Markapuram Horrific Road Accident : ప్రజా దీవెన, అమరావతి: ఆంధ్రప్రదేశ్ మార్కాపురం జిల్లాలో గురు వా రం తెల్లవారుజామున ఒక భయానక హృదయ విదారక ఘ టన చోటుచేసుకుంది. కన్నుమూసి తెరిచే లోపు ఒక క్షణం లోనే ప్రయాణం కాస్తా భయానకవాతావరణo మారిపో యింది. ఈ ఘోర రోడ్డుప్రమాదంలో 13మంది సజీవ దహ నo కాగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
హైదరాబాద్ నుంచి పామూరు వైపు దూసుకెళ్తున్న ఒక ప్రై వేట్ ట్రావెల్ బస్సు రాయవరం సమీపంలోని పలకల క్వారీ ల దగ్గర అకస్మాత్తుగా ముందుకు వచ్చిన టిప్పర్‌ను బలం గా ఢీకొట్టింది. ఢీకొన్న వెంటనే బస్సులోంచి భారీ మంటలు ఎగిసి పడటంతో ఆ ప్రాంతం ఒక్కసారిగా అగ్నికుండలా మా రిపోయింది.
ప్రాణభయంతో కొందరు ప్రయాణి కులు వెంటనే బయటకు దూకి ప్రాణాలు దక్కించుకోగలిగారు. కానీ ఆ కలవరపాటు లోనే మరో 13 మంది మంటల్లో చిక్కుకుని సజీవ దహన మవడం హృదయ విదారకంగా మారింది. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.ఈ దృశ్యాన్ని గమనించిన స్థానికు లు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా సహాయక చ ర్యలు ప్రారంభించారు.
గాయపడిన వారిని సమీప ఆసు పత్రులకు తరలించి ప్రా ణాలు కాపాడే ప్రయత్నం చేశారు. వెంటనే పోలీసులకు, అ గ్నిమాపక సిబ్బం దికి సమాచారం అందించారు.ఘటన స మయంలో బస్సులో మొ త్తం 40 మంది ప్రయాణికులు ఉ న్నట్లు తెలుస్తోంది. అగ్నిమాపక సి బ్బంది మూడు ఫైర్ ఇం జిన్‌లతో మంటలను అదుపులోకి తెచ్చేందు కు తీవ్రంగా శ్ర మిస్తున్నారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంద న్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.
ఈ విషాద ఘటన స్థలాన్ని కందుల నారాయణరెడ్డి పరిశీ లించి, అధికారులను అప్రమత్తం చేశారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తానికి తెల్లవారు జామున జ రిగిన ఈ ఘోర దుర్ఘటన పెను విషాదాన్ని మిగిల్చింది. మృ తుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రా రంభించారు.
ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాం తి వ్యక్తం చేశారు. టిప్పర్-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో బస్సులోని పలువురు ప్రయాణికులు సజీవ దహ నం కావడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంపై ము ఖ్యమంత్రి అధికారులతో మాట్లాడారు. గాయపడిన వారికి అందుతున్న వైద్య సాయంపై ముఖ్యమంత్రి సమాచారం తెలుసుకున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ నుంచి నెల్లూరుకు హరికృష్ణ ట్రావెల్స్ కు చెందిన ఈ బస్సు వెళుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన మరో 20 మందిని తక్ష ణమే వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నా మని జిల్లా పోలీసు అధికారులు ముఖ్యమంత్రికి వివరించా రు. మృతుల సంఖ్యపెరిగే అవకాశం ఉందన్న సమాచారంపై ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.


