Monday, September 28, 2026
More
    HomeIndiamahabubnagar fetal road accident : బిగ్ బ్రేకింగ్, పాలమూరు పాలకొండలో మృత్యుఘోష, రేసింగ్ బైక్...

    mahabubnagar fetal road accident : బిగ్ బ్రేకింగ్, పాలమూరు పాలకొండలో మృత్యుఘోష, రేసింగ్ బైక్ వేగానికి ఐదుగురి ప్రాణాలు బలి

    📰 Generate e-Paper Clip

     

    mahabubnagar fetal road accident :  ప్రజా దీవెన, మహబూబ్ నగర్: ఆ రహదారిపై ఇంజిన్ల గర్జన వినిపిం చిం ది. నిముషాల్లోనే అది ఆర్తనా దంగా మారింది. అతివేగం ఎంతటి అనర్థానికి దారితీస్తుందో చెప్పడానికి మహబూబ్ నగర్ బైపాస్ రోడ్డు లో జరిగిన ఘోర ప్రమాదమే సా క్ష్యంగా నిలుస్తోంది. పాలమూరు జిల్లా పాలకొండ జంక్షన్ వద్ద ఒక రేసింగ్ బైక్, కారు ముఖాముఖి ఢీ కొన్న ఘటనలో ఐదుగు రు అక్క డి కక్కడే ప్రాణాలు విడిచిన ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది.

    ఈ ఘోర సంఘటనకు సంబంధించి పూర్వపరాలు ఇలా ఉన్నాయి. మహబూబ్ నగర్ శివారులోని పా లకొండ జంక్ష న్ వద్ద ఈ విషాదం చోటు చేసుకుంది. పోలీసుల ప్రాథ మిక సమాచారం ప్రకారం ఒక స్పో ర్ట్స్ రేసింగ్ బైక్ అత్యంత వే గంతో దూసుకువస్తూ నియంత్రణ కోల్పో యింది. ఎదురుగా వస్తున్న కారు ను నేరుగా ఢీకొట్టడంతో ఆధాటికి రెండు వా హనాలు నుజ్జునుజ్జ య్యాయి. బైక్‌పై ఉన్న ఇద్దరు యు వ కులు, కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృత్యువాత పడ్డా రు.

    చిదిమేసిన చిగుళ్లు, చెదిరిన కుటుంబం

    ఈ ప్రమాదం ఒక కుటుంబాన్ని తీ వ్ర విషాదంలో ముంచెత్తిం ది. కారు లో ప్రయాణిస్తూ ప్రాణాలు కోల్పో యిన వారిని గౌ సియా (30), ఉజే ఫా (8), ఆమిర్ (18 నెలలు) కళ్లు తెరవక ముందే కాలగర్భంలో క లి సిపోయిన చిన్నారి.మరో మహిళ కు తీవ్ర గాయాలవ్వగా, ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఆ మె ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతోంది.

    ఘటనా స్థలానికి చేరుకున్న పోలీ సులు మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమో దు చేసి, అతివేగమే ప్రమాదానికి కార ణమని ప్రాథమికంగా నిర్ధారించారు. దర్యాప్తు కొనసాగు తోంది. ఇదిలా ఉండగా రహదారులపై వే గం మోజులో పడి నిండు ప్రాణాల ను బలి తీసుకోవద్దని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసు లు హెచ్చరిస్తున్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.