Sunday, September 27, 2026
More
    HomeOpinionMgu Big Breaking : బిగ్ బ్రేకింగ్, ఎంజీయూ రిజిస్ట్రార్ గా ఆచార్య కొప్పుల అంజిరెడ్డి...

    Mgu Big Breaking : బిగ్ బ్రేకింగ్, ఎంజీయూ రిజిస్ట్రార్ గా ఆచార్య కొప్పుల అంజిరెడ్డి ని యామకం

    📰 Generate e-Paper Clip

    Mgu Big Breaking : ప్రజా దీవెన, నల్లగొండ: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం నూతన రిజిస్ట్రార్ గా ఆర్థిక శాస్త్ర విభాగం ఆచార్యులు, ఆర్ట్స్, సోషల్ సైన్సెస్ డీన్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సౌమ్యు డిగా, పరిపాలన దక్షి త, క్రమశిక్షణ, నిబద్ధత కలిగి న అధికారిగా మంచి పేరున్న ఆచార్య కొప్పుల అంజిరెడ్డి జీ వితం ఆద్యంతం స్ఫూర్తిదాయకమని ప్రాచుర్యంలో ఉంది.

    స్కూల్ డ్రాప్ అవుట్ గా, ఒక ఏడా ది గొర్రెల కాపరుగా, నేడు విశ్వవిద్యాలయ రెగ్యులర్ రిజిస్టర్ గా ని యామకం ఒక స్ఫూర్తిగాధగా చెప్పుకొస్తున్నారు. నేటి యాదాద్రి భువన గి రి జిల్లా ఆత్మకూరు (ఎం) మండలం సింగారం గ్రామ వాస్త వ్యుడైన ఆచార్య కొప్పుల అంజిరెడ్డి, ప్రాథమిక విద్య స్వ గ్రా మంలో అనంతరం మూడవ తరగతి నుం డి 9వ తరగతి వరకు చాడా గ్రా మంలో, డిగ్రీ వరకు భువనగిరిలో , పీజీ నుండి పీహెచ్డీ వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వి ద్యాభ్యాసం కొనసాగించారు.

    నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు, దిగువ మధ్యతరగతి కు టుంబ నేపథ్యం నుండి వచ్చిన అంజిరెడ్డి తాను ఆరవ తర గతిలో ఉండగా తం డ్రి అనారోగ్యం పాలవడంతో ఏడాది కాలం పాటు గొర్రెలు కాపరిగా కుటుంబానికి చేదోడు వాదో డుగా నిలిచారు. అనంతరం తండ్రికి సహాయకారిగా ఉం టూ విద్యను అభ్య సించి ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేశారు.తనతోపాటు తన సోదరుని సైతం పీహెచ్డీ వరకు ప్రో త్సహించి ఉన్నత విద్యావంతు లుగా కుటుంబాన్ని తీర్చిది ద్దారు.

    దశాబ్ద కాలం పాటు సర్దార్ పటేల్ కళాశాలలో అధ్యాపకుడి గా అనం తరం ఎస్ జిటి అధ్యాపకునిగా, 2 007లో మహా త్మా గాంధీ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్ర విభాగంలో స హాయ ఆచార్యులుగా విధుల్లో చేరి నేడు రిజిస్ట్రార్ గా బా ధ్యతలు స్వీకరించారు.

    విశ్వవిద్యాలయ పరిపాలనలో తనదైన ముద్ర వేస్తూ హాస్ట ల్ వార్డెన్ గా, ఐక్యూ ఏసీ డైరెక్టర్ గా మొట్టమొదట విశ్వవి ద్యాలయానికి న్యా క్ గ్రేడింగ్ సాధనలో విశేష కృషి చే శారు. అనంతరం ఆర్ట్స్ మరియు సోషల్ సైన్సెస్ కళాశాల ప్రిన్సి పాల్ గా సుదీర్ఘకాలం సేవలు అందించడమే గాక ఆడిట్ సెల్ డైరెక్టర్ గా ప రీక్షల నియంత్రణ అధికారిగా, ఉప కులప తికి ఓఎస్డిగా సేవలందించి అందరి మన్ననలు పొందారు.

    విశ్వవిద్యాలయ బాధ్యతలే కాకుండా తెలంగాణ ఎకనామి క్ అ సోసియేషన్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా ఆ ర్థిక శాస్త్రoలో ప రిశోధనలకు తన వంతు కృషి చే స్తున్నారు. రెగ్యులర్ రిజిస్ట్రార్ గా బాధ్యతలు స్వీకరించిన ఆచార్య కొప్పుల అంజిరెడ్డికి ఉప కులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్ మరియు అధికారులు ఆచార్య అ లువాల రవి, ఆచార్య ఆకుల రవి, వివిధ కళాశాలల ప్రిన్సిపాల్ లు అ ధ్యాపకులు విద్యార్థులు అభినంద నలు తెలిపారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.