Wednesday, September 30, 2026
More
    HomePoliticsCM Revanth Reddy : కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి అప్పీ ల్,భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ...

    CM Revanth Reddy : కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి అప్పీ ల్,భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ అమ‌రావ‌ తి బంద‌రు పోర్ట్‌కు 12 వ‌రుస‌ల గ్రీ న్‌ఫీల్డ్ ర‌హ‌దారి మంజూరు

    📰 Generate e-Paper Clip

    CM Revanth Reddy: ప్రజా దీవెన,ఢిల్లీ: భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి వెం ట‌నే అనుమ‌తులు మంజూరు చే యాల‌ని జాతీయ ర‌హ‌దారుల శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీకి ముఖ్య‌ మం త్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. రాష్ట్ర పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం కూడా తెలంగాణ‌-ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ ధానుల మ‌ధ్య గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి ని ర్మించాల్సి ఉంద‌ని సీఎం గుర్తు చే శారు. తెలంగాణ‌కు స‌ముద్ర రేవు లే నందున బంద‌రు పోర్ట్ వ‌ర‌కు స‌ర‌కు ర‌వాణాకు వీలుగా గ్రీన్ ఫీల్డ్ ర‌హ‌ దారి మంజూరు చేయాల‌ని కోరా రు. ఈ గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారిలో 118 కి లోమీటర్లు తెలంగాణ‌లో ఉంటుం ద‌ని, మిగ‌తా భాగం ఏపీలో ఉం టుంద‌ని సీఎం వివ‌రించారు. జాతీ య ర‌హ‌దారుల శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీతో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఢిల్లీలోని ఆయ‌న నివాసంలో మంగ‌ళ‌వారం రాత్రి స‌మావేశ‌మ‌ య్యారు. ఈ సంద‌ర్బంగా రాష్ట్రం లో ప‌లు జా తీయ ర‌హ‌దారుల ని ర్మాణం, అనుమ‌తులు, ప‌నుల వేగ‌ వంతంపై కేంద్ర మంత్రితో చ‌ర్చించా రు.

    హైద‌రాబాద్ రీజిన‌ల్ రింగు రోడ్డుకు (నార్త్‌) 90 శాతం భూ సేక‌ర‌ణ పూర్త యినందున వెంట‌నే ఫైనాన్షియ‌ల్‌, క్యాబినెట్ అనుమ‌తులు ఇచ్చి ప‌నులు ప్రారంభించాల‌ని కేంద్ర మం త్రి గ‌డ్క‌రీని ముఖ్య‌మంత్రి ఎ.రేవం త్ రెడ్డి కోరారు. ఆర్ఆర్ఆర్ (నార్త్‌) కు స‌మాంత‌రంగా ఆర్ఆర్ఆర్ (సౌ త్‌) ప‌నులు చేప‌ట్టాల‌ని ఇందుకు గానూ వెంట‌నే అన్ని అనుమ‌తులు మంజూరు చేయాల‌ని కేంద్ర మంత్రి కి సీఎం విజ్ఞ‌ప్తి చేశారు. హైద‌రాబా ద్‌ను ప్ర‌సిద్ధ శైవ క్షేత్రం శ్రీ‌శైలంతో అ నుసంధానించే మ‌న్న‌నూర్‌-శ్రీ‌శైలం ర‌హ‌దారి అమ్రాబాద్ టైగ‌ర్ రిజ‌ర్వు ప‌రిధిలో ఉన్నందున నాలుగు వ‌రు స‌ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణా నికి అనుమ‌తులు మంజూరు చే యాల‌ని కేంద్ర మంత్రిని సీఎం కోరా రు.

    ఈ ఎలివేటెడ్ కారిడార్ పూర్త‌యితే ఏపీలోని కృష్ణ‌ప‌ట్నం రేవుతో పాటు మార్కాపురం, కంభం, కనిగిరి, నె ల్లూరుల‌కు రాక‌పోక‌లు సులువవు తాయ‌ని సీఎం తెలిపారు. రావిర్యా ల‌ ఆమ‌న్‌గ‌ల్‌-మ‌న్న‌నూర్ నాలుగు వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారిని నిర్మిం చాల‌ని కేంద్ర మంత్రి గ‌డ్క‌రీని ము ఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కోరారు.

    హైద‌రాబాద్‌-మంచిర్యాల మ‌ధ్య ఉన్న రాజీవ్ ర‌హ‌దారిపై వాహ‌న ర‌ద్దీ అధికంగా ఉన్నందున హైద‌ రాబాద్‌-మంచిర్యాల మధ్య నూ త‌న గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారిని మంజూరు చేయాల‌ని కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌ రీకి ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. సీఆర్ఐఎఫ్ కింద రూ.868 కోట్ల‌తో పంపిన ర‌హ‌దా రుల ప‌నులను మంజూరు చేయా ల‌ని కేంద్ర మంత్రిని సీఎం కోరారు.

    ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి చేసి న విజ్ఞ‌ప్తుల‌కు కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ సానుకూలంగా స్పందించా రు. సీఆర్ఐఎఫ్ ప‌నుల‌కు వారం లోపు అనుమ‌తులు ఇస్తామ‌ని కేంద్ర మంత్రి తెలిపారు. భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ-అమ‌రావ‌తి-బంద‌రు పోర్ట్ గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారికి సంబంధిం చి త‌మ శాఖ అధికారుల‌ను హైద‌ రాబాద్‌కు పంపుతాన‌ని కేంద్ర మం త్రి హామీ ఇచ్చారు.

    ఈ అంశంపై ఎన్‌హెచ్‌, ఎన్‌హెచ్ ఏ ఐ అధికారుల‌ తో ఈ నెల 22వ తే దీన హైద‌రాబా ద్‌లో స‌మీక్ష నిర్వ‌ హిస్తామ‌ని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి గ‌డ్క‌రీకి తెలిపారు. స‌మావే శంలో ఎంపీలు డాక్ట‌ర్ మ‌ల్లు ర‌వి, రేణుకా చౌద‌రి, చామ‌ల కిర‌ణ్ కు మార్ రెడ్డి, రామ‌స‌హాయం ర‌ఘు రాంరెడ్డి, పోరిక బ‌ల‌రాం నాయ‌క్‌, ముఖ్య‌మంత్రి ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ కే.ఎస్‌.శ్రీ‌నివాస రాజు, ఆర్ అండ్ బీ స్పెష‌ల్ చీఫ్ సెక్ర‌ట‌రీ వికాస్ రాజ్‌, పీసీసీఎఫ్ డాక్ట‌ర్ సి.సువ‌ర్ణ‌, కేంద్ర ప్రాజెక్టులు, ప‌థ‌కాల స‌మ‌న్వ‌య‌క‌ర్త డాక్ట‌ర్ గౌర‌వ్ ఉప్ప‌ల్ పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.