2026
More
    HomeOpinionFormer MLA Chiru Marthi Lingaiah : బిగ్ బ్రేకింగ్, మాజీ ఎమ్మెల్యే చిరు మర్తి...

    Former MLA Chiru Marthi Lingaiah : బిగ్ బ్రేకింగ్, మాజీ ఎమ్మెల్యే చిరు మర్తి లింగయ్య ఆగ్రహం, మూడు మాసాలుగా కల్లాల్లోనే ధాన్యం

    📰 Generate e-Paper Clip

    Former MLA Chiru Marthi Lingaiah: ప్రజా దీవెన, రా మన్నపేట:కాంగ్రెస్ మాటలు నమ్మి Growth ఇప్పుడు కం టి మీద కునుకు లేకుండా పోయిందoటూ యాదాద్రి భువన గి రి జిల్లా రామన్నపేట మండలం దుబ్బాక, పల్లివాడ గ్రామా ల్లోని మహిళా రైతులు కన్నీటిపర్యంతమయ్యారు. మా ర్కె ట్ కల్లాల్లో ధాన్యం పోసి మూడు నెలలు దాటినా కొనుగోలు చేసే నాథుడే కరువయ్యాడంటూ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఎదుట రైతులు తమ ఆవేదనను వెళ్లగక్కారు. సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన చి రుమర్తిలింగయ్య రైతుల సమస్యలను అడిగి తెలు సుకు న్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

    కళ్ళాల్లోనే  3నెలలుగా రైతుల అరిగోస

    ఎన్నికల ముందు రైతులకు అండగా ఉంటామని చెప్పిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక అన్నదాతలను గాలికి వది లేసిందని రైతులు ఆరోపించారు.గతంలో ఎన్నడూ ఇలాంటి కష్టాలు చూడలేదని, కేసీఆర్ మాట వినకుండా కాంగ్రెస్‌ కు ఓ టేసి మోసపోయామని, మళ్లీ కేసీఆర్ రైతు రాజ్యం వస్తేనే మా కష్టాలు తీరుతాయని మహిళా రైతులు స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్ల లో జాప్యం వల్ల వడ్డీలు, కూలీల ఖ ర్చులు ,రవాణా చార్జీలు పెరిగి పోయి రైతులు తీవ్ర అప్పుల పాల వుతున్నారన్నారు.

      కాంగ్రెస్ ప్రభుత్వంపై చిరుమర్తి ఫైర్

    ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మా ట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అన్ని రంగాల్లో దివా లా తీసిందని విమర్శించారు. దోచుకోవడం, దాచుకో వడం తప్ప.. ప్రజల సమస్యలను పట్టించుకునే చిత్తశుద్ధి ఈ ప్రభు త్వానికి లేదని, ప్రజా సమస్యలను పక్కనబెట్టి కేవలం డై వ ర్షన్ రాజకీయాలు చేస్తున్నారని ఘాటుగా విమర్శించారు. ఒకపక్క రైతులు రోడ్లపై పడుతుంటే, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలు పేరుకుపో తుంటే ప్రభుత్వం ఏమీ సాధిం చిందని సంబరాలు చేసుకుంటోందని ప్రశ్నించారు.అకాల వ ర్షాల వల్ల ధా న్యం తడిసి నాణ్యత కోల్పోతే దా నికి కాంగ్రెస్ ప్రభుత్వమే పూర్తి బా ధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

    గాంధీభవన్‌కే పరిమితమైన ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే

    ప్రజా సమస్యలను గాలికి వదిలేసి, కేవలం ప్రెస్ మీట్లకు, గాంధీభవన్‌ కే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. వీరి పరిస్థితి ఇలా ఉంటే బీ ఆర్ఎస్ హయాంలో కొనుగోలు కేం ద్రాలు సకాలంలో ప్రారంభమై, రైతులకు రూపాయి నష్టం లే కుండా ధాన్యం కొనుగోళ్లు సాగేవని గుర్తు చేశారు. రాష్ట్రంలో రైతులు, మహిళలు, నిరుద్యోగులు అంతా కాంగ్రెస్ పాలన పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఇప్పటికైనా ప్రభుత్వం క ళ్లు తెరిచి, వెంటనే పెండింగ్‌లో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో నగదు జమ చేయాలని చిరుమర్తి లింగ య్య డిమాండ్ చేశారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.