Tuesday, September 29, 2026
More
    HomeIndiaHorrific Road Accident : బిగ్ బ్రేకింగ్, నెత్తురోడిన నాగ్‌పూర్ ముంబై ఎక్స్‌ప్రెస్‌వే, ఎనిమిది మంది...

    Horrific Road Accident : బిగ్ బ్రేకింగ్, నెత్తురోడిన నాగ్‌పూర్ ముంబై ఎక్స్‌ప్రెస్‌వే, ఎనిమిది మంది మహిళాకూలీల దుర్మరణం

    📰 Generate e-Paper Clip

     

    Horrific Road Accident :  ప్రజా దీవెన, నాగ్ పూర్: రోజు వారీ కూలీ పనులతో రెక్కలు ముక్కలు చేసుకుని, అలసిన దేహాలతో గూ టికి చేరుకోవా లనుకున్న ఆ తల్లులను మృ త్యువు రోడ్డు ప్రమాద రూపంలో కబళించింది. మహా రాష్ట్ర లోని జల్నా జిల్లా పరిధిలో నావిగ్ పూర్ ఎక్స్ ప్రెస్ హైవే పై బుధవారం సాయంత్రం పొ ద్దు పోయిన తర్వాత జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం అందరినీ కలచివేస్తోంది.

    నాగ్‌పూర్-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై పా రిశుధ్య పనులు ముగిం చుకుని, ఒ క టెంపోలో 11 మంది ప్రయాణికు లు (డ్రైవర్‌ తో కలిపి) తిరుగు ప్ర యాణమయ్యారు. వారు తమ ఇ ళ్లకు చేరుకోవడానికి మరికొద్ది నిమి షాల సమయం పడుతుంద నగా, వేగంగా వచ్చిన ఒక ట్రక్కు వీరి టెం పోను బలంగా ఢీ కొట్టింది. బలంగా ఢీకొనడంతో టెంపో నుజ్జునుజ్జయ్యింది. ఘటనా స్థలంలోనే ఏడుగురు మహిళలు ప్రాణాలు వదల గా, మరొకరు ఆసుపత్రిలో పోరాడుతూ కన్నుమూశారు.

    ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక ప్రజలు, జల్నా పోలీసులు స్పం దించి సహాయక చర్యలు చేపట్టా రు.గాయపడిన మిగి లిన వారిని తక్షణమే సమీపంలోని ఆసుపత్రికి తరలించా రు.ప్రస్తుతం మరణించి న వారి సంఖ్య 8కి చేరింది. అయి తే, గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండ టంతో ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    ఇదిలా ఉండగా ప్రమాదంలో మరణించిన వారిని అల్కా బాయి ఆడమ్నే (45), లక్ష్మీబాయి మదన్ (35), మీనాబా యి ఆడమ్నే (45), కంచన్ ఆడమ్నే (50), తారాబాయి చౌద రి (60), కడుబాయి మదన్ (55) మరియు సుమన్ ఆడ మ్నే (70) గా గుర్తించగా బాధితుల్లో ఒకరి గుర్తింపు ఇంకా నిర్ధారణ కావాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

    పోలీసులు ట్రక్ డ్రైవర్‌ను అరెస్టు చేసి, భారతీయ న్యాయ సంహిత (BNS) లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన పట్ల మహారాష్ట్ర పర్యావరణ శాఖ మం త్రి పంకజా ముండే తీవ్ర విచారం వ్యక్తం చేశారు; మృతుల కుటుంబాలకు మరియు క్షతగాత్రులకు ఆర్థిక సహాయం అం దిస్తామని హామీ ఇచ్చారు.

    నిత్యం రహదారులను శుభ్రం చే స్తూ ప్రయాణికుల ప్రయా ణాన్ని సుఖమయం చేసే ఆ మహిళా కార్మి కులే అదే రహ దారిపై విగతజీవు లుగా పడి ఉండటం తీరని వేదనను మి గిల్చింది. వారి కుటుంబాల్లో ఈ ప్రమాదం పూడ్చలేని లోటు ను మిగిల్చింది.ఇంటికి చేరుకోవాలని ఆశతో బయలు దేరిన ఆ మహిళలు ఇక తిరిగి రాని ప్రయాణానికి వెళ్లిపోయారు. ఈ ఘటన మరొకసారి రోడ్డు భద్రతపై గంభీర ప్రశ్నలను లేవ నెత్తుతోంది.

     

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.