Gutha Sukender Reddy Chairman : ప్రజా దీవెన, చి ట్యాల: ప్రజా సం క్షే మంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గత నెల 30న రాష్ట్ర బడ్జెట్ ను ఆ మోదించుకున్న విషయం తె లిసిందేనని, రాష్ట్రంలో కొత్తగా 2లక్షల మందికి పెన్షన్లు మం జూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, అలాగే నియోజకవర్గానికి 3 500 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్ష ల ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలం గాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వె ల్లడించారు. ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యా చరణ ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 2న రాష్ట్రవ్యాప్తంగా గ్రా మ సభలు ప్రారంభమయ్యాయి. గురు వారం నల్గొండ జిల్లా చిట్యాల మం డలం ఊరుమడ్ల గ్రామంలో గ్రామ సర్పంచ్ భానుశ్రీ అధ్యక్షతన నిర్వ హించిన గ్రామసభకు రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తాసుఖేందర్ రె డ్డి, ప్రభుత్వ విప్, నకిరే కల్ శాసన సభ్యులు వేముల వీరేశం, జిల్లా కలెక్టర్ బి. చంద్ర శేఖర్ లు హాజరయ్యారు.
గ్రామసభలో రాష్ట్ర శాసన మండ లి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో99 రోజుల ప్ర జాపాలన- ప్రగతి ప్రణాళిక సం ద ర్భంగా గత రెం డు సంవత్సరాలలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ ప థకాల లబ్దిని ప్రజలకు వివ రి స్తూ ప్రజల సమస్యలను తీ ర్చేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతున్నదని తెలిపా రు.ఈ విడతన ఇదివరకే బేస్మెంట్ వేసుకున్న వారికి, పిల్లర్లు వేసుకున్న వారికి కూ డా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేందుకు ప్ర భుత్వం నిర్ణయించినట్లు వెల్లడించారు.విద్యాభివృద్ధిలో భా గంగా నియోజకవర్గానికి ఒక తెలంగాణ మోడల్ స్కూల్ ను ఏర్పాటు చే స్తున్నామని, ఉరుమడ్ల గ్రామంలో తెలంగాణ మోడల్ స్కూల్ ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదు పా యాలు, సీసీ రహదారులు అ న్ని సౌకర్యాలు ఉన్నందున మోడల్ స్కూలును ఏర్పాటు చేయాలని ప్రభుత్వ విప్ వే ముల వీరేశంతో కోరారు.
ఉరుమడ్ల గ్రామాన్ని అన్నిరకాలుగా అభివృద్ధి చేసేందుకు చ ర్యలు తీ సుకుంటున్నామని, సీసీ రోడ్లు, క మ్యూనిటీ హాల్స్ నిర్మించామని, రెండు అంగన్వాడీ భవనాలు పూర్తి చేశామ ని, రెండున్నర కోట్ల రూపా యలతో చెరువును పటిష్టం చేశా మని, రెండుకోట్ల రూపాయలతో గ్రామానికి బీటీ రహదారి మంజూ రు అయిందని, ప్రభుత్వం ఏర్పా టు చేసిన ప్రభు త్వ సంస్థలను, సౌ కర్యాలను ప్రజలు సద్వినియోగం చేసు కోవాలని కోరారు. రానున్న సంవత్సర కాలంలో ప్రజలకు సంబంధించి మిగిలిపోయిన సమస్యలన్నీ పరిష్కరి స్తా మన్నారు. గతంలో గ్రామంలో 11మంది ఎస్సీలకు భూము లు ఇవ్వడం జరిగిందని, అయితే దారిలేనందున ప్రత్యా మ్నాయంగా మరో భూమిని కేటాయించడం జరిగిందని త్వ రితగతిన మాభూమిని లబ్ధిదారులకు ఇప్పించే ఏర్పాటు చే యాలని జిల్లా కలెక్టర్ తో కోరారు.
ప్రభుత్వ విప్,నకిరేకల్ శాసనస భ్యులు వేముల వీరేశం మా ట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం గడచిన 2 సం వత్సరాలుగా క్లిష్ట పరిస్థితులను ఎ దుర్కొంటూ ప్రజల అభివృద్ధి, సం క్షేమానికి వివిధ రకాల కార్యక్రమా లు అమలు చేస్తున్నదని, ఉచిత విద్యుత్, 500 రూపాయలకే సిలిండర్, సన్న బియ్యం, తది తర పథకాలను 6 గ్యారంటీలను అమలు చేస్తున్నదని తెలి పారు. ఇంకా చాలామంది అర్హులైన వారికి రేషన్ కార్డులు రావాల్సి ఉందని, వాటిని కూడా ప్రభుత్వం మంజూరు చే యడం జరుగుతుందని తెలిపారు. ప్ర జాపాలన- ప్రగతి ప్ర ణాళిక కార్యక్ర మాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఉరుమడ్ల గ్రామం లో చెరువులు, రహదారులు అ న్నింటిని అభివృద్ధి చేసుకోవడం జ రిగిందని, ఉరుమడ్ల గ్రా మ అభివృ ద్ధిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నారన్నారు.
జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లా డుతూ ప్రజాపాలన -ప్రగతి ప్ర ణా ళికలో భాగంగా మార్చి 6న ప్రారం భమైన కార్యక్రమం మార్చి 15 వర కు పరిశుభ్రత, ఫైళ్ల క్లియరెన్స్ జరి గిందని, అన్ని ప్రభుత్వ కార్యాల యాలలో వివిధ పథకాల కింద ల బ్దిదారుల వివరాలను సేకరించడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళ శక్తి పథకం, మహి ళకు ఉచిత బస్సు, రేషన్ కార్డులు, సన్న బియ్యం పండించిన రైతుల కు 500 రూపాయల బోనస్ వంటి వి ఇదివరకే ఇవ్వడం జరిగిందని తెలిపారు. నూతన పథకాలలో భా గంగా పాఠశాల, ఇంటర్ విద్యార్థు లకు అల్పాహారం, అన్ని వర్గాల ప్ర జలకు జీవిత బీమా పథకం, ది వ్యాంగులకు మోటారు బ్యాటరీ సై కిళ్లు, రైతులకు మేలైన వంగడాలు ఇస్తున్నామని, ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక సందర్భంగా నిర్వహిస్తు న్న గ్రామసభలలో ఆయా పథకాల కింద లబ్ధి పొందిన లబ్ధిదారుల వి వరాలన్నిటిని చదివి వినిపించడ మే గాక, గ్రామంలో సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్ట డం జరుగుతున్నదని వెల్లడించా రు.
అంతకుముందు గ్రామ సర్పంచ్ భా నుప్రియ అధ్యక్షతన గ్రామసభ ను ప్రారంభించి రాష్ట్ర ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి వినిపించారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈ వో ప్రేమ్ కరణ్ రెడ్డి ,చిట్యాల ము న్సిపల్ చైర్మన్ పందిరి గీత, తహ సిల్దార్ విజయ, ఎంపీడీవో జయ లక్ష్మి, గ్రామ ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులు, తది తరులు హాజరయ్యారు. అంతకు ముందు ఉరుమడ్ల గ్రామ శివారు లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చే సిన దాన్యం కొనుగోలు కేంద్రాన్ని శాసనమండలి చైర్మన్ గుత్తా సు ఖేందర్ రెడ్డి ప్రభుత్వ విప్ నకిరే క ల్ శాసనసభ్యులు వేముల వీరేశం జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ లు ప్రా రంభించారు.



