Sunday, September 27, 2026
More
    HomeOpinionMinister Komatireddy Venkat Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీ లక వ్యాఖ్య, ఎస్ఎల్బీసీ...

    Minister Komatireddy Venkat Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీ లక వ్యాఖ్య, ఎస్ఎల్బీసీ పూర్తే నా అంతిమలక్ష్యం 

    📰 Generate e-Paper Clip

    Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ నియోజకవర్గ రూపురేఖలను మార్చే దిశగా రాష్ట్ర రోడ్లు, భవ నాలు, సినిమటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి మరో కీల క అడుగు వేశారు. నల్ల గొండ మండలం కంచనపల్లి గ్రామంలో రూపుదిద్దుకున్న నూ తన డిజిట ల్ గ్రామ పంచాయతీ భవనాన్ని ఆదివారం ఆ యన వైభవంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి కో మటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ స మగ్ర అభివృద్ధిపై తనకున్న స్పష్ట మైన విజన్‌ను పంచుకున్నారు.

    ప్రాజెక్టుల పురోగతిపై మంత్రి స్పందిస్తూ, జిల్లా భావితరాల భవిష్యత్తు ఎస్ఎల్బీసీ(SLBC) పైనే ఆధారపడి ఉందన్నా రు.

          రెండు పంటలకు నీళ్లు

    “ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని వేగవంతంగా పూర్తి చేసి, రెండు పంటలకు సమృద్ధిగా సాగునీరు అందించడమే నా ఏకైక లక్ష్యం. ఈ జిల్లాను సుజల సఫలం, శ స్యశ్యామలం చేసే వరకు విశ్ర మించేది లేదని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రాంతంలో ఉన్న ప్రతి ఎకరానికీ సాగునీరు అందించి, రైతులకు కొండంత అండగా ఉంటామని హామీ ఇ చ్చారు.

         కంచనపల్లికి ‘మోడల్’ హోదా

    గ్రామీణ మౌలిక వసతుల కల్పన లో భాగంగా కంచనపల్లికి రెండు కీలక వరాలు ప్రకటించారు మంత్రి కోమటిరెడ్డి వెం కటరెడ్డి. కంచ నపల్లిని జిల్లాలోనే అత్యుత్తమ సదుపా యా లున్న మోడల్ విలే జ్ గా తీర్చిదిద్దుతామని ప్రకటిం చారు. అదే విధంగా గ్రామంలో రూ. 3 కోట్ల వ్యయంతో నూతన విద్యుత్ సబ్-స్టేషన్ మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు.

    దోమలపల్లిలో కార్పొరేట్ స్థాయి విద్య

    ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ పేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థా యి నాణ్యమైన విద్యను అందిం చేందుకు దోమలపల్లి గ్రామంలో ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ ఏ ర్పా టు చేస్తున్నట్లు మంత్రి తెలిపా రు. ఈ స్కూల్ ద్వారా గ్రామీణ ప్రాంత పిల్లల భవిష్యత్తు మారు తుందని ధీమా వ్యక్తం చేశారు.

    వారానికి రెండురోజులు మీచెంతనే

    నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చిం ది నల్గొండ నియోజకవర్గ ప్రజలే. ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేను. రాబోయే మూడేళ్లు నల్గొండ నియోజకవర్గంపైనే ప్ర త్యేక దృష్టి సారిం చి ఊహించని రీతిలో అభివృద్ధి చేస్తా. వారంలో కనీసం రెం డు రోజులు నియో జ కవర్గంలోనే ఉంటూ, ఏ పేదవాడికి కష్టం వచ్చినా కొండంత అండ గా నిలబడతామని కోమ టి రెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. నల్గొండ అభివృద్ధి పథంలో కం చనపల్లి వే డుక ఒక మైలురాయిగా నిలిచి పోతుందని స్థా నిక నాయకులు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.