Sunday, September 27, 2026
More
    HomeOpinionNalgonda Murder Case : బిగ్ బ్రేకింగ్, ఎనిమిదేళ్ళైనా ఎట్టకే లకు న్యాయం దక్కింది ,...

    Nalgonda Murder Case : బిగ్ బ్రేకింగ్, ఎనిమిదేళ్ళైనా ఎట్టకే లకు న్యాయం దక్కింది , నల్లగొండ హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు 

    📰 Generate e-Paper Clip

    Nalgonda Murder Case : ప్రజా దీవెన, నల్లగొండ: నల్ల గొండ నగరంలో 2018లో సం చలనం సృష్టించిన ఓ హత్య కేసులో కా లంతో పాటు మరుగునపడినా, న్యాయవ్యవస్థ దాన్ని మరిచిపోక పోగా 2026లోన్యాయం తనగ మ్యాన్ని చేరుకుంది. నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగిన హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదీ శిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.

    ఈ మేరకు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించిన వివ రాల ప్రకా రం నల్లగొండ టూ టౌన్ పరిధిలో నమోదైన ఈ కేసులో ప్రత్యేక ఎస్సీ/ఎస్టీ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ప్ర ధాన నిందితుడు ఇప్పటికే మర ణించగా రెండో నిందితుడు మాత్రం చట్టం నుంచి తప్పించుకోలేకపో యాడన్నారు.

    ఈ కేసులో ప్రధాన నిందితుడు మొ హమ్మద్ మొసిన్ ఖాన్ @ మొసిన్ (A1) మరణించగా (A2) నిందితు డు మొహ మ్మద్ దుర్వేశ్ మొహి యుద్దీన్ @ నయాబ్ పై కోర్టు కఠి న శిక్ష విధించింది. 2018 జనవరి 28వ తేదీన రాత్రి సుమారు 10 గంటల సమయంలో నల్లగొండ ప ట్టణంలోని భారత్ గ్యాస్ గోదాం స మీపంలోని ఓపెన్ ప్రదేశంలో కనగల్ మండల కేంద్రానికి చెందిన పాలకురి రమేష్ (30) ట్రాక్టర్ డ్రై వర్ ను నిందితులు దారుణంగా హత్య చేసిన ఘటన చోటు చేసుకుంది. ఈ క్రమంలో 29వ తేదీన మృతుని సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిం చారు. కుటుంబ సభ్యుల మధ్య ఉ న్న వ్యక్తిగత విభేదాలు, పాత గొడ వల కారణంగా ఈ హత్య జరిగిన ట్లు దర్యాప్తులో వెల్లడైంది.

    నిందితుల పైన 2 టౌన్ పోలీస్ స్టేష న్లో U/s 448, 323, 50 4, 506 R/w 302,201,153(A) R/w 34 IPC ప్రకారం కే సు నమోదు చేసి స రైన ఆధారాలు సేకరించి కోర్టులో సమ ర్పించగా నిందితునికి భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 302 ప్రకారం జీవిత ఖైదుతో పాటు రూ.10వేల జరిమానా విధించ బడింది. జరిమానా చెల్లించకపోతే అదనంగా 6 నె లల సాదా కారాగా ర శిక్ష అనుభవించవలసి ఉంటుం దని కోర్టు తన తీర్పులో వెల్లడిం చింది.

    ఈ కేసులో నిందితునికి శిక్షపడే వి దంగా కృషి చేసిన ప్రాసి క్యూషన్ త రఫున అదనపు పబ్లిక్ ప్రాసి క్యూ టర్ గ్రేడ్-I ఆర్. అఖిల, అ ప్పటి దర్యాప్తు అధికారులుగా స బ్ ఇన్‌ స్పెక్టర్ డి. మధు, సీఐలు ఎన్. వెంకటేశ్వర్లు, మహబూబ్ బాషా ప్రస్తుతం డిఎస్పీ శివరాం రెడ్డి, న ల్లగొండ-II టౌన్ స ర్కిల్ సీఐగా ఎస్. రాఘవరావు, ఎస్.ఐ వై. సై దులు సిడిఓ సుమన్, కోర్టు లై జనింగ్ ఆఫీసర్ నరేందర్, మల్లి కార్జున్ ను జిల్లా ఎస్.పి అభినందిoచారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.