Sunday, September 27, 2026
More
    HomeOpinionMinister komatireddy venkatreddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్య, వైద్యులు మానవత్వంతో పనిచేయాలి,...

    Minister komatireddy venkatreddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్య, వైద్యులు మానవత్వంతో పనిచేయాలి, పేదలకు వైద్యమoదించాలి

    📰 Generate e-Paper Clip

     

    Minister komatireddy venkatreddy:  ప్రజాదీవెన, నల్ల గొండ: వైద్యులు డాక్టర్లు తెల్లకోటుకు పరిమితం కాకుండా, మానవతాదృక్పథంతో పేదలకు వైద్య సేవలందించాలని రా ష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ ల మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అప్పీల్ చేశారు. గురువా రం నల్గొండ ప్రభు త్వ వైద్య కళాశాల లో “అద్వితీ -2026” పేరున నిర్వ హిం చిన నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాల వార్షి కోత్సవ కార్యక్ర మానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

    ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్ని వృత్తుల కన్నా వైద్య వృత్తి పవిత్రమైనదన్నారు. నల్గొండ ప్రభుత్వ వైద్య క ళాశాల అన్ని ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చే యబడిం దని, వైద్య కళాశాలలో చ దివే విద్యార్థులు సబ్జెక్టులతో పా టు, మానవత్వాన్ని కూడా నేర్చు కోవాలని, తెల్లకోటు బాధ్య తకు “సింబల్ ”అని అన్నారు.కళాశాల లో ఏవైనా సమస్య లు ఉంటే తీ ర్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని , వైద్య క ళాశాల విద్యార్థుల కో సం రెండు ఏసీ బస్సులను మం జూ రుచేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.

    బస్సులు నెలలోపు వీటిని మంజూ రు చేస్తామన్నారు. ఇటీ వలే ఏఐజి ఆసుపత్రి డాక్టర్ నాగేశ్వరరెడ్డిని ప్ర భుత్వ వైద్య కళాశాలకు తీసుకురా వడం జరిగిందని, నల్గొండ ప్రభు త్వ వైద్య కళాశాలలో చదివిన పి జి విద్యార్థులను పరిశోధన నిమి త్తం తన ఆసుపత్రిలో ప్రతి సంవ త్సరం 45మంది చొ ప్పున తీసుకునేందుకు అంగీకరించారని, ఇందుకు సంబం ధించిన ఎంఓయును త్వరలోనే కుదుర్చుకోనున్నట్లు ఆ య న వెల్లడించారు.

    నల్గొండ పట్టణంలో వైద్య విద్యనే కాకుండా, చదువుకోసం ప్రతి పేద విద్యార్థికి సహకారం అందిస్తామని, ఇందుకు తమ ను సంప్రదించాలని, విద్యాభివృద్ధిలో భాగంగా బోట్టు గూడా ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలను, అలాగే ప్రతిక్ ప్రభు త్వ జూనియర్ కళాశాలను కోట్లాది రూపాయలతో అభివృ ద్ధి చేయడం జరిగిందని , పట్టణంలోని మరికొన్ని పాఠశాల లను కార్పొరేట్ తర హాలో తీర్చిదిద్దుతామని, 900 కోట్ల రూ పాయలతో అవుటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తున్నామని, రాబోయే రోజుల్లో నల్గొండను స్మార్ట్ సిటీగా, మోడల్ సిటీగా చేస్తామని తెలిపా రు.

    నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీని వాస్ రెడ్డి మాట్లాడుతూ కాబోయే డాక్టర్లు గ్రామాలలో పేద ప్రజలకు సేవలు అందిం చాలని, నల్లగొండ మెడికల్ కళాశాలకు అవసరమైతే కార్పో రేషన్ పరంగా కూడా తమ సంపూర్ణ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు.రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీని వాస్ మాట్లాడుతూ డాక్టర్ వత్తి పవిత్రమైందని, రోగులను చి రునవ్వుతో పలకరించి వారికి వైద్యం చేయాలని సూచిం చారు.

    డిప్యూటీ మేయర్ అమీర్ ఆశ్రఫ్ అ లీ, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ స త్యనారాయణ ,మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీని వాస్ రెడ్డి ,మాజీ జె డ్పిటిసి గుమ్మల మోహన్ రెడ్డి , డా క్టర్లు ఆయా వైద్య విభాగాల అధిప తులు తదితరులు ఈ కార్య క్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భం గా మంత్రి మేయర్లు వివిధ పోటీ లలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతు లు పంపిణీ చేశారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.