Gas cylinders problems in Wyra : ప్రజా దీవెన, ఖ మ్మం ప్రతినిధి: ఒక వైపు డిజిటల్ ఇండియా.. ఇంటి వద్దకే సేవలు అంటూ ప్రభుత్వాలు గొప్పలు చెబుతుంటే, క్షేత్రస్థా యిలో మాత్రం కథ అడ్డం తిరుగుతోంది. నిత్యావసర వస్తు వుగా మారిన వంటగ్యాస్ సిలిండర్ కోసం ఏన్కూర్ మండ ల ప్రజలు పడుతు న్న అవస్థలు చూస్తే ‘ఇది అసలు 2026 నాటి వ్యవస్థేనా?’ అనే అనుమానం రాక మానదు. గృహ వి నియోగదారుల ఇళ్ల ముందుకు వెళ్లాల్సిన సిలిండర్లు.. వ్య వసాయ మార్కెట్ ప్రాంగణంలోనే పరిమిత మై ‘దందా ’కు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి.
ఆన్లైన్లో బుక్ చేస్తే చాలు, సిలిం డర్ గుమ్మంలోకి వస్తుం దనుకుంటే పొరపాటే. ఇక్కడ డోర్ డెలివరీ అ నే మాట విన పడదు.మారుమూల గ్రామాల నుంచి వచ్చే వృద్ధులు, మహి ళలు, దివ్యాంగులు గంటల తరబడి ఎండలో గ్యాస్ వాహ నం కోసం వేచి చూడాల్సిన దయనీయ పరిస్థితి. సొంత వా హనాలు లేని నిరుపేద కుటుంబాలు సిలిండర్లను రోడ్లపై కా ళ్లతో నెట్టుకుంటూ, భుజా లపై మోస్తూ ఇళ్లకు తీసుకెళ్తున్న దృశ్యాలు స్థానికంగా కలచివేస్తు న్నాయి.
భారంగా మారిన రవాణా

ఆటోలు అద్దెకు తీసుకుని సిలిం డ ర్లు తెచ్చుకోవాల్సి రావ డంతో.. సి లిండర్ ధర కంటే రవాణా ఖర్చే ఎక్కువవు తోం దని గ్రామీణులు వా పోతున్నారు.మేం డిజిటల్‌గా బుక్ చే సుకుని, డెలివరీ ఛార్జీలు కూడా చెల్లిస్తున్నప్పుడు.. మేమే మార్కెట్ కు వచ్చి తెచ్చుకోవాలా? ఇక ఆన్ లైన్ వ్యవస్థ ప్ర యోజనం ఎవరి కోసం?”.
బ్లాక్ మార్కెట్ జోరు.. గృహ సిలిండర్లే టార్గెట్
ఇంటింటికీ గ్యాస్ ఇవ్వడానికి సవా లక్ష సాకులు చెప్పే సద రు విభా గం.. నిబంధనల ఉల్లంఘనకు మాత్రం రెడ్ కార్పెట్ పరుస్తోంది. గృహ వినియోగానికి మాత్రమే కేటాయించిన సబ్సిడీ గ్యాస్ సిలిం డర్లు.. మండల పరిధిలోని పలు హోట ళ్లు, టీ కొట్లు, టిఫిన్ సెంటర్ల లో బహిరంగంగానే దర్శనమి స్తున్నాయి. కమర్షియల్ సిలిండర్లు వాడాల్సిన చోట, తక్కు వ ధరకు లభించే డొమెస్టిక్ సిలిండర్లను వా డుతూ ప్రభు త్వ ఖజానాకు గండి కొడుతున్నా అడిగే నాథుడే లేడు
అధికారుల కళ్ల ముందే..అంతా గప్ చుప్
ఈ తతంగమంతా ఏదో మారు మూల చీకట్లో జరగడం లే దు. మండలంలోని కీలక ప్రభుత్వ కార్యాలయాల సమీపం లో, అందరి కళ్ల ముందే వందలాది మంది ప్రజలు అల్లాడు తున్నారు, అక్రమ గ్యాస్ దందా సాగుతోంది. పౌర సరఫరా ల శాఖ (Civil Supplies), తూని కలు-కొలతల శాఖ (Wei ghts & Measures) స్థానిక రెవెన్యూ అధి కారులు ఈ వి భాగాల పర్యవేక్షణ లోపం వల్లే ఇదంతా సాగుతోందన్న వి మర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
ఇకనైనా స్పందించేనా..?
ప్రజల సౌకర్యం కోసం రూపొందిం చిన వ్యవస్థ, ప్రజలకే శా పంగా మా రితే అది పరిపాలనా వైఫల్యమే అ వుతుంది. జి ల్లా యంత్రాంగం, ఆ యిల్ కంపెనీల ఉన్నతాధికారులు ఇప్ప టికైనా స్పందించి ఏన్కూర్ మండలంలో గ్యాస్ పంపిణీపై స మగ్ర విచారణ జరపాలని, డోర్ డెలివరీని వెంటనే పునరుద్ధ రించాలని, వాణిజ్య అవసరాలకు డొమెస్టిక్ సిలిండర్లు వాడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. గ్యాస్ కోసం ప్రజలు ఎదురుచూడా లా..? లేక ప్రజల కోసం వ్యవస్థ పని చేయాలా..?” అనే ప్రశ్నకు పాలకులు, అధికారులు సమాధా నం చెప్పాల్సిన సమయం ఆసన్న మైందన్న బలమైన వాద న వినిపిస్తోంది.

