Sunday, September 27, 2026
More
    HomeOpinionMahathmaGandhiUniversity : బిగ్ బ్రేకింగ్, ఈ నెల15వ తేదీన ఎంజియూకు గవర్నర్ రాక, స్నాతకోత్సవానికి హాజరుకానున్న...

    MahathmaGandhiUniversity : బిగ్ బ్రేకింగ్, ఈ నెల15వ తేదీన ఎంజియూకు గవర్నర్ రాక, స్నాతకోత్సవానికి హాజరుకానున్న గవర్నర్

    📰 Generate e-Paper Clip

     

    MahathmaGandhiUniversity:   ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ లోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ నాల్గవ స్నాతకో త్సవానికి ముఖ్య అతిథిగా ఈనెల 15న రా ష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ నల్గొండ లోని హాజరుకానున్న దృష్ట్యా అవ సరమైన అన్ని ఏ ర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చెప్పా రు. బుధవారం ఆమె జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తో కలిసి మహాత్మాగాంధీ విశ్వ విద్యాలయాన్ని సం దర్శించి రాష్ట్ర గవర్నర్ పాల్గొననున్న స్నాత కోత్సవ వేదికను పరి శీలించారు. అనంతరం ఆర్ట్స్ కాలేజీ సమా వేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మా ట్లాడుతూ రాష్ట్ర గవర్నర్ రాక సందర్భంగా ఆయా శాఖల అధికా రులు వారి బాధ్యతలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసు కోవాలని చెప్పారు.

    గవర్నర్ రాకను దృష్టిలో ఉంచుకొ ని ప్రత్యేకంగా అధికారులతో ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి ఏర్పాట్లు, ఇతర అంశాలను అందు లో పర్యవేక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.15 న ఎ లాంటి విద్యుత్ అంతరాయం కల గకుండా చూడాలని విద్యుత్ శా ఖ అధికారులను, మెడికల్ టీం, 108, 104 ,ప్రత్యేక డాక్టర్ల బృం దం ఏర్పాటు చూడాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని, అలా గే డయాస్ ఇతర ఏర్పాట్లు ఆర్ అండ్ బి అధి కారులు చూడాలని , తాగునీరు, శానిటేషన్, ఫాగింగ్ వంటివి చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

    జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మా ట్లాడుతూ రాష్ట్ర గవర్నర్ రాక సంద ర్భంగా ముందు నుండే ఎం జి యూ నివర్సిటీ లో పూర్తిస్థాయిలో భద్రత ఏర్పాటు చేస్తామని, తనిఖీలు ఉం టాయని, గుర్తింపు కార్డులు ఉన్న వారిని మాత్రమే ఆ రోజు లోపలికి అనుమతించడం జరుగుతుందని, గేటు వద్ద తనిఖీ కోసం యూనివర్సి టీ తరఫున నలుగురు బృందం స భ్యులు ఏర్పాటు చేయాలని వైస్ ఛాన్స్ లను కోరారు .రాష్ట్ర గవర్నర్ కార్యక్రమానికి హాజరయ్యే అందరి పేర్ల జాబితాను ముందే సమర్పిం చాలని ఆయన కోరారు.

    అంతకు ముందు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అల్వాల్ రవి మాట్లాడుతూ ఈనెల 15 న మహా త్మా గాంధీ విశ్వవిద్యాలయం నాల్గ వ స్నాతకోత్సవం లో భాగంగా ఉద యమే స్పెషల్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, ప్రాథమి క సమాచారం మేరకు ఉదయం 11 గంటలకు రాష్ట్ర గవర్నర్ వస్తారని, తర్వాత కాన్వకేషన్ లో పాల్గొంటా రని, ఈ సందర్భంగా 22 మంది పి హెచ్ డి సాధించిన విద్యార్థులు, 57 మంది గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థులకు మెడల్స్ ప్రధానం ఉం టుందని, అనంతరం గవర్నర్ ప్రసం గం ఉంటాయని, ఒంటిగంటకు కా ర్యక్రమాల అనంతరం గవ ర్నర్ తిరి గి వెళ్తారని, రాష్ట్ర గవర్నర్ కార్యక్ర మాలను సవ్యంగా ని ర్వహించేందుకు గాను యూనివర్సిటీలో సు మారు 12 కమిటీ లను ఏర్పాటు చే యడం జరిగిందని తెలిపారు.

    ఎం జి యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, మి ర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, జిల్లా అటవీ శాఖ అధి కారి రాజశేఖర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డిసిహెచ్ఎస్ మాతృనాయక్, ఎల క్ట్రిసిటీ డి ఈ నదీం అహ్మద్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ శివశంకర్ రెడ్డి, డిఆ ర్డిఓ శేఖర్ రెడ్డి, ఆర్డిఓ అశోక్ రెడ్డి, ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇం జనీ ర్, మిషన్ భగీరథ అధికారులు, త దిత రులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.